AP Crime News: అనంతపురం జిల్లాలో తహశీల్దార్ అవినీతి బాగోతం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన వైనం

అనంతపురం జిల్లాలో తహశీల్దార్ అవినీతి బాగోతం బయటపడింది. ఒక రైతుకు సంబంధించిన భూమి ఆన్ లైన్ లో....

AP Crime News: అనంతపురం జిల్లాలో తహశీల్దార్ అవినీతి బాగోతం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన వైనం
Acb
Follow us

|

Updated on: May 01, 2021 | 10:46 PM

అనంతపురం జిల్లాలో తహశీల్దార్ అవినీతి బాగోతం బయటపడింది. ఒక రైతుకు సంబంధించిన భూమి ఆన్ లైన్ లో చేర్చేందుకు రెండు లక్షలు డిమాండ్ చేశారు ముదిగుబ్బ తహసీల్దార్ అన్వర్ హుస్సేన్. అయితే తన చేతికి మట్టి అంటకుండా వీఆర్వోకు లంచం ఇవ్వాలని తెలివిగా ప్రవర్తించాడు. అయితే బాధిత రైతు ఏసీబీ ఆశ్రయించడంతో మొత్తం బాగోతం బయటపడింది.

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం తాండాకు చెందిన గోపాల్ నాయక్ తన భూమిని ఆన్ లైన్ లో చేర్చాలంటూ తహశీల్దార్ అన్వర్ హుస్సేన్ ను ఆశ్రయించారు. గోపాల్‌నాయక్‌కు రాళ్ల అనంతపురం పరిధిలో సర్వేనెంబర్‌ 167-1లో 90 సెంట్ల సాగు భూమి ఉంది. ఈ పొలం ఆయన తండ్రికాలం నుంచి సాగులో ఉంది. అయితే ఆ రైతుకు ఈ పొలంపై ఎటువంటి హక్కులేకపోవడంతో అన్‌లైన్‌ పాసుపుస్తకాల కోసం తహశీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోలేదు.

చివరికి పని కావాలంటే అనంతపురంలోని తన ఇంటి వద్దకు రావాలని గోపాల్‌ నాయక్‌కు తహశీల్దార్‌ చెప్పాడు. రైతు అక్కడికి వెళ్లగా 5 లక్షల రూపాయలు ఇస్తేనే పని అవుతుందని చెప్పాడు. ఇందుకు రైతు తన వద్ద 2లక్షలు ఉన్నాయని చెప్పడంతో మొదట ఒప్పుకోలేదు. ఆ తరువాత డబ్బు వీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి కి ఇవ్వాలని పని అయిపోతుందని చెప్పాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని గోపాల్ నాయక్ ఏసీబీని ఆశ్రయించాడు. గోపాల్ నాయక్ వీఆర్వోకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Also Read: కోవిడ్ పై పోరులో మీకు సహకరిస్తాం, మీ ఆర్దర్లను అడ్డుకోకుండా చూస్తాం, సోను సూద్ కు చైనా రాయబారి హామీ

కరోనాపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులకు కీలక ఆదేశాలు.. పర్యవేక్షణకు సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి నియామకం