RGV on PM Modi: మోడీ మృత్యు వ్యాపారి అంటూ నిజం చెప్పిన సోనియా గాంధీ కాళ్ళను మొక్కుతా అంటున్న ఆర్జీవీ

RGV on PM Modi: శివ వంటి సెన్సేషనల్ హిట్ సినిమాతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమని తనవైపుకు తిప్పుకున్న రామ్ గోపాల్ వర్మ.. టాలీవుడు నుంచి బాలీవుడ్ లోకి...

RGV on PM Modi: మోడీ మృత్యు వ్యాపారి అంటూ నిజం చెప్పిన సోనియా గాంధీ కాళ్ళను మొక్కుతా అంటున్న ఆర్జీవీ
Ram Gopal Varma
Follow us
Surya Kala

|

Updated on: May 03, 2021 | 9:53 AM

RGV on PM Modi: శివ వంటి సెన్సేషనల్ హిట్ సినిమాతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమని తనవైపుకు తిప్పుకున్న రామ్ గోపాల్ వర్మ.. టాలీవుడు నుంచి బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. అక్కడా సత్య, సర్కర్, రంగీల వంటి సినిమాలతో తనకంటూ ఓ ఫేమ్ సంపాదించుకున్నడు. తర్వాత వర్మ సొంత కథలు మాని.. బయోపిక్ అంటూ హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూనే ఉన్నాడు.. అయితే వర్మ తాను తీసే సినిమాలతో కంటే.. తన నోటికి పని చెప్పి.. వివాదాస్పద కామెంట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు.. తాజాగా పశ్చిమ బెంగాల్ లో విజయం సాధించిన టీఎంసీ పై ప్రశంసలు వర్షం కురిపిస్తూ.. బీజేపీ నేతలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై ఆర్జీవీ విమర్శలు చేశాడు. తాజాగా బెంగాల్‌ ఫలితాలపై కూడా తనదైన శైలీలో స్పందించారు. ట్విటర్‌ వేదికగా ప్రధాని మోడీకే తనదైన శైలిలో ప్రశ్నలు సంధించాడు. ‘నరేంద్ర మోడీ సార్‌.. నిన్నటి వరకు దీదీ ఫినిష్‌ అని అన్నారు. మరి ఇప్పుడేమంటారు సార్’ అని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించాడు వర్మ.

అయితే వర్మ అంతకు ముందు మరో ట్వీట్‌లో సోనియాకు క్షమాపణలు చెబుతానని .. ‘నరేంద్రమోడీ మృత్యు వ్యాపారి అంటూ 2014లో సోనియా గాంధీ ఆరోపణలు చేస్తే నాకు అప్పుడు సరిగా అర్థం కాలేదు. ఆమెకు అంత గొప్ప విజనరీ ఉంటుందని నేను ఊహించలేదని అన్నాడు సంచలన దర్శకుడు వర్మ. అంతేకాదు.. సోనియాగాంధీకి తాను బేషరుతుగా క్షమాపణ చెబుతున్నానని.. ఒకవేళ వీలైతే సోనియా గాంధీ కాళ్లను ఫోటో తీసి ఎవరైనా పంపితే … వాటిని డిజిటల్ రూపంలో తాకి మొక్కుతాను’ అని వర్మ ట్వీట్ చేశాడు. వర్మ ట్విట్ పై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

Also Read: కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తీసుకోవడంపై సందేహాలా..! ఎటువంటి వారు ఈ టీకాను తీసుకోకూడదంటే..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?