Shocking Video: మొద‌ట‌ వృద్దురాలి మెడలోని నగలు లాక్కెళ్లారు.. మళ్లీ వెన‌క్కి వ‌చ్చి చెవిక‌మ్మ‌లు కూడా దోచేశారు..

ఏపీలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వృద్దులు, ఒంటరి మహిళలే టార్గెట్‌గా అదును చూసి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ వృద్దురాలి...

Shocking Video: మొద‌ట‌ వృద్దురాలి మెడలోని నగలు లాక్కెళ్లారు.. మళ్లీ వెన‌క్కి వ‌చ్చి చెవిక‌మ్మ‌లు కూడా దోచేశారు..
Chain Snatching

ఏపీలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వృద్దులు, ఒంటరి మహిళలే టార్గెట్‌గా అదును చూసి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ వృద్దురాలి మెడలోని నగలు లాక్కెళ్లారు చైన్‌స్నాచర్లు. లలితా నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర కాలనీలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది శేషమ్మ అనే వృద్ధురాలు. మధ్య మధ్యలో చుట్టు పక్కల చూసుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో అటు నుంచి ఎదురుగా బైక్‌పై వచ్చిన ఇద్దరు కేటుగాళ్లు.. ఆమె మెడలో ఉన్న నగలను లాగేశారు. వెంటనే బైక్‌ వేగం పెంచి ముందుకు పోనిచ్చారు. కొద్ది దూరం ముందుకు వెళ్లిన తర్వాత.. మళ్లీ వెనక్కు వచ్చారు. ఇంకా మెడలో ఏమైన నగలు మిగిలి ఉన్నాయోనన్న అనుమానంతో వచ్చి దాడి చేశారు. చెవి కమ్మలు కూడా లాగేసుకుని ఉడాయించారు.

పాపం పెద్దావిడ కాపాడండి.. కాపాడండి అంటూ అరుపులు, కేకలు వేసినా అక్కడ ఎవరు లేక పోవడంతో దొంగలు తప్పించుకొని పోయారు. ఈ తతంగం మొత్తం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇక చేసేది ఏమి లేక పోవడంతో బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న త్రీ టౌన్‌ పోలీసులు.. దర్యాప్తు మొదలు పెట్టారు.

స్పాట్‌ను పరిశీలించిన పోలీసులు.. గతంలో ఈ ప్రాంతంలో దొంగలు ఏ మైనా రెక్కి నిర్వాహించారా? నిర్వహిస్తే ఎన్ని రోజుల క్రితం నిర్వహించారు? లేక పోతే.. బైక్‌ మీద వచ్చి నగలు ఎత్తుకెళ్లిన వారు తెలిసిన వారేనా? అన్న అనుమాలతో కేసు విచారణ చేస్తున్నారు పోలీసులు.

Also Read: మంత్రి ఈటల రాజేందర్‌పై వేటుకు రంగం సిద్ధం.. వైద్య ఆరోగ్యశాఖను కేసీఆర్‌కు బదిలీ.. గవర్నర్‌ ఆమోదం

భారత్‌‌లో కరోనా అల్లకల్లోలం.. ప్రపంచంలో తొలిసారిగా.. 4 లక్షలకు పైగా కేసులు..