Elections Results: మరికాసేపట్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం.. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మరి కాసేపట్లో వెల్లడకాబోతున్నారు. మిని సంగ్రామంగా సాగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారనన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది.

Elections Results: మరికాసేపట్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం.. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..
Election Counting
Follow us

|

Updated on: May 02, 2021 | 6:47 AM

5 states Elections Results:  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మరి కాసేపట్లో వెల్లడకాబోతున్నారు. మిని సంగ్రామంగా సాగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారనన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. దేశంలో కరోనా వ్యాప్తం నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కౌటింగ్ ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు, ఖాళీగా ఉన్న లోక్‌సభ ఉపఎన్నికలు జరిగిన చోట ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.

ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడనున్నాయి. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈసీ పేర్కొంది. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో మాస్క్‌లు, ఫేస్ షీల్డులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. కౌంటింగ్ ప్రారంభించిన కాసేపటి తర్వాత ట్రెండ్స్ తెలిసిపోతాయి. ఉదయం10 గంటల కల్లా ఒక క్లారిటీ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 దశల్లో పోలింగ్ నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 140 సీట్లున్న కేరళ అసెంబ్లీతో పాటు పుదుచ్చేరిలోనూ ఏప్రిల్ 6న ఒకేదశలో పోలింగ్ జరిగింది. అసోంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించారు. అయితే, పశ్చిమ బెంగాల్‌పైనే అందరి దృష్టి నెలకొంది. బెంగాల్‌లో మళ్లీ అధికారంలోకి రావాలని దీదీ, మమతాను ఓడించేందుకు బీజేపీ సర్వ శక్తులూ ఒడ్డింది. కాగా, మెజారిటీ సర్వేలు టీఎంసీకి అనుకూలంగా ఉండగా.. మరికొన్ని బీజేపీ గెలుస్తాయని చెప్పాయి. ఇక, తమిళనాడులో డీఎంకే, కేరళలో ఎల్డీఎఫ్, అసోంలో బీజేపీ, పుదుచ్చేరిలో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిల్ పోల్స్ అంచనా వేశాయి. వీటన్నింటికి మరికాసేపట్లో తెరపడనుంది.

తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఉపఎన్నికలు జరిగాయి. ఏపీలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి, తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఈ ఫలితాలు కూడా ఆదివారం రానున్నాయి. ఐతే తిరుపతిలో వైసీపీ, సాగర్‌లో టీఆర్ఎస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మరి ఐదు రాష్ట్రాలతో ఎవరెవరు అధికారం చేపడతారు? ఉపఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్నది.. కొన్ని గంటల్లోనే తేలనుంది.

Read Also… Amazing Facts: పశ్చిమబెంగాల్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు.. హౌరా నుంచి ఎస్‌బీఐ వరకు అన్ని ఆశ్యర్యపరిచే అంశాలే..!