ఎల్‌ఈడీ టీవీ స్పీకర్లలో భారీగా బంగారం.. చెన్నై విమానాశ్రయంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడు అరెస్టు

Gold Seized: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు....

ఎల్‌ఈడీ టీవీ స్పీకర్లలో భారీగా బంగారం.. చెన్నై విమానాశ్రయంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడు అరెస్టు
Follow us
Subhash Goud

|

Updated on: May 01, 2021 | 6:46 PM

Gold Seized: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు కిలో 200 గ్రాముల బంగారాన్ని సీజ్‌ చేశామని, బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.57.75 లక్షల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నాగపట్టణానికి చెందిన బద్రోద్దీన్‌ (23) అనే యువకుడు దుబాయ్‌ నుంచి ఎమిరెట్స్‌ విమానంలో చెన్నై విమానాశ్రయంలో దిగాడు. విశ్వసనీయ సమాచారం మేరకు కస్టమ్స్‌ అధికారులు అతనిని తనిఖీ చేయగా, 55 ఇంచుల ఎల్‌ఈడీ టీవీ స్పీకర్లలో రెండు భారీ బంగారు కడ్డీలను గుర్తించారు. దీంతో అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశారు.

కాగా, ఇలా విదేశాల నుంచి అనేక మంది అక్రమంగా బంగారాన్ని తీసుకువస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. అధికారుల కళ్లు గప్పి గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తూ దొరికపోతున్నారు. ఇలా బంగారం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎయిర్‌ పోర్టులలో కస్టమ్స్‌ అధికారులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నారు. ప్రతి రోజు ప్రయాణికులను తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలా కొందరు అక్రమంగా బంగారాన్ని షూస్‌లలో, చెప్పుల్లో, ఎలక్ట్రికల్‌ వస్తువుల్లో ఇలా రకరకాలుగా ఎవరు పెద్దగా గుర్తించని వస్తువుల్లో అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తూ కస్టమ్స్‌ అధికారులకు దొరికిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది నుంచి లక్షలు, కోట్లాది విలువ చేసే బంగారాన్ని సీజ్‌ చేసి వారిపౌ కేసులు నమోదు చేసిన సందర్భాలున్నాయి.

ఇవీ కూడా చదవండి:

కరోనాపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులకు కీలక ఆదేశాలు.. పర్యవేక్షణకు సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి నియామకం

Indian Covid-19 Variant: భారత్‌లో కొత్త వేరియంట్లతో కరోనా విజృంభణ.. ఈ వేరియంట్ ఎక్కడెక్కడ వ్యాపించిందంటే?

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజ బ్యాటరీస్ కంపెనీకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ షాక్‌

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో