Prabhas : వరుసగా బాలీవుడ్ బ్యూటీలకు ఛాన్స్ ఇస్తున్న పాన్ ఇండియా స్టార్.. ప్రభాస్ సరసన మరో హిందీ భామ
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ తో బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టిన ప్రభాస్ రెస్ట్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు.
Prabhas :
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ తో బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టిన ప్రభాస్ రెస్ట్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ ఎంటర్ అవ్వడంతో ప్రభాస్ కు కాస్త విరామం దొరికింది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ముంగించుకుంది. త్వరలోనే ఈ సినిమా మిగిలిన పనులను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాతోపాటుగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాం నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు సలార్ ఎం ఇంటరెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ప్రభాస్ మాస్ గెటప్ లో అదరగొట్టాడు.
ఈ సినిమాతోపాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆదిపురుష్ , నాగ్ అశ్విన్ తో ఓ భారీ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా ప్రభాస్ మరో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నడని తెలుస్తుంది. ‘వార్’ వంటి యాక్షన్ సినిమాలతో ‘ఔరా’! అనిపించిన సిద్ధార్థ్ ఆనంద్ కి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా ‘కత్రినా కైఫ్’ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎంపిక దాదాపు ఖాయమవుతుందనే అంటున్నారు. ఇటీవల ప్రభాస్ సినిమాల్లో బాలీవుడ్ భామలు మెరుస్తున్న విషయం తెలిసిందే. సాహో సినిమా శ్రాద్ధకపూర్ నటించగా, ఆదిపురుష్ లో కృతిసనన్ నటిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కత్రినా కైఫ్ కూడా చేరబోతుందని సమాచారం .
మరిన్ని ఇక్కడ చదవండి :