Pushpa Movie: అల్లు అర్జున్ పుష్ప మూవీ స్టోరీ లీక్ … మణిరత్నం మూవీ కాపీ అంటూ సోషల్ మీడియాలో వైరల్

 Pushpa Movie: సినిమాల మీద మోజుతో లెక్కల మాస్టర్ మెగా ఫోన్ పట్టుకుని.. టాలీవుడ్ లో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్న్నాడు .... సుకుమార్. ఓ వైపు..

Pushpa Movie: అల్లు అర్జున్ పుష్ప మూవీ స్టోరీ లీక్ ... మణిరత్నం మూవీ కాపీ అంటూ సోషల్ మీడియాలో వైరల్
Pushpa Moive
Follow us
Surya Kala

|

Updated on: May 02, 2021 | 5:17 PM

Pushpa Movie: సినిమాల మీద మోజుతో లెక్కల మాస్టర్ మెగా ఫోన్ పట్టుకుని.. టాలీవుడ్ లో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్న్నాడు …. సుకుమార్. ఓ వైపు సినిమాలను నిర్మిస్తూనే.. మరోవైపు దర్శకత్వం వహిస్తూ సూపర్ హిట్ తో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. తొలిసినిమా ఆర్యతోనే అటు ప్రేక్షకులను.. ఇటు ఇండస్ట్రీని తనవైపు కు తిప్పుకున్న సుకుమార్.. రంగ స్థలం సినిమా వరకూ క్లాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న్నాడు. రంగస్థలం మూవీతో సరికొత్త యాంగిల్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. తాజాగా అల్లు అర్జున్ తో పుష్ప సినిమా ను తెరకెక్క్కిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా కరోనా నేపథ్యంలో షూటింగ్ కు కొంచెం బ్రేక్ ఇచ్చింది. గంధం చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లాడీ డ్రైవర్ పుష్పరాజ్ గా బన్నిం నటిస్తుంన్నాడు.

ఇప్పటికే రిలీజైన పుష్ప టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు షూటింగ్ సమయంలో కొన్ని ఫోటోలు లీకై.. నెట్టింట్లో హల్ చల్ చేశాయి కూడా.. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పుష్ప సినిమా స్టోరీ ఇదేనంటూ ఓ కథ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన “విలన్ ” చిత్రం ఆధారంగా తీసుకుని ” పుష్ప” సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్నాడంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. మణిరత్నం విలన్ సినిమాలో తన చెల్లెలకి జరిగిన అన్యాయం పై హీరో ఏ విధంగా పగ తీర్చుకుంటాడు అనే కథాంశంతో తెరకెక్కింది.

ఇక పుష్ప లోనూ బన్నీకి చెల్లెలు ఉందని సినిమా మొత్తం ఈ చెల్లెలు పాత్ర పై ఆధారపడి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ చెల్లెలుగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. కనుక సుకుమార్ విలన్ మూవీని కాపీ కొట్టి తీస్తున్నదంటూ ఫిల్మ్ నగర్ లో పుకారు షికారు చేస్తోంది. అయితే మరి నిజంగా సుకుమార్ విలన్ మూవీని ఆధారంగా చేసుకుని తనదైన శైలిలో పుష్ప ను తెరకెక్కిస్తున్నాడా..? లేక ఎక్కడో చిన్న పాయింట్ కలిసింది కనుక విలన్ మూవీ అంటూ పుకార్లు షికారు చేశాయా అన్న విషయం తెలియాలంటే.. రిలీజ్ అయ్యేవరకూ ఆగాల్సిందే…!

Also Read:  మీ మెడ చుట్టూ నలుపా… అయితే ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే…!