Maharashtra Lockdown: బాలీవుడ్ కు కరోనా కష్టం.. వేయికోట్ల నష్టం ఖాయం అంటున్న ఫెడరేషన్ ఆఫ్ సినీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్

మహారాష్ట్రలో, లాక్డౌన్ పదిహేను రోజులు పొడిగించడం సినిమా, టీవీ పరిశ్రమలో జీవనం పొందుతున్న వారి కష్టాలను పెంచింది. లాక్డౌన్ పెరిగితే రూ .1000 కోట్ల నష్టం ఖాయం అని ఫెడరేషన్ ఆఫ్ సినీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌వైసిఇ) తెలిపింది.

Maharashtra Lockdown: బాలీవుడ్ కు కరోనా కష్టం.. వేయికోట్ల నష్టం ఖాయం అంటున్న ఫెడరేషన్ ఆఫ్ సినీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్
Lockdown Affect On Bollywood
Follow us
KVD Varma

|

Updated on: May 02, 2021 | 5:20 PM

Maharashtra Lockdown: మహారాష్ట్రలో, లాక్డౌన్ పదిహేను రోజులు పొడిగించడం సినిమా, టీవీ పరిశ్రమలో జీవనం పొందుతున్న వారి కష్టాలను పెంచింది. లాక్డౌన్ పెరిగితే రూ .1000 కోట్ల నష్టం ఖాయం అని ఫెడరేషన్ ఆఫ్ సినీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌వైసిఇ) తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి తాము సమాచారం ఇచ్చామనీ, కానీ, ప్రభుత్వం తమ గురించి పట్టించుకోలేదనీ ఆ సంస్థ చెబుతోంది. ఇతర రాష్ట్రాలలో బయోబబుల్‌లో షూటింగ్ లకు అనుమతి ఇచ్చారు. ముంబై సినీ పరిశ్రమకు కేంద్రంగా ఉంది అదే అనుమతి ఇక్కడ కూడా ఇవ్వాలి అని అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ప్రభుత్వం ఎటువంటి ఉపశమన ప్యాకేజీ, నగదు ఉపశమనం ఇవ్వడం లేదు. ఇప్పుడు ఐదులక్షల మంది ఉపాధి ప్రశ్నార్ధకంగా మారింది అని వారన్నారు.

మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 న ఉదయం 8 నుండి మే 1 వరకు ఉదయం 7 గంటలకు లాక్డౌన్ విధించింది. దీనితో సెక్షన్ 144 మొత్తం రాష్ట్రంలో విధించారు. 15 రోజుల లాక్డౌన్ కారణంగా సినిమా, టీవీ సీరియల్స్, వాణిజ్య ప్రకటనల షూటింగ్ ఆగిపోయింది. లాక్డౌన్తో సినిమా, టీవీ పరిశ్రమలోని సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందిని ఇది ఎక్కువగా ప్రభావితం చేసింది. మే 1 నుండి షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని అందరూ ఆశాభావంతో ఉన్నారు, కాని ప్రభుత్వం లాక్డౌన్ మరో 15 రోజుల పొడిగింపు సెట్లో పనిచేస్తున్న మిలియన్ల మంది సాంకేతిక నిపుణులు అదేవిధంగా ఇతర సిబ్బంది సభ్యుల ఉపాధి సంక్షోభానికి దారితీసింది అంటూ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌వైసిఇ) అధ్యక్షుడు బిఎన్ తివారీ చెప్పారు.

”లాక్డౌన్ పెరిగితే పరిశ్రమ కనీసం 1,000 కోట్ల రూపాయలు నష్టపోతుంది, ఇది మేము ఇప్పటికే ప్రభుత్వానికి చెప్పాము. డైలీ వేజెస్ ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందని కూడా తెలిపాము. కానీ, ఉద్ధవ్ ప్రభుత్వం మాకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా లాక్డౌన్ పొడిగించింది. అలాగే షూటింగ్స్ కోసం అనుమతి ఇవ్వలేదు. బహుశా వారికి మాతో అవసరం లేదు. అందుకే ప్రభుత్వానికి రాసిన మునుపటి లేఖకు ఎటువంటి స్పందన లేదు.” అని తివారీ అన్నారు.

ఇప్పుడు బాలీవుడ్ ముంబయిని వదిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే, తప్పనిసరిగా చేయాల్సిన షూటింగ్స్ బయట చేసుకుంటున్నారు. అతి పెద్ద విషయం ఏమిటంటే రియాలిటీ షోలు కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. సూపర్ డాన్సర్ షో డామన్ లో సెట్ చేసుకున్నారు. ఇది రాబోయే కాలంలో ఫిల్మ్ సిటీని ముంబై నుండి మార్చవచ్చు. అని తివారి అభిప్రాయపడ్డారు.

ఇద్దరు నిర్మాతలు ఉమర్గావ్‌లో ఒక స్టూడియోను ఏర్పాటు చేశారు, వారు అక్కడ షూటింగ్ చేస్తున్నారు. మరికొన్నింటిని కూడా షూటింగ్ కోసం ఇస్తారు. లాక్డౌన్ మధ్య, టీవీ పరిశ్రమలో చాలా మంది నిర్మాతలు గుజరాత్, హైదరాబాద్, గోవాలో తమ ప్రదర్శనలను చిత్రీకరిస్తున్నారు. మరాఠీ సినిమాలు, సీరియల్స్ మాత్రమే ముంబైలో నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి మరాఠీ సినీ ప్రజలతో మాత్రమే మాట్లాడుటున్నారు. మాతో మాట్లాడటం లేదు. ఆయనకు హిందీ ప్రజలతో ఎలాంటి సంబంధం లేదు. మాకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. అని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా జనరల్ సెక్రటరీ సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అశోక్ దుబే చెప్పారు. ఫెడరేషన్.. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు రాసిన మొదటి లేఖకు సమాధానం రాలేదు. శుక్రవారం, మళ్ళీ సమన్వయ కమిటీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు తమలో తాము చర్చించిన తరువాత ఒక లేఖ రాసింది, ఆయనతో అపాయింట్మెంట్ కోరింది. కొంత సానుకూల సమాధానం వస్తుందని ఆశిస్తున్నాము అని దూబే వివరించారు.

ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ టీవీ విభాగం చైర్మన్ జె.డి. మజిథియా లాక్డౌన్ పెరగడం వల్ల టీవీ పరిశ్రమ సమస్య పెరిగిందని చెప్పారు. బయోబబుల్ తయారు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలు షూటింగులు జరుపుతున్న విధానంలో అనుమతి ఇచ్చి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్దిస్తున్నామన్నారు.

Also Read: Prabhas : వరుసగా బాలీవుడ్ బ్యూటీలకు ఛాన్స్ ఇస్తున్న పాన్ ఇండియా స్టార్.. ప్రభాస్ సరసన మరో హిందీ భామ

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. కరోనాతో ‘సాహో’ నటుడు మృతి.. ఎమోషనల్ ట్వీట్ చేసిన డైరెక్టర్..