AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid19 Vaccine: కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తీసుకోవడంపై సందేహాలా..! ఎటువంటి వారు ఈ టీకాను తీసుకోకూడదంటే..!

Covid19 Vaccine: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సమాజంలో అనేక మంది డాక్టర్లు పుట్టుకొచ్చారు. రోజుకు ఒకరు నివారణ కోసం ఇది చేయండి.. అది చేయండి అంటూ ఇస్తున్న సలహాలు..

Covid19 Vaccine: కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తీసుకోవడంపై సందేహాలా..! ఎటువంటి వారు ఈ టీకాను తీసుకోకూడదంటే..!
Covid 19
Surya Kala
|

Updated on: May 02, 2021 | 6:38 PM

Share

Covid19 Vaccine: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సమాజంలో అనేక మంది డాక్టర్లు పుట్టుకొచ్చారు. రోజుకు ఒకరు నివారణ కోసం ఇది చేయండి.. అది చేయండి అంటూ ఇస్తున్న సలహాలు సర్వసాధారణంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇక కరోనా వైరస్ నివారణ కోసంఇస్తున్న వ్యాక్సిన్ పై రోజుకో సందేశం ప్రజలకు పుట్టుకొస్తుంది. టీకా ఏ చేతికి వ్యాక్సిన్‌ వేయించుకోవాలి? ఇతర వ్యాధులకు మందులు వాడుతున్నవారు, గర్భవతులు వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చా? డోసుల మధ్య ఎంత గ్యాప్‌ ఉండాలి? అసలు వ్యాక్సినేషన్ పనికి వస్తుందా లేదా అంటూ అనేక సందేహాలు ఇనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ పై వస్తున్నా సందేహాలకు సమాధానమిచ్చారు.

కోవిడ్ న 9 టీకాను … ఇమ్యునోసప్రెసెంట్స్‌, స్టెరాయిడ్స్‌, హెచ్‌ఐవీకి మందులు వాడుతున్నవారు వేయించుకోకూడదని చెప్పారు.

ముఖ్యంగా స్టెరాయిడ్స్‌లో చాలా రకాలున్నాయి. నోటి ద్వారా, ఇంజెక్షన్‌ల ద్వారా ఇచ్చే స్టెరాయిడ్స్‌ వాడుతున్నవారు టీకాకు దూరంగా ఉండడం మంచిదని చెప్పారు. ఒకవేళ అటువంటి వారు వ్యాక్సినేషన్ తీసుకున్నా ఎటువంటి ఉపయోగం ఉండదని.. వారిలో యాంటీబాడీస్‌ అభివృద్ధి కావని చెప్పారు. అంతేకాదు.. కొన్ని రకాల అలర్జీ ఉన్నవాళ్లు స్టెరాయిడ్స్‌ వాడుతుంటే టీకా తీసుకోకూడదని తెలిపారు వైద్య సిబ్బంది.

అయితే కొంతమందికి వ్యాక్సిన్ తీసుకునే ముందు కరోనా టెస్ట్ చేయించుకోవాలా అనే సందేహం కలుగుతుంది… అయితే ఎటువంటి నిర్ధారణ టెస్ట్ అవసరం లేదు. వైరస్‌ లక్షణాలు లేన్నప్పుడు, ఇంటిలో ఎవరూ పాజిటివ్‌ కానప్పుడు నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. నిర్భయంగా టీకా వేసుకోవచ్చు.

అయితే కొంతమంది వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా పాజిటివ్ వచ్చిందని చెబుతున్న్నారు. అయితే అది కేవలం అపోహామాత్రమే అని చెబుతున్నారు. అలా అయితే ఇప్పటి వరకూ వ్యాక్సిన్ ఇచ్చిన కొన్ని కోట్లమందికి ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు కదా.. ఒకవేళ కొంతమందికి వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయితే టీకా వేసుకోవడానికి ముందుకానీ తర్వాత కానీ వైరస్ ప్రవేశిస్తే పాజిటివ్ గా తేలుతుంది. అంతేకానీ.. టీకా వలన వైరస్ శరీరంలోకి ప్రవేశించదు. ఇతరుల ద్వారా సోకితేనే పాజిటివ్ గా నమోదవుతుంది. ఇక వ్యాక్సినేషన్ వేయించుకున్న వారికీ పాజిటివ్ గా నిర్ధారణ అయితే .. ఆ వైరస్ ప్రభావం అంతగా ఉండదు.. రోగి త్వరగా కోలుకుంటారు.. సురక్షితంగా ఉంటారని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు.

Also Read: భద్రాచలం రామాయలంపై ఉన్న సుదర్శన చక్రం మహిమ గురించి మీకు తెలుసా..!