Go Corona, Go: ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కానీ గ్రామం మనదేశంలోనే ఉంది తెలుసా.! కోవిడ్ కట్టడి కోసం ఎం చేశారంటే..!
Go Corona, Go: ప్రపంచం దేశాలతో పాటు భారత దేశం కూడా కరోనా మహమ్మారి చేత చిక్కి విలవిలాడుతోంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా భారత్ లో కరోనా సెకండ్ వేవ్...
Go Corona, Go: ప్రపంచం దేశాలతో పాటు భారత దేశం కూడా కరోనా మహమ్మారి చేత చిక్కి విలవిలాడుతోంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా భారత్ లో కరోనా సెకండ్ వేవ్ తో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికోసం నివారణ చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ ప్రజలలో స్వీయ క్రమ శిక్షణ లేకపోవడంతో .. కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. అయితే మరోవిప్పు అదే స్థాయిలో రికవరీ రేటు కూడా పెరుగుతుండడం అధికారులకు ఊపిరినిస్తుంది. అయితే ప్రజలలో స్వీయ క్రమ శిక్షణ ఉంటె కరోనా వైరస్ దరి చేరదని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది ఈ గ్రామం.. ఈ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా ఇప్పటి వరకూ నమోదు కాలేదు.. మరి వివరాల్లోకి వెళ్తే..
సోషల్ మీడియాలో .. మీడియాలో గో కరోనా గో అంటూ రకరకాల సూచనలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.. అయితే ఆ ఉండేది ఊళ్లో వెయ్యిమంది జనాభా.. ఈ గ్రామస్థులు మాస్కులు ధరిస్తున్నారు.. సోషల్ డిస్టెన్స్ పాటిస్తారు.. ఇక చేతులను శుభ్రం చేసుకోవడంలో వీరు చూపే శ్రద్ధ మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు.. ఈ గ్రామస్థులల్లో చాలా మంది శ్రీలంక నుంచి భారత్ వచ్చి స్థిరపడినవారు. ప్రకృతి అందాలతో అలరారే.. కేరళలోని పట్టణంతిట్ట జిల్లాలో గవి గ్రామం ఉంది. ఈ గ్రామంలో శ్రీలంక నుంచి వలస వచ్చిన తమిళ కుటుంబాలతో నిండి ఉంటుంది.
అయితే ప్రపంచమంతా చుట్టేస్తున్న కోవిడ్ .. ఆ గ్రామంలో మాత్రం అడుగుపెట్టాలంటే ఆలోచిస్తుంది. అవును ఇప్పటివరకూ ఒక్క పాజిటివ్ కేసు కూడా ఆ గ్రామంలో నమోదుకాలేదు.. అసలు ఆ గ్రామంలో టీవీలు, పేపర్లు, సెల్ ఫోన్లు, లేవు.. కరోనా వార్తలు గురించే వారికి తెలియదు.. వారికి తెలిసింది ఒక్కటే.. స్వీయ .. క్రమశిక్షణ.. గవి గ్రామస్థులు పాటించే కోవిడ్ నిబంధనలతోనే కరోనాను తమ ఊరి పొలిమేరల్లోకి కూడా అడుగుపెట్టనీయలేదు. అంతగా కట్టడి చేసుకున్నారు.
గ్రామస్థులే కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారు.. అక్కడ స్థానికుల్లో సీజనల్ వ్యాధుల తప్ప.. కరోనా జాడలేలేవు. ఆ సీజనల్ వ్యాధులకు వాటికి మందులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టిపెట్టారు. గవి అంతటా పచ్చదనమే. ప్రభుత్వం కల్పించిన అవగాహనతో కరోనాను కట్టడి చేయగలిగారు. వెయ్యి జనాభా అంటే మనిషికి మనిషికి మధ్య ఊరికీ ఊరికీ ఉన్నంత దూరం ఉంది.
అందులోనే సామాజిక దూరాన్ని పాటిస్తున్నారంతా. మాస్కులు లేకుండా బయటకు రారు.. చేతుల్ని వీలయితే సోప్ టి శుభ్రం చేకుంటారు.. లేకపోతె శానిటైజర్ తో శుభ్రం చేసుకుంటారు. వారు ఊరి నుంచి బయటకు వెళ్లరు.. బయటి వారిని తమ ఊళ్లోకి రానివ్వరు. గవి గ్రామంలోని ఏ ఇంట్లోనూ టీవీలు లేవు.. వైరస్ వార్తల్ని వినే పరిస్థితి లేదు. అందుకే వారిలో కరోనా గురించి ఆందోళన లేదు. ఇక చాలా వరకూ ఇంటర్నెట్ కూడా అందుబాటులో లేదు.. ఇక గవిలో ఒకే ఒక మందుల దుకాణం ఉంది. వ్యాక్సినేషన్ కూడా మొదలైంది. దీంతో భారత్ లో ఇప్పటి వరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కానీ గ్రామంగా గవి నిలుస్తుంది. స్వీయ క్రమ శిక్షణ ఒక్కటే కరోనా కట్టడికి మార్గం అంటూ ఈ గ్రామస్థులు భారత్ కె కాదు.. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Also Read: కరోనా పై పోరాటంలో ఇండోర్ రూటే సపరేటు..అధికారులకు అండగా స్థానిక సంస్థలు..కోవిడ్ పై ఉమ్మడి పోరు!