AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccine Supply: తెలంగాణలో డ్రోన్ల ద్వారా ఆకాశమార్గంలో కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీకి కేంద్రం ఆమోదం..

తెలంగాణాలో కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీని ఆకాశ మార్గంలో డ్రోన్ల ద్వారా చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Vaccine Supply: తెలంగాణలో డ్రోన్ల ద్వారా ఆకాశమార్గంలో కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీకి కేంద్రం ఆమోదం..
Drones
KVD Varma
|

Updated on: May 01, 2021 | 8:23 PM

Share

Vaccine Supply: తెలంగాణాలో కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీని ఆకాశ మార్గంలో డ్రోన్ల ద్వారా చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ల పంపిణీ కోసం డ్రోన్లు వినియోగించడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖకు తెలంగాణా ప్రభుత్వం మార్చి 9వ తేదీన విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ జాయింట్‌ సెక్రటరీ అంబర్‌ దూబె ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ అనుమతులకు షరతులు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు ఏడాది పాటు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ అమలులో ఉంటాయి.

ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తారు. అయితే, కంటిచూపు మేర ఎగిరే డ్రోన్ల కు మాత్రమే ఈ అనుమతులు పరిమితం చేశారు. కంటి చూపు పరిధి దాటి డ్రోన్ల వినియోగానికి తెలంగాణా ప్రభుత్వం మళ్ళీ ప్రయత్నాలు చేస్తోంది. ఈవిధంగా డ్రోన్ల ద్వారా మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తే రవాణా ఖర్చులు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది.

వికారాబాద్ లో ముందుగా ఈ డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ పై ట్రయల్స్ వేయనున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. వ్యక్సిన్లతో కూడిన డ్రోన్లను వికారాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో టేకాఫ్‌ చేసి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), ఉపకేంద్రాల్లో ల్యాండింగ్‌ చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి నోడల్‌ అధికారిని సైతం నియమించింది. తొలుత ప్రతి డ్రోన్‌ ద్వారా డమ్మీ వైల్స్‌తో పాటు అసలు టీకాలను కలిపి పంపించి వీటి పనితీరును పరీక్షించి చూడనున్నారు. ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాల ఆధారంగా పూర్తి స్థాయిలో డ్రోన్ల ద్వారా టీకాల పంపిణీ కోసం విధివిధానాలను రూపొందించనున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన 8 సంస్థలను 4 బ్యాచ్‌లుగా విభజించి ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఒక్కో బ్యాచ్‌లో రెండు సంస్థలు ఉండనున్నాయి. ఒక్కో బ్యాచ్‌ 6 రోజుల పాటు డ్రోన్లను ఎగిరించి తమ సామర్థ్యాన్ని నిరూపించుకోనున్నాయి. 24 రోజుల పాటు డ్రోన్లతో వ్యాక్సిన్‌ పంపిణీకి ట్రయల్స్‌ నిర్వహించడానికి ఐటీ శాఖ ప్రణాళికలు రూపొందించింది.

Also Read: కరోనాపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులకు కీలక ఆదేశాలు.. పర్యవేక్షణకు సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి నియామకం

Oxygen Express: తెలంగాణకు ప్రాణ వాయువు… అంగూల్‌ నుండి సికింద్రాబాద్‌కు బయుదేరిన మొదటి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌