మమత, సువేందు మధ్య ఆధిక్యం దోబూచులాట.. నందిగ్రామ్ లో గంట గంటకు మారుతోన్న ఎన్నికల ఫలితాలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు ఎంత ఉత్కంఠగా సాగాయో.. ఎన్నికలు ఫలితాలు అంతకు మించి ఉత్కంఠను రేపుతున్నాయి. ఎన్నికల ఫ‌లితాల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని..

మమత, సువేందు మధ్య ఆధిక్యం దోబూచులాట.. నందిగ్రామ్ లో గంట గంటకు మారుతోన్న ఎన్నికల ఫలితాలు
Follow us
K Sammaiah

|

Updated on: May 02, 2021 | 1:58 PM

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు ఎంత ఉత్కంఠగా సాగాయో.. ఎన్నికలు ఫలితాలు అంతకు మించి ఉత్కంఠను రేపుతున్నాయి. ఎన్నికల ఫ‌లితాల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ప‌య‌నిస్తున్న‌ప్ప‌టికీ దీదీ మాత్రం నందిగ్రాంలో తొలుత వెన‌క‌బ‌డ్డారు. ఆ నియోజ‌క వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై పోటీ చేసిన విష‌యం తెలిసిందే.

నాలుగో రౌండ్‌ ముగిసే సమయానికి మ‌మ‌తా బెన‌ర్జీ క‌న్నా సువేందు అధికారి 8,000 ఓట్ల‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి సువేందు అధికారి బీజేపీలో చేరగా, మ‌మ‌తా బెన‌ర్జీ పంతం ప‌ట్టి ఆయ‌న‌ను ఓడించి తీరాలన్న ఉద్దేశంతో నందిగ్రామ్ నుంచే పోటీ చేశారు.

ఆయ‌న‌పై అల‌వోక‌గా గెలుస్తాన‌ని, అంతేగాక‌, రాష్ట్రంలో ఎక్క‌డి నుంచి పోటీ చేసినా గెలుస్తాన‌ని ఆమె స‌వాళ్లు విసిరారు. చివ‌ర‌కు ఆమె భారీ ఓట్ల‌తో వెన‌క‌ప‌డిపోతుండ‌డం గ‌మ‌నార్హం. కాగా, తృణమూల్‌ కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో 160 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు గానూ ఎన్నిక‌లు జ‌రిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 147 స్థానాల్లో గెల‌వాల్సి ఉంది. ఇప్ప‌టికే తృణ‌మూల్ కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాటి ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం వెన‌క‌బ‌డి పోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ఆరో రౌండ్‌లో నందిగ్రామ్‌లో మమత అనూహ్యంగా దూసుకొచ్చారు. సువేందు అధికారిపై ఇప్పటిదాకా దాదాపు 8వేలకుపైగా ఓట్ల వెనుకంజలో ఉన్న మమత 6వ రౌండ్‌లో 1427ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. లీడింగ్‌లోడబుల్‌ సెంచరీ మార్క్‌ను దాటేసింది టీఎంసీ. 201 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో టీఎంసీ జోరు మీఉంది. ఐదో రౌండ్‌లోనే 8,201 నుంచి 3వేలకు సువేందు ఆధిక్యం పడిపోయింది.

కౌంటింగ్‌లో భాగంగా అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 1,113 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశారు. ఇక మళ్లీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. ప్రతిపక్ష బీజేపీ సైతం గట్టి పోటీ ఇచ్చింది. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌-బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెల్లడించాయి.

కీలకమైన పశ్చిమ బెంగాల్‌లో మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 29 దాకా 8 దశల్లో 294 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 108 కేంద్రాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 256 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఓట్ల లెక్కింపునకు ముందే ఈవీఎంలు, వీవీప్యాట్‌లను శానిటైజ్‌ చేయనున్నారు.

మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ