AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oxygen Express: తెలంగాణకు ప్రాణ వాయువు… అంగూల్‌ నుండి సికింద్రాబాద్‌కు బయుదేరిన మొదటి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌

కరోనా తీవ్రతతో ప్రాణ వాయువు అందక, ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. దీంతో ఆక్సిజన్ అవసరాన్ని తీర్చడానికి, భారతీయ రైల్వే శాఖ లిక్విడ్ ఆక్సిజన్‌ను తెలంగాణకు సరఫరా చేస్తోంది.

Oxygen Express: తెలంగాణకు ప్రాణ వాయువు... అంగూల్‌ నుండి సికింద్రాబాద్‌కు బయుదేరిన మొదటి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌
Oxygen Express Trains On Their Way To Telangana
Balaraju Goud
|

Updated on: May 01, 2021 | 3:34 PM

Share

Oxygen Express trains: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణతో తెలంగాణ అల్లాడిపోతోంది. ప్రాణ వాయువు అందక, ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. దీంతో ఆక్సిజన్ అవసరాన్ని తీర్చడానికి, భారతీయ రైల్వే శాఖ లిక్విడ్ ఆక్సిజన్‌ను తెలంగాణకు సరఫరా చేస్తోంది. ఆక్సిజన్‌ను తీసుకువెళుతున్న రైలు శనివారం ఉదయం ఒకిడాలోని సింధూరాబాద్‌కు అంగూల్ నుండి ప్రారంభమైంది. మెడికల్ ఆక్సిజన్ అవసరమైన అన్ని రాష్ట్రాలకు పంపే ఇండియన్ రైల్వే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆక్సిజన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బయలు దేరింది.

ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ 5 ట్యాంకర్ల ఆక్సిజన్‌తో ఒడిస్సాలోని అంగూల్‌ నుండి సికింద్రాబాద్‌కు బయుదేరింది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ మిలిటరీ సైడిరగ్‌ నుండి 28 ఏప్రిల్‌ 2021 తేదీన 5 ఖాలీ ట్యాంకర్లు ఆక్సిజన్‌ కోసం అంగూల్‌కు వెళ్లాయి. ఈ ట్యాంకర్లు ఆక్సిజన్‌తో నింపిన తర్వాత ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాయి. ఈ ఐదు ట్యాంకర్ల ద్వారా 63.6 టన్నుల ఆక్సిజన్‌ చేరవేస్తున్నట్లు భారత రైల్వే శాఖ ట్వీట్టర్ వేదికగా వెల్లడించింది.

క్రయోజనిక్‌ కార్గో అయిన ఈ ట్యాంకర్లలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ రవాణాకు అనేక పరిమితుంటాయి. రవాణాలో గరిష్ట వేగం, ఒత్తడి వంటి పరిమితుంటాయి. లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్ల లభ్యత, లోడిరగ్‌ ర్యాంపు వంటి అనేక విషయాను పరిగణలోకి తీసుకుని అధికారులు ఆక్సిజన్ రవాణా చేపడుతున్నారు. ఈ అంశాను దృష్టిలో పెట్టుకొని గ్రీన్‌ కారిడార్‌తో కూడిన మార్గం ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లు బయలుదేరాయి.

క్లిష్ట సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాకు ఆక్సిజన్‌ను సురక్షితంగా, భద్రంగా నిరాటంకంగా సజాబవుగా రవాణా చేయడానికి భారతీయ రైల్వేచే ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించింది. ఇందులో భాగంగా, రోడ్డు ట్యాంకర్లు (ఖాళీ, లోడిరగ్‌ అయినవి రెండూ) ఆర్వో`ఆర్వో (రోల్‌ ఆన్‌`రోల్‌ ఆఫ్‌) సేవ కింద కూడా తీసుకువస్తున్నారు.

రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుక ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ట్యాంకర్లు ఏర్పాటు చేస్తే, రైల్వే శాఖ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. తదనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే రాష్ట్ర అవసరాను తీర్చడానికి ఈ రైళ్లను నడుపుతోంది. జోన్‌ సికింద్రాబాద్‌ నుండి రెండు ఖాళీ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించింది. వీటిలో మొదటి రైలులో 5 ఖాలీ ట్యాంకర్లు ఉండగా, రెండో రైలులో 4 ఖాళీ ట్యాంకర్లు ఏర్పాటు చేసింది. కాగా, తాజాగా మొదటి రైలు ఆక్సిజన్‌ను నింపుకున్న ట్యాంకర్లతో అంగుల్‌ నుండి సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభించింది.

ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపడానికి రైల్వే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ గజానన్‌ మ్యా హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన అభ్యర్థనపై వీలైనంత తక్షణమే చర్య తీసుకొని మరిన్ని రైళ్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ రైళ్ల రవాణాలో గ్రీన్‌ కారిడార్‌ విధానంతో నిరంతర పర్యవేక్షణ చేపట్టామని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ చేరుకున్న ఆక్సిజన్ ట్యాంకర్ల ద్వారా అయా జిల్లాల వారీగా అవసరమైన ఆసుపత్రులకు ఆక్సిజన్ అందించనున్నారు.

Read Also….  విదేశాల్లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే యోచన, సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడి