Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits Of Mishri: మీరు దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా.. పటిక బెల్లం, నల్లమిరియాల పొడి కలిపి ఇలా తీసుకుంటే సరి

Benefits Of Mishri: ఇంట్లో పెద్దవారు ఉంటె. చిన్న పిల్లలకు పాలు ఇస్తూ.. తీపి కోసం పాలల్లో పంచదార, బెల్లం కి బదులు పటిక బెల్లం వేస్తారు. ఇక అప్పుడప్పుడు...

Benefits Of Mishri: మీరు దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా.. పటిక బెల్లం, నల్లమిరియాల పొడి కలిపి ఇలా తీసుకుంటే సరి
Mishri
Follow us
Surya Kala

|

Updated on: May 02, 2021 | 1:34 PM

Benefits Of Mishri: ఇంట్లో పెద్దవారు ఉంటె. చిన్న పిల్లలకు పాలు ఇస్తూ.. తీపి కోసం పాలల్లో పంచదార, బెల్లం కి బదులు పటిక బెల్లం వేస్తారు. ఇక అప్పుడప్పుడు రెస్టారెంట్స్ కు వెళ్లి భోజనం చేసిన తర్వాత బిల్లు తో పాటు.. సోంపు, మిశ్రి(పటికబెల్లం) ఉన్న ఓ ప్లేట్ ను తీసుకొచ్చి మన ముందు పెడతాడు బేరర్.. ఎందుకంటే.. సోంపు తో పాటు ఉన్న మిశ్రి ని తింటే.. మనం తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుందని. ఇక ఈ పటిక బెల్లం తింటే.. నోటి నుంచి దుర్వాసన రాకుండా తాజాగా కూడా ఉంచుతుంది. అయితే ఈ పటిక బెల్లం పంచదార కు మరో రూపం అని చెప్పవచ్చు.. అయినప్పటికీ పంచదార కంటే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఇది చెరకు సిరప్ తో చేస్తారు.. ఈ మిశ్రీ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

దగ్గు మరియు గొంతు నొప్పి నుండి ఉపశమనం కోసం

ఔషధ గుణాలు, అవసరమైన పోషకాలు మిశ్రీలో ఉన్నాయి. మిశ్రీ, నల్ల మిరియాలు పొడి మరియు నెయ్యితో కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. గొంతు నొప్పి నివారణకు రాత్రిపూట దీన్ని తినాలి. అలాగే ఒక గిన్నెలో మిశ్రీ పౌడర్, నల్ల మిరియాలు పొడి తీసుకొని, ఒక చెంచా గోరువెచ్చని నీటితో కలపాలి. దీన్ని తీసుకుంటే వేధించే దగ్గు తగ్గుతుంది. ఇది గొంతులో ఉన్న అదనపు శ్లేష్మం బయటకు పంపించడానికి సహాయపడుతుంది.

రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందా..!

మిశ్రీ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది. తక్కువ హిమోగ్లోబిన్ , రక్తహీనత, కళ్లు తిరిగినట్లు ఉండడం, బలహీనత, సాధారణ అలసట వంటి సమస్యలను కలిగిస్తాయి. మిశ్రీ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడటమే కాకుండా, శరీరంలో రక్త ప్రసరణను పునరుత్పత్తి చేస్తుంది. మిశ్రీ తింటే జీర్ణక్రియ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తుంది. కనుక ఇప్పటికీ కొందరి ఇళ్లల్లో భోజనం తర్వాత పటిక బెల్లం ముక్కను నోట్లో పెట్టుకుంటారు.

ఒకొక్కసారి అనుకోకుండా ముక్కులోంచి రక్తం వస్తుంది. దీంతో వెంటనే పటికబెల్లం కలిపిన నీటిని బాధితునకు ఇస్తే.. రిలీజ్ లభిస్తుంది.

రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో మిశ్రీని కలిపి తీసుకుంటే జ్ఞాపక శక్తిని పెంచుతుంది.

పిల్లలలకు పాలు ఇచ్చే బాలింత పటిక బెల్లం కలిపిన పాలు తాగితే.. పాలు పడడంతో పాటు యాంటీ డిప్రెసెంట్ గా కూడా పని చేస్తుంది. ఇందులో తీపి తక్కువ ఉండడంతో.. తల్లికి దీని వల్ల ఎలాంటీ హానీ ఉండదు.

మిశ్రి కంటి చూపుకి బాగా పని చేస్తుంది. భోజనం తరువాత మిశ్రి చిన్నముక్కను నోట్లో పెట్టుకుంటే కంటికి మంచిది. అయితే మీ డైట్‌లో మిశ్రీని చేర్చే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:  ఆ దేశ ప్రజల నిర్లక్ష్యం.. అందుకు తోడు కొంప ముంచిన చైనా వ్యాక్సిన్… అన్ని దేశాల ప్రజలకు హెచ్చరిక ఏనా..!