తెలంగాణ భవన్ కు అంటుకున్న మంటలు.. నాగార్జు సాగర్ ఉప ఎన్నిక విజయోత్సవ వేడుకల్లో అపశృతి
తెలంగాణ భవన్‌లో అపశృతి చోటు చేసుకుంది. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం దిశగా దూసుకెళ్తుండటంతో అటు సాగర్‌తో పాటు ఇటు హైదరాబాద్‌లోనూ..
తెలంగాణ భవన్‌లో అపశృతి చోటు చేసుకుంది. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం దిశగా దూసుకెళ్తుండటంతో అటు సాగర్‌తో పాటు ఇటు హైదరాబాద్‌లోనూ కార్యకర్తలు, టీఆర్ఎస్ అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాలు షురూ చేశాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లోనూ పార్టీ నేతలు, పలువురు ముఖ్య కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
తెలంగాణ భవన్‌లో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణా సంచాలు కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ ఈలలు, కేకలతో హోరెత్తిస్తున్నారు. ఈ సంబరాల్లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
అయితే బాణసంచాల మంటల థాటికి ఒక్కసారిగా పార్టీకో పందిరి అంటుకుంది. దీంతో మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ఏమీ జరగలేదు.
Read More:
మమత, సువేందు మధ్య ఆధిక్యం దోబూచులాట.. నందిగ్రామ్ లో గంట గంటకు మారుతోన్న ఎన్నికల ఫలితాలు
సాగర్ ఫలితాల్లో కారో జోరు.. 18వ రౌండ్ ముగిసేసరికి నోముల భగత్‌కు 13,396 ఓట్ల ఆధిక్యం