TamilNadu Kerala Puducherry Election Results Highlights: త‌మిళ‌నాడులో డీఎంకే, కేరళ‌లో ఎల్డీఎఫ్‌, పుదుచ్చేరిలో బీజేపీ..

| Edited By: Ram Naramaneni

Updated on: May 02, 2021 | 10:47 PM

South States Assembly Results Highlight: ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నిక‌ల్లో భాగంగా త‌మిళ‌నాడు, కేర‌ళ, పుదుచ్చేరిలో ఓట్లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆదివారం ఉద‌యం నుంచి మొద‌లైన ఓట్ల లెక్కింపు ముగింపు ద‌శ‌కు..

TamilNadu Kerala Puducherry Election Results Highlights: త‌మిళ‌నాడులో డీఎంకే, కేరళ‌లో ఎల్డీఎఫ్‌, పుదుచ్చేరిలో బీజేపీ..
Kerala Tamil Nadi Results

South States Assembly Results Highlight: ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నిక‌ల్లో భాగంగా త‌మిళ‌నాడు, కేర‌ళ, పుదుచ్చేరిలో ఓట్లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆదివారం ఉద‌యం నుంచి మొద‌లైన ఓట్ల లెక్కింపు ముగింపు ద‌శ‌కు చేరుకుంది. మినీ సంగ్రామంగా మారిన ఈ ఎన్నిక‌ల్లో పార్టీలు త‌మ శ‌క్తివంచ‌న మేర‌కు కృషి చేశాయి. త‌మిళ‌నాడులో డీఎంకే 131 చోట్ల విజ‌యం సాధించి అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంది. ఇక ఇక్క‌డ అన్నా డీఎంకే దాదాపు 70 స్థానాల‌ను సాధించి మంచి పోటీనే ఇచ్చింది. ఇక కేర‌ళ విష‌యానికొస్తే.. ఇక్కడ ఎల్డీఎఫ్‌ 84 స్థానాలు సాధించగా  యూడీఎఫ్‌ 44 స్థానాలతో సరిపెట్టుకుంది. పుదుచ్చేరిలో పోటాపోటీగా న‌డిచింది. నిజానికి ఇక్క‌డ ఎన్డీఏ స్పష్టమైన విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పాయి. కానీ, మొత్తం 30 స్థానాలకుగాను అతి కష్టం మీద 16 స్థానాలతో మెజారిటీ మార్కుకు ఎన్డీఏ కూటమి చేరుకోగలిగింది.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మొత్తం 8 దశల్లో పోలింగ్ నిర్వహించారు. మొదటి దశ ఎన్నికల పోలింగ్ మార్చి 27న ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 1న, మూడో దశ ఎన్నికలు ఏప్రిల్ 6, నాలుగో దశ ఎన్నికలు ఏప్రిల్ 10న, ఐదో దశ ఎన్నికలు ఏప్రిల్ 17న, ఆరోదశ ఎన్నికలు ఏప్రిల్ 23న, ఏడో దశ ఎన్నికలు ఏప్రిల్ 26న, ఎనిమిదో దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరిగాయి.

తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకేదశలో పోలింగ్ జరిగింది. 71.43 శాతం పోలింగ్ నమోదయింది. 140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. 73.58శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 234 స్థానాలున్నతమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకుంది. ఇక్కడ వరుసగా మూడోసారి అధికారం కోసం అన్నాడీఎంకే, పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే పోటా పోటీగా ప్రచారం నిర్వహించాయి. వివిధ వార్త సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఈసారి తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు కనిపించింది. ఏఐడీఎంకేను కాదని, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కు తమిళ ప్రజలు పట్టం కట్టినట్లు సర్వేలు నివేదించాయి. మొత్తం 140 స్థానాలున్న కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే పోటీ జరిగింది. దేవభూమిగా పేరొందిన కేరళలో ఎర్రజెండా మరోమారు రెపరెపలాడనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అధికార ఎల్డీఎఫ్(లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తుందని కొందరు.. స్వల్ప మెజారిటీతో బయటపడుతుందని మరికొన్ని సర్వే సంస్థలు జోస్యం చెప్పాయి. శబరిమల వివాదం, గోల్డ్ స్మగ్లింగ్ కేసులతో తమకు అనుకూలంగా ఉంటుందని భావించిన బీజేపీ నిరాశే ఎదురవుతుందని విశ్లేషణలు అంటున్నారు. ఇక్కడ బీజేపీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంటుందని చెబుతున్నారు..

అటు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా.. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, డీఎంకే-కాంగ్రెస్ కూటమి ముమ్మర ప్రచారం చేశాయి. అయితే, సౌత్‌లో కమలదళం పాగా వేయనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. తమిళనాడులో డీఎంకే ప్రభంజనం కొనసాగినా పుదుచ్చేరిలో మాత్రం ఫలితాలు భిన్నంగా ఉంటాయని.. కేంద్ర పాలిత ప్రాంతం కమలదళానికి అనుకూల ఫలితాలు తెచ్చిపెడుతోందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి.

మొత్తం 140 స్థానాలున్న కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే పోటీ జరిగింది. దేవభూమిగా పేరొందిన కేరళలో ఎర్రజెండా మరోమారు రెపరెపలాడనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అధికార ఎల్డీఎఫ్(లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తుందని కొందరు.. స్వల్ప మెజారిటీతో బయటపడుతుందని మరికొన్ని సర్వే సంస్థలు జోస్యం చెప్పాయి. శబరిమల వివాదం, గోల్డ్ స్మగ్లింగ్ కేసులతో తమకు అనుకూలంగా ఉంటుందని భావించిన బీజేపీ నిరాశే ఎదురవుతుందని విశ్లేషణలు అంటున్నారు. ఇక్కడ బీజేపీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంటుందని చెబుతున్నారు..

అటు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా.. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, డీఎంకే-కాంగ్రెస్ కూటమి ముమ్మర ప్రచారం చేశాయి. అయితే, సౌత్‌లో కమలదళం పాగా వేయనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. తమిళనాడులో డీఎంకే ప్రభంజనం కొనసాగినా పుదుచ్చేరిలో మాత్రం ఫలితాలు భిన్నంగా ఉంటాయని.. కేంద్ర పాలిత ప్రాంతం కమలదళానికి అనుకూల ఫలితాలు తెచ్చిపెడుతోందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 May 2021 10:07 PM (IST)

    క‌మ‌ల్ హాస‌న్‌, ఖుష్బూ ఓట‌మి..

    త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఇద్ద‌రు సినీ తార‌లు క‌మ‌ల్ హాస‌న్‌, ఖుష్బూ ఓట‌మి పాల‌య్యారు. మక్కల్‌నీది మయ్యం పార్టీతో ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చిన‌ కమల్‌ హాసన్ ఓడిపోయారు. కోయంబత్తూరు నుంచి బరిలో దిగిన ఆయన భాజపా అభ్యర్థి వనతి శ్రీనివాసన్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక భాజపా అభ్యర్థి ఖుష్బూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. థౌజెండ్‌ లైట్స్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆమె డీఎంకే అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు.

  • 02 May 2021 07:50 PM (IST)

    భారీ మెజార్టీతో గెలిచిన పిన‌ర‌యి విజ‌య‌న్‌.. క‌రోనపై పోరాటం కొన‌సాగించాల‌ని ట్వీట్‌..

    కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్ర ముఖ్య‌మంత్రి సీపీఎం నాయ‌కుడు పిన‌ర‌యి విజ‌య్ విజ‌యం సాధించారు. కాంగ్రెస్ నేత రఘునాథ‌నపై ధ‌ర్మ‌దాం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 50,123 ఓట్ల భారీ తేడాతో విజ‌యం సాధించారు. ఈ నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించిన విజ‌య్‌.. ఈ విజ‌యం కేర‌ళ‌కు ప్ర‌జ‌ల‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఎల్‌డీఎఫ్ మ‌రోసారి అధికారంలోకి రావ‌డానికి కృషిచేసిన వారికి కృత‌జ్ఞ‌త తెలిపారు. క‌రోనా క‌ట్ట‌డికి మ‌రింత రెట్టింపు ఉత్సాహంతో ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పిన విజ‌యన్‌.. కేర‌ళను అభివృద్ధి ప‌థంలో తీసుకెళ్తా నంటూ ట్వీట్ చేశారు.

  • 02 May 2021 06:40 PM (IST)

    పుదుచ్చేరిలో అధికారంలోకి వ‌చ్చేది ఎవ‌రు.?

    పుదుచ్చేరిలో ఏఐఎన్‌ఆర్‌సీ 9 చోట్ల గెలుపొంది మరో 4 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక ఐఎన్‌ఎస్‌ 3 చోట్ల గెలుపొంది మరో మూడు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు మూడు చోట్ల గెలుపొందారు. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే 30 స్థానాలున్న పుదుచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 15 స్థానాలకు మించి గెల‌వాల్సి ఉంది.

  • 02 May 2021 06:28 PM (IST)

    కేర‌ళ‌లో ప‌రిస్థితి ఎలా ఉందంటే..

    కేర‌ళలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 88 స్థానాల్లో విజ‌యం సాధించిన ఎల్‌డీఎఫ్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది. మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. యూడీఎఫ్‌ 37 స్థానాలు గెలుచుకోగా, మరో నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 02 May 2021 06:24 PM (IST)

    డీఎంకేకు స్ప‌ష్ట‌మైన ఆధిక్యం..

    సాయంత్రం 6 గంట‌ల‌కు వ‌ర‌కు వ‌చ్చిన ఫ‌లితాల ప్ర‌కారం త‌మిళ‌నాడులో డీఎంకేకు స్ప‌ష్ట‌మైన ఆధిక్యం ల‌భించింది. ఇప్పటికే 50 స్థానాల్లో విజయం సాధించగా, ఇంకా 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఏడీఎంకే 17 స్థానాల్లో గెలుపొంది 61 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 02 May 2021 05:28 PM (IST)

    కేర‌ళ‌లో మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాటేసిన అధికార ఎల్‌డీఎఫ్‌..

    కేర‌ళ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార ఎల్‌డీఎఫ్ కూట‌మి మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాటేసింది. కేర‌ళ‌ల‌లో 40 ఏళ్ల త‌ర్వాత వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన ఎల్‌డీఎఫ్ చ‌రిత్ర సృష్టించింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఒక్క సీటును కూడా బీజేపీ కోల్పోయింది.

  • 02 May 2021 05:11 PM (IST)

    పుదుచ్చేరిలో తాజాగా గెలుపొందిన బీజేపీ, కాంగ్రెస్ అభ్య‌ర్థులు..

    * కామరాజునగర్‌లో బీజేపీ అభ్యర్థి జాన్‌కుమార్ * కదిర్‌గమమ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సెల్వనాథనె * మహెలో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ * మన్నాడిపేట బీజేపీ అభ్యర్థి ఎ.నమఃశివాయం

  • 02 May 2021 05:04 PM (IST)

    బీజేపీ చీఫ్ సురేంద్ర‌న్ ఓట‌మి..

    తాజాగా వెలువ‌డుతోన్న ఫ‌లితాలు చూస్తుంటే.. కేర‌ళ‌లో బీజేపీకి తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. బీజేపీ నేత‌ల ప‌రాజ‌యమే దీనికి సాక్ష్యంగా క‌నిపిస్తోంది. తాజాగా కేర‌ళ రాష్ట్ర బీజేపీ ఛీఫ్ సురేంద్ర‌న్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. సురేంద్ర‌న్ మంజేశ్వ‌ర్‌, కొణ్ణి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌మి పాల‌య్యారు.

  • 02 May 2021 04:58 PM (IST)

    మెట్రోమాన్‌కు ఎదురు దెబ్బ‌.. కాంగ్రెస్ అభ్య‌ర్థి చేతిలో ఓటమి..

    కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మెట్రోమాన్ శ్రీధ‌ర‌ణ్‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. పాల‌క్క‌డ్ నుంచి పోటిలోకి దిగిన శ్రీ ధ‌ర‌ణ్ కాంగ్రెస్ అభ్య‌ర్థి ష‌ఫి ప‌రంబిల్ చేతో ఓట‌మిపాల‌య్యారు. ఇదిలా ఉంటే కేరళలో ఎల్డీఫ్‌ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ‌లో అడుగులు వేస్తోంది.

  • 02 May 2021 04:13 PM (IST)

    వెనుకంజ‌లో మాజీ సీఎం.. ఆధిక్యంలో ఇండిపెండెంట్ అభ్య‌ర్థి..

    పుదుచ్చేరి మాజీ సీఎం ఎన్‌. రంగ‌స్వామి వెనుకంజ‌లో ఉన్నారు. యానాం నుంచి పోటీ చేస్తోన్న ఆయ‌న ప్ర‌స్తుతం ఫ‌లితాల్లో వెన‌క‌బ‌డ్డారు. ఈయ‌న‌పై స్వ‌తంత్ర అభ్య‌ర్థి అశోక్ 674 ఓట్ల ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.

  • 02 May 2021 04:07 PM (IST)

    కేర‌ళ ఆరోగ్య శాఖ మంత్రి ఘ‌న విజ‌యం.. చ‌రిత్ర‌లో తొలిసారి..

    కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌లో అరుదైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. కేర‌ళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె శైలజ.. మట్టన్నూర్ నియోజకవర్గం నుంచి 61,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేరళ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీ గెలిచిన చరిత్ర ఇదేనని చెబుతున్నారు.

  • 02 May 2021 03:52 PM (IST)

    స్టాలిన్‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌..

    త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌నదైన ముద్ర‌వేస్తూ మ్యాజిక్ ఫిగ‌ర్‌ను అందుకున్న స్టాలిన్‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచినందుకు స్టాలిన్‌కు శుభాకాంక్ష‌లు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల ఆకంక్ష‌ల‌ను నేర‌వేర్చ‌డంలో స్టాలిన్ విజ‌య‌వంత‌మ‌వ్వాల‌ని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.

  • 02 May 2021 03:41 PM (IST)

    ఉద‌య‌నిధి స్టాలిన్ విజ‌యం..

    Udaya Nidhi

    Udaya Nidhi

    సినీ న‌టుడు ఉద‌య‌నిధి స్టాలిన్ విజ‌యం సాధించారు. చేపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్ భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఉద‌య‌నిధి ఎన్నిక‌ల్లో పాల్గొన‌డం ఇదే తొలిసార‌నే విష‌యం తెలిసిందే.

  • 02 May 2021 03:32 PM (IST)

    న‌టుడు సురేశ్ గోపి ఓటమి..

    Suresh Gopi

    Suresh Gopi

    కేర‌ళ‌లో బీజేపీ పార్టీ ప్ర‌భావం క‌నిపించ‌డంలేదు. కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే ఆదిక్యంలో ఉన్నారు. ఇక త్రిస్సూర్ నుంచి బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసిన న‌టుడు సురేశ్ గోపి ఓట‌మి పాల‌య్యారు.

  • 02 May 2021 03:26 PM (IST)

    కేర‌ళలో కామ్రేడ్లు దూసుకెళుతున్నారు..

    కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కామ్రేడ్లు దూసుకెళ్తున్నారు. యూడీఎఫ్‌పై స్ప‌ష్ట‌మైన ఆధిక్యం దిశ‌లో పయ‌నిస్తున్నారు. మొత్తం 140 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్​ నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇక ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. బీజేపీ త‌ర‌ఫున నిమోమ్ నుంచి పోటీ చేసిన కుమ్మ‌న‌మ్ రాజ‌శేఖ‌ర‌న్‌, పాల‌క్క‌డ్ నుంచి పోటీ చేసిన మెట్రోమ్యాన్ శ్రీధ‌ర‌న్ మాత్రం ఆధిక్యంలో ఉన్నారు.

  • 02 May 2021 02:14 PM (IST)

    పుదుచ్చేరిలో ఎన్డీఏదే హవా

    పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 16, యూపీఏ 12 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుుతున్నారు. పుదుచ్చేరిలో మొత్తం సీట్లు 30, మ్యాజిక్ ఫిగర్ 16. ఇప్పటివరకూ చూస్తే ఎన్డీఏ అధికారం దక్కించుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే వెలువడిన ఫలితాల్లో రెండు చోట్ల బీజేపీ విజయం సాధించింది.

  • 02 May 2021 02:13 PM (IST)

    కేరళలో లెఫ్ట్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం!

    కేరళలో ఎల్డీఎఫ్ కూటమి ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 5చోట్ల విజయం సాధించగా, 97 సీట్లలో ముందంజలో ఉంది. యూడీఎఫ్ కూటమి 42, ఎన్డీఏ 1 స్థానంలో అధిక్యంలో ఉన్నాయి. కేరళలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 140. అధికారంలోకి వచ్చేందుకు కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 71 సీట్లు. కాగా ఎల్డీఎఫ్ 97 స్థానాల్లో అధిక్యం కనబరుస్తోంది. దీంతో మరోసారి లెఫ్ట్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తో్ంది.

  • 02 May 2021 02:10 PM (IST)

    తమిళనాట తిరుగులేని శక్తిగా డీఎంకే

    తమిళనాడులో డీఎంకే సత్తా చాటుతోంది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ, అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 118. ఇక, ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో అనుహ్యంగా డీఎంకే 145 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే 88, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.

  • 02 May 2021 02:03 PM (IST)

    విజయ వేడుకలపై నిషేధం.. ఉల్లంఘిస్తే కఠినచర్యలుః ఈసీ

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయ వేడుకలను అత్యవసరంగా నిషేధించాలని భారత ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. బాధ్యతారహితంగా వ్యవహరించే ఎస్‌హెచ్‌ఓలు, ఇతర అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించింది. వారిపై నేర, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.

  • 02 May 2021 01:58 PM (IST)

    వారి వారి ఇళ్ల వద్దే సంబరాలు జరుపుకోండిః డీఎంకే

    తమిళనాడులో అధికార పగ్గాలు చేపట్టే దిశగా డీఎంకే దూసుకుపోతుంది. విజయోత్సవ సంబరాలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. కాగా, ఈసీ ఉత్తర్వులను బాధ్యత కలిగిన పార్టీగా గౌరవిస్తామని డీఎంకే నేత టికెఎస్ ఎలంగోవన్ అన్నారు. పార్టీ కార్యకర్తలు వారి వారి ఇళ్ల వద్దే విజయోత్సవ సంబరాలు జరుపుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు.

  • 02 May 2021 01:51 PM (IST)

    బెంగాల్‌లో పత్తాలేని ఎంఐఎం

    బెంగాల్ ఎన్నికల్లో పోటీచేసిన అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎఐఎంఐఎం పత్తా లేకుండాపోయింది. ముస్లిం ఓటర్లపై భారీ ఆశలు పెట్టుకున్నా బెంగాల్‌ ఎన్నికల బరిలో దిగిన ఎంఐఎం ఎత్తులు ఫలించలేదు.

  • 02 May 2021 01:30 PM (IST)

    యానాంలో ఎన్ఆర్ కాంగ్రెస్ నేత వెనుకంజ

    పుదుచ్చేరి ఎన్నికల్లో ఎన్‌డీయే కూటమి సీఎం అభ్యర్థి ఎన్ఆర్ కాంగ్రెస్ నేత యానాంలో వెనుబడ్డారు. ఆయనపై స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కంటే 600 ఓట్ల వెనుబడ్డారు.

  • 02 May 2021 01:24 PM (IST)

    టీవీవీ దినకరన్ వెనుకంజ

    కోవిల్‌పట్టిలో ఏఎంఎంకే అధినేత టీవివి దినకరన్ వెనుకంజలో ఉన్నారు. 7 వ రౌండ్ ముగిసే సమయానికి ఏఐఏడీఎంకే అభ్యర్థి మంత్రి కదంబూర్ సి రాజు కంటే దినకరన్ 1,500 ఓట్లు వెనుకబడి ఉన్నారు.

  • 02 May 2021 01:18 PM (IST)

    2,700 ఓట్ల అధిక్యంలో కమల్ హాసన్

    మక్కల్ నీది మయం అధినేత, సినీ నటుడు కమల్ హాసన్ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరో రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి మయూరా ఎస్ జయకుమార్‌పై కోయంబత్తూరు సౌత్‌లో కమల్ హాసన్ 2,700 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 02 May 2021 12:59 PM (IST)

    చెన్నైలో డీఎంకే కార్యకర్తల సంబరాలు

    తమిళనాడులో డీఎంకే సత్తా చాటుతోంది. అధికారం చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. డీఎంకే 136 స్థానాల్లో అధిక్యంలో ఉండగా... ఏఐఏడీఎంకే 97 చోట్ల ముందంజలో ఉంది. దీంతో చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద ఆ మద్దతుదారులు వేడుకలు జరుపుకుంటున్నారు.

  • 02 May 2021 12:50 PM (IST)

    పుదుచ్చేరిలో అధికారం దిశగా బీజేపీ

    పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ విజయం వైపు పరుగులు పెడుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే.. బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించగా, 12 చోట్ల ముందంజలో ఉంది. కాంగ్రెస్ 3 ఇతరులు ఒక స్థానంలో అధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 02 May 2021 12:48 PM (IST)

    కేరళలో మరోసారి లెఫ్ట్‌దే అధికారం

    కేరళలో అధికార ఎల్డీఎఫ్ అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. కాగా, ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాల ప్రకారం.. ఎల్డీఎఫ్ 88, యూడీఎఫ్ 44, బీజేపీ 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

  • 02 May 2021 12:46 PM (IST)

    తమిళనాట డీఏంకే హవా

    తమిళనాడులో డీఎంకే సత్తా చాటుతోంది. అధికారం చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. డీఎంకే 136 స్థానాల్లో అధిక్యంలో ఉండగా... ఏఐఏడీఎంకే 97 చోట్ల ముందంజలో ఉంది.

  • 02 May 2021 12:39 PM (IST)

    కేరళ సీఎం అల్లుడు రియాస్ ముందంజ

    సీనియర్ డివైఎఫ్‌ఐ నాయకుడు, ముఖ్యమంత్రి పినరయి విజయన్ అల్లుడు, పిఎ ముహమ్మద్ రియాస్ బేపూర్‌లో 15 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    , Pa Muhammad Riyas

    , Pa Muhammad Riyas

  • 02 May 2021 12:29 PM (IST)

    చేపాక్-తిరువల్లికేని నియోజకవర్గంలో ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యం

    సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ తన తొలి ఎన్నికల్లో 16,000 ఓట్ల తేడాతో చేపాక్-తిరువల్లికేని నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు 69.53 శాతం ఓట్లు పోలయ్యాయి. పీఎంకే అభ్యర్థి ఎవిఎ కస్సాలి రెండో స్థానానికి పరిమితమయ్యారు. నామ్ తమిలార్ కచ్చి పార్టీకి చెందిన జయసిమ్మరాజా మూడవ స్థానంలో ఉన్నారు.

  • 02 May 2021 12:12 PM (IST)

    అధిక్యంలో డీఎంకే అధినేత స్టాలిన్

    తమిళనాడులోని కొలత్తూరు నియోజకవర్గంలో డీఎంకే అధినేత స్టాలిన్ ముందంజలో ఉన్నారు.

  • 02 May 2021 12:09 PM (IST)

    కేరళలో రెండు చోట్ల బీజేపీ అధిక్యం

    కేరళలో బీజేపీ రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. పాలక్కడ్‌లో మెట్రోమ్యాన్ శ్రీధరన్, త్రిస్సూర్‌లో నటుడు సురేశ్ గోపీ ముందంజలో ఉన్నారు.

  • 02 May 2021 12:05 PM (IST)

    పుదుచ్చేరిలో వెలువడి ఫలితం.. రెండు చోట్ల బీజేపీ జయభేరి

    పుదుచ్చేరిలో 2 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. పుదుచ్చేరి, కామరాజ్‌నగర్ నియోజకవర్గాలను బీజేపీ కైవసం చేసుకుంది.

  • 02 May 2021 11:59 AM (IST)

    ఎడప్పడిలో 25 వేల ఓట్ల ఆధిక్యంలో సీఎం మళనిస్వామి

    ముఖ్యమంత్రి కె పళనిస్వామి తన నియోజకవర్గ ఎడప్పడి నియోజకవర్గంలో భారీ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరవ రౌండ్ లెక్కింపు తర్వాత దాదాపు 25 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    Palaniswami

    Palaniswami

  • 02 May 2021 11:54 AM (IST)

    వృధాచలంలో మూడవ స్థానంలో ప్రేమచల విజయకాంత్

    దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) పార్టీ అధినేత విజయకాంత్ భార్య ప్రేమలత విజయకాంత్ వృధాచలం నియోజకవర్గంలో బాగా వెనుకబడి ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన రాధాకృష్ణన్ ఆధిక్యంలో, పిఎంకెకు చెందిన కార్తికేయన్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. కాగా, ప్రేమలత విజయకాంత్ మూడో స్థానానికే పరిమితమయ్యారు.

    Premalatha Vijayakanth

    Premalatha Vijayakanth

  • 02 May 2021 11:48 AM (IST)

    అధిక్యంలో కేరళ సీఎం విజయన్

    కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మదామ్ నియోజకవర్గంలో అధిక్యంలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్డీఎఫ్ అత్యధిక స్థానాల్లో సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తున్నారు.

  • 02 May 2021 11:44 AM (IST)

    తమిళనాడులో ఐదు స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

    తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వీటిలో తిరునెల్వేలి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నైనార్ 5,000 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. ధరమ్‌పురంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎల్ మురుగన్, హార్బర్, నీలగిరి, కన్యాకుమారి నియోజకవర్గాల్లో బీజేపీ అధిక్యంలో ఉంది.

  • 02 May 2021 11:40 AM (IST)

    డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం వద్ద సంబరాలు

    తమిళనాడులో డీఎంకేకు అనుకూలంగా ఫలితాలు వెలువడుతుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. డాన్సులు చేస్తూ, బాణాసంచా కాలుస్తూ వేడుక చేసుకుంటున్నారు.

  • 02 May 2021 11:30 AM (IST)

    తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ధరంపురంలో అధిక్యం

    తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఎల్ మురుగన్ ధరంపురం నియోజకవర్గంలో 800 ఓట్ల తేడాతో డీఎంకేకు చెందిన కయాల్విజి ఎన్.పై అధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 02 May 2021 11:27 AM (IST)

    కేరళ మంత్రులకు తప్పని తిప్పలు...

    కేరళ రాష్ట్ర మంత్రులు ఎన్నికల ఫలితాల్లో భిన్న పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎవరెవరి ఫలితాల సరళి ఎలా ఉందో చూద్దాం...

    కేకే శైలజ (మట్టన్నూర్) - ముందంజ

    టీపీ రామకృష్ణన్ (పెరాంబ్రా) - ముందంజ

    ఎంఎం మణి (ఉడుంబంచోల) - ముందంజ

    ఎసీ మొయిదీన్ (కున్నంకుళం) - ముందంజ

    ఈ. చంద్రశేఖరన్ (కన్హంగాడ్) - ముందంజ

    కదకంపల్లి సురేంద్రన్ (కజక్కూట్టం) - ముందంజ

    ఏకే ససీంద్రన్ (ఎలాతుర్) - ముందంజ

    కే కృష్ణన్‌కుట్టి (చిత్తూరు) - ముందంజ

    కదన్నపల్లి రామచంద్రన్ (కన్నూర్) - ముందంజ

    జే మెర్సికుట్టి అమ్మ (కుందారా) - వెనుకంజలో ఉంది

    కేటీ జలీల్ (తవనూర్) - వెనుకంజలో ఉన్నారు

  • 02 May 2021 11:17 AM (IST)

    కేరళలో అధికార ఎల్డీఎఫ్ అధిపత్యం

    కేరళలో అధికార ఎల్డీఎఫ్ అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకోనుంది. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళలో భారీ మెజార్టీ దిశగా సాగుతోంది. అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. కాగా, ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాల ప్రకారం.. ఎల్డీఎఫ్ 88, యూడీఎఫ్ 44, ఎన్‌డీఏ 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

  • 02 May 2021 11:06 AM (IST)

    అధిక్యంలో కమల్ హాసన్

    తమిళనాడులో సౌత్ కోయంబత్తూర్‌లో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత సినీ నటులు కమల్ హాసన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 02 May 2021 11:01 AM (IST)

    తమిళనాట పూర్తి అధిక్యంలో డీఎంకే

    తమిళనాడులో డీఎంకే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికారంలో వచ్చేందుకు కావల్సిన మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. అయితే.. అధికార అన్నాడీఎంకే కూడా గణనీయంగానే సీట్లు సాధిస్తోంది. డీఎంకే 133 చోట్ల, అన్నాడీఎంకే 101 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

  • 02 May 2021 10:56 AM (IST)

    డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ వెనుకంజ

    కాట్పాడి అసెంబ్లీ నియోజకవర్గంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ వెనుకంజలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో తురైమురుగన్ 7 సార్లు గెలిచారు.

  • 02 May 2021 10:54 AM (IST)

    తమిళనాడు బీజేపీ స్టార్ అభ్యర్థి అన్నామలైకి ఎదురుదెబ్బ

    తమిళనాడు బీజేపీ స్టార్ అభ్యర్థి అరవకురిచి నియోజకవర్గంలో అన్నామలైకు ఎదురుగాలి వీస్తోంది. కరూర్ జిల్లాలోని అరవకురిచి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సమీప డీఎంకే అభ్యర్థి కంటే ఆయన బాగా వెనుకబడి ఉన్నారు.

  • 02 May 2021 10:51 AM (IST)

    తమిళనాడు మంత్రుల వెనుకంజ

    ☀ విల్లుపురంలో మంత్రి సి.వి. షణ్ముగం ఎదురుదెబ్బ తగిలింది. డీఎంకే అభ్యర్థి షణ్ముగంపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ☀ మదురైలో మంత్రి బెంజమిన్ వెనుకబడి ఉన్నారు. ☀ మంత్రి మాఫా పాండియరాజన్ వెనుకబడి ఉన్నారు.

  • 02 May 2021 10:36 AM (IST)

    అధికారం దిశగా డీఎంకే

    తమిళనాడులో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే దూకుడు ప్రదర్శిస్తోంది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ... మ్యాజిక్ ఫిగర్ 118. కాగా, ఇప్పటి వరకు వెలువడి ఫలితాలను బట్టి చూస్తూ.. డీఎంకే 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే 89, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.

  • 02 May 2021 10:32 AM (IST)

    పుదుచ్చేరిలో అధిక్యం దిశగా ఎన్డీఏ

    పుదుచ్చేరిలో ఎన్డీఏ 9 స్థానాల్లో, యూపీఏ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. పుదుచ్చేరిలో మొత్తం సీట్లు 30. కాగా, అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 16. ఇప్పటివరకూ చూస్తే ఎన్డీఏ అధికారం దక్కించుకునేలా కనిపిస్తోంది.

  • 02 May 2021 10:29 AM (IST)

    బీజేపీ అభ్యర్థి కుమ్మనం రాజశేఖరన్ ముందంజ

    కేరళలోని నెమోమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కుమ్మనం రాజశేఖరన్ అధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 02 May 2021 10:22 AM (IST)

    కేరళలో ఎల్డీఎఫ్ 87, యూడీఎఫ్ 50, బీజేపీ మూడు చోట్ల ముందంజ

    కేరళలో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఎల్డీఎఫ్ 87, యూడీఎఫ్ 50, బీజేపీ మూడు చోట్ల ఆధిక్యంలో ఉంది.

  • 02 May 2021 10:17 AM (IST)

    అధిక్యంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్

    కొళత్తూరులో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. DMK-Stalin

  • 02 May 2021 10:16 AM (IST)

    వెనుకబడ్డ బీజేపీ అభ్యర్థి ఖుష్బూ

    తమిళనాడులోని థౌజండ్‌లైట్స్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, ప్రముఖ నటి ఖుష్బూ వెనుకంజలో ఉన్నారు.

  • 02 May 2021 10:15 AM (IST)

    అధిక్యంలో ఉదయనిధి స్టాలిన్

    చెపాక్‌లో డీఎంకే అభ్యర్థి, నటుడు ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 02 May 2021 10:14 AM (IST)

    ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి ముందంజ

    పుదుచ్చేరిలో మాజీ మాజీ ముఖ్యమంత్రి ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి ముందంజలో ఉన్నారు.

  • 02 May 2021 10:13 AM (IST)

    తమిళనాడులో కొనసాగుతున్న డీఎంకే హవా

    తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు డీఎంకే 124, ఏఐడీఎంకే 83, ఎంఎన్ఎం 1, ఏఎంఎంకే 1, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.

  • 02 May 2021 10:11 AM (IST)

    కౌంటింగ్ సెంటర్‌కు చేరుకున్న ఉదయనిధి స్టాలిన్

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని క్వీన్ మేరీస్ కాలేజీకి చేరుకున్నారు.

  • 02 May 2021 10:08 AM (IST)

    కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ ముందంజ

    కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి ఉమెన్ చాందీ పుత్తుపల్లి నియోజకవర్గం నుంచి అధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 02 May 2021 09:44 AM (IST)

    కేరళ సీఎం విజయన్ అధిక్యత

    కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మదామ్ నియోజకవర్గంలో అధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 02 May 2021 09:30 AM (IST)

    అధిక్యంలో కమల్ హాసన్

    తొలిసారిగా తమిళనాడు ఎన్నికల బరిలో దిగిన నటుడు, మక్కల్ నీది మయం అధ్యక్షుడు కమల్ హాసన్ కొయంబత్తూరు దక్షిణ స్థానంలో ముందంజలో ఉన్నారు.

  • 02 May 2021 09:29 AM (IST)

    మెట్రోమ్యాన్ 2,000 ఓట్ల ఆధిక్యం

    కేరళలోని పాలక్కడ్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మెట్రో‌మ్యాన్ శ్రీధరన్ ముందంజలో ఉన్నారు. సమీప యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ (యుడీఎఫ్‌) అభ్యర్థి షఫీ పరంబిల్‌పై మెట్రోమ్యాన్ 2,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 02 May 2021 09:24 AM (IST)

    ఎల్డీఎఫ్ 77, యూడీఎఫ్ 59, ఎన్‌డీఏ 2 చోట్ల అధిక్యం

    కేరళలో 140 స్థానాలకు గానూ ఇప్పటి వరకూ 138 చోట్ల తొలి రౌండ్ లెక్కింపు పూర్తయ్యింది. ఎల్డీఎఫ్ 77, యూడీఎఫ్ 59, ఎన్‌డీఏ 2 చోట్ల అధిక్యంలో ఉన్నారు.

    Pinarayi Vijayan

    Pinarayi Vijayan

  • 02 May 2021 09:22 AM (IST)

    వెనుకంజలో టీటీవీ దినకరన్

    కోవిల్‌పట్టి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచిన ఏఎంఎంకే అభ్యర్థి టీటీవీ దినకరన్ వెనకంజలో ఉన్నారు.

  • 02 May 2021 09:19 AM (IST)

    ముందంజలో మెట్రో‌మ్యాన్ శ్రీధరన్

    దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న కేరళలోని పాలక్కడ్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మెట్రో‌మ్యాన్ శ్రీధరన్ ముందంజలో ఉన్నారు.

  • 02 May 2021 09:18 AM (IST)

    అధిక్యంలో పన్నీర్ సెల్వం

    బోడినాయక్కనూర్‌లో తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం అధిక్యకత కనబరుస్తున్నారు.

  • 02 May 2021 09:17 AM (IST)

    అధిక్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి

    తమిళనాడులోని ఎడిప్పాడిలో ముఖ్యమంత్రి పళనిస్వామి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 02 May 2021 09:13 AM (IST)

    ఎల్డీఎఫ్ 78, యూడీఎఫ్ 60, బీజేపీ రెండు చోట్ల అధిక్యత

    కేరళలో ఎల్డీఎఫ్ 78, యూడీఎఫ్ 60, బీజేపీ రెండు, ఇతరులు ఒక్క స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.

  • 02 May 2021 09:10 AM (IST)

    కొంగాడ్‌లో సీపీఎం అధిక్యత

    కేరళ ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. పాలక్కాడ్ జిల్లా కొంగాడ్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ముందంజలో కొనసాగుతోంది.

  • 02 May 2021 09:08 AM (IST)

    పుదుచ్చేరిలో బీజేపీ 5, కాంగ్రెస్ 4 చోట్ల అధిక్యం

    పుదుచ్చేరిలో బీజేపీ ఐదు, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

  • 02 May 2021 09:04 AM (IST)

    డీఎంకే కూటమి 51 చోట్ల అధిక్యత

    తమిళనాడులో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. డీఎంకే కూటమి 51 చోట్ల, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి 31 స్థానాల్లో ఆధిక్యకత కనబరుస్తోంది. దినకరన్ పార్టీ ఏఎంఎంకే రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • 02 May 2021 09:01 AM (IST)

    అధికారంలోకి రావాలంటే కావల్సిన మ్యాజిక్ ఫిగర్

    4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ఎవరు గెలుస్తారన్న దానిపై ఆయా రాష్ట్రాల ప్రజలతో పాటు దేశమంతటా ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో ఫలితాలపై స్పష్టత రాబోతుంది. అయితే, అధికారంలోకి రావాలంటే అయా పార్టీలు మేజిక్ ఫిగర్ దాటాల్సి ఉంటుంది. ఇక వివిధ రాష్ట్రాల పరిస్థితిని ఓసారి పరిశీలిద్దాం...

    రాష్ట్రం  మొత్తం

    అసెంబ్లీ స్థానాలు

    మ్యాజిక్ ఫిగర్
    పశ్చిమ బెంగాల్‌ 292 147
    తమిళనాడు 234 118
    కేరళ 140 71
    అసోం 126 64
    పుదుచ్చేరి 30 16
  • 02 May 2021 08:33 AM (IST)

    కేరళలో ఎల్డీఎఫ్ 43 చోట్ల అధిక్యం

    కేరళలో పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో ఎల్డీఎఫ్ 43, యూడీఎఫ్ 27, బీజేపీ రెండు, ఇతరులు ఒక్క స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.

  • 02 May 2021 08:31 AM (IST)

    బీజేపీ, కాంగ్రెస్ మూడేసి స్థానాల్లో అధిక్యం

    పుదుచ్చేరిలో తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలల్లో బీజేపీ మూడు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో ఆధిక్యంలో

  • 02 May 2021 08:28 AM (IST)

    2 చోట్ల అధిక్యంలో డీఎంకే

    తమిళనాడులో ప్రారంభమైన అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లును కౌంటింగ్ అధికారులు లెక్కిస్తున్నారు. కాగా, డీఎంకే 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే ఒక్క స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • 02 May 2021 08:25 AM (IST)

    ఇడుక్కి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

    కేరళలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో భాగంగా ఇడుక్కి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతోంది.

  • 02 May 2021 08:23 AM (IST)

    పుదుచ్చేరిలో పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్

    పుదుచ్చేరిలో ఉదయం 8.00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. తొలి రౌండ్ ఫలితం 9 గంటలకు వెలువడే అవకాశం ఉంది.

  • 02 May 2021 08:19 AM (IST)

    కేరళలో ఎల్డీఎఫ్ అధిక్యం

    కేరళలో ఎల్డీఎఫ్ 7, యూడీఎఫ్ మూడు స్థానాల్లో ఆధిక్యం.

  • 02 May 2021 08:17 AM (IST)

    ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం, కేరళలోని మలప్పురం, తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక కోసం ఓట్ల లెక్కింపు కూడా జరుగుతోంది. అలాగే, 10 రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నిక కోసం ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పలు చోట్ల పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

  • 02 May 2021 08:14 AM (IST)

    మొదలైన కౌంటింగ్

    తమిళనాడులోని 234 స్థానాలకు 76 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇందులో భాగంగా ముందుగా ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లను కౌంటింగ్ అధికారులు లెక్కిస్తున్నారు.

  • 02 May 2021 07:59 AM (IST)

    తిరువనంతపురంలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

    కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. తిరువనంతపురంలోని మార్ ఇవానియోస్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కోసం అధికారులు అన్ని పూర్తి ఏర్పాట్లు పూర్తి చేసింది.

  • 02 May 2021 07:48 AM (IST)

    పుతుప్పల్లి చర్చిలో మాజీ సీఎం ఉమ్మన్ చాందీ ప్రార్థనలు

    కేరళలోని పుతుప్పల్లి చర్చిలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం ఉమ్మన్ చాందీ ప్రార్థనలు చేశారు. అతను పుత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కౌంటింగ్ హాల్‌లోకి వెళ్లే ముందు ఆయన ప్రార్థనలు చేశారు.

  • 02 May 2021 07:34 AM (IST)

    మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు ఈసీ ఫిర్యాదు

    దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తికి ఎన్నికల కమిషన్‌ కారణమని... ఈసీపై హత్య కేసు నమోదుచేయాలన్న మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం.. సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. మద్రాస్ హైకోర్టు ఘోరమైన పదజాలంతో వ్యాఖ్యలు చేసిందని ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తమిళనాడులో కోవిడ్ వ్యాప్తికి కారణమైందని హైకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాదు, కౌంటింగ్ ప్రక్రియ మరో వ్యాప్తికి కారణం కాకూడదని హెచ్చరించింది.

  • 02 May 2021 07:23 AM (IST)

    నెగెటివ్ సర్టిఫికేట్ ఉంటేనే అనుమతి

    కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటలకు మొదలుకానుంది. లాస్‌పేటలోని కౌంటింగ్ సెంటర్ వద్ద అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తున్నారు.

  • 02 May 2021 07:18 AM (IST)

    తమిళనాడులో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

    ఈ రోజు ఉదయం 8 గంటలకు మొదలు కానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. చెన్నైలోని కౌంటింగ్ సెంటర్ వద్ద భారీ భద్రత నడుమ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్ వద్ద దృశ్యాలు....

  • 02 May 2021 07:13 AM (IST)

    కేరళలో మొదలైన కౌంటింగ్ సందడి

    # కేరళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. కన్నూర్ లోని కౌంటింగ్ సెంటర్ వద్దకు అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు చేరుకుంటున్నారు. వారిని తనిఖీ చేసి కోవిడ్ నిబంధనలు పాటించిన వారిని మాత్రమే భద్రతా సిబ్బంది హాల్ లోపలికి అనుమతి ఇస్తున్నారు.

  • 02 May 2021 07:01 AM (IST)

    కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లే అభ్యర్థులు, ఏజెంట్లకు రూల్స్

    కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లే అభ్యర్థులు, ఏజెంట్లకు ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా తప్పనిసరిగా కరోనా నెగెటివ్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుంది. అభ్యర్థులతోపాటూ... వారి ఏజెంట్లు కూడా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి వెంటనే కరోనా టెస్టులు కూడా చేసేలా ఏర్పాట్లు చేసింది. మాస్కులు, గ్లౌజులు భౌతిక దూరం పాటించేలా నిబంధనలు విధించింది.

Published On - May 02,2021 10:07 PM

Follow us