Kukatpalli ATM Theft: కొలిక్కి వచ్చిన కూకట్‌పల్లి ఏటీఎం కాల్పుల కేసు..వలసకూలీలుగా వచ్చి దోపిడీ దొంగల అవతారం..

ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లిలో ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపి నగదు ఎత్తుకెళ్ళిన కేసును సైబరాబాద్ పోలీసులు ఒక కొలిక్కి తెచ్చారు.

Kukatpalli ATM Theft: కొలిక్కి వచ్చిన కూకట్‌పల్లి ఏటీఎం కాల్పుల కేసు..వలసకూలీలుగా వచ్చి దోపిడీ దొంగల అవతారం..
Kukatpalli Atm Theft
Follow us

|

Updated on: May 01, 2021 | 10:39 PM

Kukatpalli ATM Theft: ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లిలో ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపి నగదు ఎత్తుకెళ్ళిన కేసును సైబరాబాద్ పోలీసులు ఒక కొలిక్కి తెచ్చారు. దోపిడీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు బీహార్ నుంచి వలస కూలీలుగా గుర్తించిన పోలీసులు వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం అతని కోసం గాలింపు జరుపుతున్నారు.

ఘటన ఇదీ..

కూకట్‌పల్లి పటేల్‌కుంట పార్కు సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద రెండ్రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. అక్కడ ఏటీఎంలో సిబ్బంది డబ్బులు నింపుతుండగా..ఇద్దరు ఆగంతుకులు పల్సర్‌ వాహనంపై ఆల్విన్‌ కాలనీ వైపు నుంచి బ్యాంకు వద్దకు వచ్చి ఒక్కసారిగా కాల్పులకు దిగారు. అక్కడున్న ఇద్దరు ఏటీఎం సిబ్బందితో పాటు సెక్యూరిటీ గార్డుపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం వారి వద్ద ఉన్న రూ.5లక్షల డబ్బును ఆ దుండగులు దోచుకెళ్లారు.

బీహార్ నుంచి వచ్చి..

బీహార్ నుంచి వలస కూలీలుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇక్కడ తేలిగ్గా డబ్బు సంపాదించాలని దోపిడీ దొంగల అవతారం ఎత్తారు. గురువారం ఏటీఎం వద్ద కాల్పులకు తెగబడి దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు ఈ పనికి పాల్పడింది బీహార్‌ ముఠానేనని గుర్తించారు. ఇద్దరు నిందితుల్లో ఒకరిని సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు గురువారం అర్ధరాత్రి పట్టుకున్నారు. మరో నిందితుడు ఆయుధం, డబ్బు తో రైలులో పారిపోయినట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. బీహార్‌కు చెందిన ఇద్దరు యువకులు జీడిమెట్ల–చందానగర్‌ మధ్య ప్రాంతంలో నివసిస్తూ కొద్దిరోజులు దినసరి కూలీలుగా పనిచేశారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పూనుకున్నారు.

గతంలోనూ..

తమ స్వస్థలంలో ఓ నాటు పిస్టల్‌ ఖరీదు చేసుకుని వచ్చిన నిందితులు ఆమధ్య జీడిమెట్ల అయోధ్యనగర్‌ చౌరస్తాలో ఉన్న లక్ష్మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ సంస్థను టార్గెట్‌ చేశారు. గత నెల 16న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తన దుకాణం మూసేందుకు సిద్ధమైన యజమాని రవికుమార్‌ రూ.1.95 లక్షలను తన బ్యాగ్‌లో పెట్టుకున్నారు. అదే సమయంలో హెల్మెట్, మాస్క్‌ ధరించిన ఇద్దరు దుండగులు ఆ దుకాణంలోకి ప్రవేశించి రవికుమార్‌కు తుపాకీ గురిపెట్టి, అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. ఆయన వద్ద నగదు ఉన్న బ్యాగ్‌తోపాటు సెల్‌ఫోన్‌ తీసుకుని ఉడాయించారు. ఈ నేరం చేసిన తర్వాత నిందితులు కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న నిందితులు.. మొన్న కూకట్ పల్లి వద్ద ఏటీఎం చోరీ చేశారు.

Also Read: ఎల్‌ఈడీ టీవీ స్పీకర్లలో భారీగా బంగారం.. చెన్నై విమానాశ్రయంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడు అరెస్టు

Shocking Video: మొద‌ట‌ వృద్దురాలి మెడలోని నగలు లాక్కెళ్లారు.. మళ్లీ వెన‌క్కి వ‌చ్చి చెవిక‌మ్మ‌లు కూడా దోచేశారు..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..