కరోనా: మొదటి డోస్ కు ఒక వ్యాక్సిన్.? రెండో డోస్ కు మరొకటి తీసుకోవచ్చా.? వివరాలివే.!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: May 02, 2021 | 11:06 AM

Covid 19 Vaccine: దేశాన్ని కరోనా వైరస్ సెకండ్ వేవ్ వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూపోతోంది..

కరోనా: మొదటి డోస్ కు ఒక వ్యాక్సిన్.? రెండో డోస్ కు మరొకటి తీసుకోవచ్చా.? వివరాలివే.!
covid 19 Vaccine

Covid 19 Vaccine: దేశాన్ని కరోనా వైరస్ సెకండ్ వేవ్ వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూపోతోంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలామందిలో వ్యాక్సిన్ పై అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి వస్తాయి అన్న దానిపై జనాల్లో భయం ఉంది. ఒకవేళ టీకా తీసుకుంటే మొదటి డోస్ సరిపోతుందా.? లేకపోతే రెండో డోస్ కూడా తీసుకోవాలా.? మార్కెట్ లో ఉన్న ఏ వ్యాక్సిన్లు సురక్షితం.? మొదటి డోస్ కు ఒక వ్యాక్సిన్.? రెండో డోస్ మరో వ్యాక్సిన్ తీసుకోవచ్చా.? అని పలు సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.!

ఏ టీకా సురక్షితం..?

ప్రస్తుతం ఇండియాలో కోవాగ్జీన్, కోవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్ సెంటర్లలో అందుబాటులో ఉండే టీకాను వేస్తారు. మనకు ఎంచుకునే అవకాశం లేదు. అటు ఈ రెండు వ్యాక్సిన్లు కరోనా వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కుంటాయని తెలిపింది.

కరోనా నుంచి కోలుకున్న వారు టీకా తీసుకోవాలా.?

కరోనా నుంచి కోలుకున్నవారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. యాంటీబాడీలు పూర్తిస్థాయిలో ఉత్పన్నమై.. వైరస్ సోకే ప్రమాదాన్ని వ్యాక్సిన్ తగ్గిస్తుంది.

మొద‌టి డోస్ కు ఒక వ్యాక్సిన్.. రెండో డోస్‌కు మరొకటి తీసుకోవచ్చా?

రెండు డోసుల్లోనూ ఒకే వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. కోవాగ్జీన్, కోవిషీల్డ్ వేర్వేరు ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటాయి కాబట్టి.. రెండు వ్యాక్సిన్లు కలిపి తీసుకోవడం మంచిది కాదు. కరోనాను ఎదుర్కునేందుకు రెండు డోసుల్లోనూ ఒక వ్యాక్సిన్ తీసుకోవాలి.

మొదటి డోస్ తర్వాత కరోనా వస్తే.?

మొదటి డోస్ తర్వాత కరోనా వస్తే.. దాని నుంచి కోలుకున్న రెండు వారాల తర్వాత రెండో డోస్ తీసుకోవాలి. ఒకవేళ మొదటి డోస్ కంటే ముందు కరోనా వస్తే.. రికవరీ అయిన 28 రోజుల తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవాలి.

వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా.?

ఏ వ్యాక్సిన్ వేయించుకున్న పలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమందికి ఒళ్లు నొప్పులు, తేలిక‌పాటి జ్వ‌రం, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి, కీళ్లనొప్పులు రావొచ్చు. ఇవన్నీ రెండు, మూడు రోజులు ఉంటాయి.

Read also:

Viral: నల్ల త్రాచు, ముంగీస మధ్య యుద్ధం.. వైరల్ వీడియో.. చివరికి ఎవరు గెలిచారంటే.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu