Vaccine for 18 above: మూడో దశ టీకా దేశంలో ఎక్కడెక్కడ మొదలైంది..ఏ రాష్ట్రాలు 18 ఏళ్లు దాటిన వారికి టీకా ఇచ్చాయి..వివరాలు

3rd Phase Vaccination: కరోనా మహమ్మారిని వేగంగా ఎదుర్కునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడో విడత టీకా కార్యక్రమం నిన్న (మే 1) పారంభం అయింది. దేశంలోని 18 ఏళ్లు నిండిన వారికి టీకాలు అందించాలనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

Vaccine for 18 above: మూడో దశ టీకా దేశంలో ఎక్కడెక్కడ మొదలైంది..ఏ రాష్ట్రాలు 18 ఏళ్లు దాటిన వారికి టీకా ఇచ్చాయి..వివరాలు
Vaccine For 18 Above
Follow us
KVD Varma

|

Updated on: May 02, 2021 | 5:58 PM

3rd Phase Vaccination: కరోనా మహమ్మారిని వేగంగా ఎదుర్కునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడో విడత టీకా కార్యక్రమం నిన్న (మే 1) పారంభం అయింది. దేశంలోని 18 ఏళ్లు నిండిన వారికి టీకాలు అందించాలనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ఒక వైపు టీకాల కొరత..మరోవైపు రెండోవిడత టీకా కార్యక్రమంలో 45 ఏళ్లు నిండిన వారికి టీకాలు ఇవ్వాలన్న లక్ష్యం పూర్తిగా నెరవేరకపోవడం నేపధ్యంలో మొదటిరోజు దేశంలో టీకా పంపిణీ మూడోదశ కార్యక్రమం ఎలా జరిగిందో వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.

నిన్న (01-05-21) దేశ వ్యాప్తంగా ప్రారంభమైన మూడో విడత టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది. మూడవ విడతలో 18 ఏళ్లు దాటిన వారికి కరోనా టీకా పంపిణీ లక్ష్యం. జనవరి 16న ప్రారంభమైన మొదటి విడతలో ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి టీకా కార్యక్రమం నిర్వహించారు. తరువాత మార్చి 1 న ప్రారంభమైన రెండవ విడతలో 45 ఏళ్ల కంటే పైబడి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారందరికీ టీకా కార్యక్రమం విస్తరించారు. ఈ మధ్య దేశంలో కరోనా విలయతాండవం చేస్తూండటంతో 18 ఏళ్లు దాటిన వారికి కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం మే 1వ తేదీ నుంచి అందరికీ టీకా అందిస్తామని ప్రకటించింది.

3rd Phase Vaccination మూడవ దశలో 18 ఏళ్లు పైబడిన వారందరూ టీకా వేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే, ఇప్పటి వరకూ మొదటి డోసు తీసుకుని రెండవ డోసు టీకా కోసం ఎదురు చూస్తున్న వారే 10కోట్ల మందికి పైగా ఉన్న పరిస్థితుల్లో కొత్తగా 18-44 ఏళ్ల వారికి తక్షణం టీకాలు అందించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి. దీంతో దేశవ్యాప్తంగా కేవలం ఆరు రాష్ట్రాల్లోనే మూడవ విడత టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది. టీకాల కొరత తీవ్రంగా ఉండటంతో 18-44 వయస్సువారికి అనేక రాష్ట్రాలలో టీకా పంపిణీ మొదలు కాలేదు. వ్యాక్సిన్ల కొరత, ఇతర సాంకేతిక ఇబ్బందుల కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ లలో పంపిణీ వాయిదా వేశారు.

18-44 మధ్య వయసు వారికి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రాలు… ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌లో మూడవ విడత టీకా ప్రారంభం

ఒడిశాలో… ఒడిశాలో మూడో విడత కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. 18 నుంచి 45 ఏళ్ల మధ్యవారికి టీకాలు ఇచ్చేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపడతామని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

మహారాష్ట్రలో… రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైన కార్యక్రమం. తొలిరోజు 11 వేల మందికి టీకా. పుణె జిల్లాలోని 19 కేంద్రాల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారికి కరోనా టీకా ఇచ్చారు. నాగ్‌పుర్‌లోనూ టీకా పంపిణీ ప్రారంభం అయింది.

ఉత్తరప్రదేశ్‌… ఉత్తరప్రదేశ్‌ లో 75 జిల్లాలకు గాను 7 జిల్లాలోనే మూడవ విడత టీకా కార్యక్రమం ప్రారంభం అయింది.

గుజరాత్‌… గుజరాత్‌ లో కేసులు అధికంగా ఉన్న 10 జిల్లాలలో మూడవ విడత టీకా కార్యక్రమం ప్రారంభించారు.

రాజస్థాన్‌… రాజస్థాన్‌లో 33 జిల్లాలకు గాను 3 జిల్లాల్లో మాత్రమే మూడవ విడత టీకా కార్యక్రమం ప్రారంభం అయింది.

ఛత్తీస్‌గఢ్‌… ఛత్తీస్‌గఢ్‌లో అంత్యోదయ కార్డులు ఉన్న పేదలలో 1,693 మందికి మాత్రమే మూడో విడత వ్యాక్సినేషన్‌ అందింది.

తమిళనాడు… తమిళనాడులో వ్యాక్సిన్‌ కొరతతో అధికారికంగా ప్రారంభం కాని మూడో విడత టీకా.. తమిళనాడులో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులలో మాత్రమే 18 ఏళ్లు పైబడిన వారికి మొదటి రోజు టీకా వేశారు.

త్వరలో దశల వారీగా 18 నుంచి 45 ఏళ్లలోపు వారికి కరోనా టీకా అందిస్తామని జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం చెప్పింది. పశ్చిమబెంగాల్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, గోవా, అస్సాం, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వంటి అనేక రాష్ట్రాలలో 18-44 మధ్య వయసువారికి టీకా కార్యక్రమం ప్రారంభం కాలేదు.

మూడవ విడతలో టీకాల కోసం రెండున్నర కోట్ల మంది యువత రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. కానీ, టీకా కొరతతో 18-44 మధ్య వయస్సు వారికి ఇప్పట్లో టీకా అందే అవకాశం కనిపించడంలేదు. మరోవైపు మూడోదశ టీకాకు సంబంధించి తొలిరోజు 18-45 ఏళ్ల వారిలో 84,599 మందికి తొలి డోసు టీకా అందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద టీకా డోసులు 79 లక్షలకుపైగా అందుబాటులో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ వ్యాక్సిన్ పొందిన వారి వివరాలు..

  • ఏప్రిల్‌ 30 వరకూ దేశంలో టీకా వేయబడినవారు మొత్తం – 15,19,98,107
  • వీరిలో రెండు డోసుల పూర్తి టీకా అందిన వారు మొత్తం – 2,66,21,155
  • కేవలం ఒక్క డోసు టీకా మాత్రమే పొందిన వారు మొత్తం – 12,53,76,952

నిన్న (01-05-21) దేశ వ్యాప్తంగా టీకా వేయబడింది కేవలం – 18,26,219 మందికి మాత్రమే.

ఈ లెక్కల ప్రకారం చూస్తే, మొత్తంగా కూడా దేశంలో రోజుకు 25 లక్షల వ్యాక్సినేషన్ కూడా కావడం లేదు. ఇంకోవైపు టీకాలు భారీగా రాష్ట్రాలకు పంపుతున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే, గత 15 రోజుల వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తే సగటున రోజుకు టీకా పొందిన వారి సంఖ్య 22 లక్షలు మాత్రమే. సగటున రోజుకు 55-60 లక్షల టీకాలను అందించగలిగితేనే అందరికీ టీకా ఇవ్వడానికి మరో 8నెలలు పట్టే అవకాశం. ఇప్పుడున్న పధ్ధతి ప్రకారం టీకాలు అందిస్తే..(రోజుకు 22 లక్షల చొప్పున) వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి మరో మూడేళ్లు పడుతుందని పరిశీలకులు చెబుతున్నారు. భారీగా టీకా ఉత్పత్తికి, దిగుమతులకు కేంద్రం చర్యలు చేపట్టాలని కోరుతున్న వైద్య నిపుణులు.

Also Read: కరోనా: మొదటి డోస్ కు ఒక వ్యాక్సిన్.? రెండో డోస్ కు మరొకటి తీసుకోవచ్చా.? వివరాలివే.!

Vaccine Supply: తెలంగాణలో డ్రోన్ల ద్వారా ఆకాశమార్గంలో కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీకి కేంద్రం ఆమోదం..