Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Machiraju: ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ ఇంట్లో విషాదం.. తండ్రి పాండురంగ కన్నుమూత..!

Pradeep Machiraju Father: ప్రముఖ టెలివిజన్‌ యాంకర్‌, నటుడు ప్రదీప్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ప్రదీప్‌ తండ్రి పాండురంగ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో..

Anchor Machiraju: ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ ఇంట్లో విషాదం.. తండ్రి పాండురంగ కన్నుమూత..!
Follow us
Subhash Goud

|

Updated on: May 02, 2021 | 11:05 AM

Pradeep Machiraju Father: ప్రముఖ టెలివిజన్‌ యాంకర్‌, నటుడు ప్రదీప్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ప్రదీప్‌ తండ్రి పాండురంగ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో రాత్రి ఆయన కన్నుమూశారు. అయితే ఇటీవల ప్రదీప్‌ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే టీవీల్లో టాప్ యాంకర్స్‌లో ఒకరుగా రాణిస్తున్న యాంకర్ ప్రదీప్.. ఇటీవల సినిమాల్లోనూ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. యాంకర్ ప్రదీప్‌ను తెలుగువారికి ముఖ్యంగా తెలుగు టీవీ షోలను చూసేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ చురుకైన పంచులతో తన మాటల్లో ఎక్కడా అశ్లీలత లేకుండా చూసుకుంటూ తెలుగులో టాప్ షోలకు వ్యాఖ్యాతగా అదరగొడుతుంటారు ప్రదీప్‌.

బుల్లితెరపై రాణిస్తున్న ప్రదీప్‌ ఇటీవల సినిమాల్లోనూ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రదీప్‌ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండగా, వైద్యుల సైచనల మేరకు వైద్యం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం గురించి ప్రదీప్‌ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా ప్రదీప్‌ వైరస్‌ సోకక ముందు ఢీ, జీ తెలుగులో డ్రామా జూనియర్స్‌ షోలలో యాంకర్‌గా బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం కరోనా సోకిన నేపథ్యంలో తన యాంకరింగ్‌ స్థానంలో మరో బుల్లితెర యాంకర్‌ రవి యాంకరింగ్‌ చేస్తున్నట్లు తాజాగా విడుదలైన ప్రోగ్రాం ఎపిసోడ్‌ ప్రమోలో కనిపించగా, ప్రదీప్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతోనే ఆయన స్థానంలో రవిని పెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

OTT: ఆహా త‌ర్వాత రానున్న రెండో తెలుగు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌.. ఓటీటీ రంగంలోకి అడుగు పెట్ట‌నున్న నాగార్జున..?

Achor Shyamala: యాంకర్ శ్యామల భర్త అరెస్ట్.. డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు..