Achor Shyamala: యాంకర్ శ్యామల భర్త అరెస్ట్.. డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు..

Achor Shyamala: యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‎లో చీటింగ్ కేసు నమోదైంది.

Achor Shyamala: యాంకర్ శ్యామల భర్త అరెస్ట్.. డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు..
Anchor Shyamala
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 27, 2021 | 2:41 PM

Achor Shyamala: యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‎లో చీటింగ్ కేసు నమోదైంది. తన దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. 2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా డబ్బు తీసుకునట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. డబ్బుల విషయం అడిగితే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా తెలిపింది. డబ్బులు తీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకు సైతం పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఇదే విషయంపై సెటిల్ మెంట్ చేసుకోవాలంటూ ఈ కేసులో నర్సింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపినట్లుగా తెలిపింది. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు…నర్సింహారెడ్డి తో పాటు రాయబారం నడిపిన మహిళను రిమాండ్ కి తరలించారు.

ఇదిలా ఉంటే బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్యామల. ఇక ఆమె భర్త కూడా పలు సీరియల్స్ లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. నరసింహరెడ్డి. వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు.

Also Read: Acharya Movie: మెగాస్టార్ సినిమాకు తప్పని కరోనా కష్టాలు.. వాయిదా పడిన ‘ఆచార్య’.. అఫిషియల్‏గా ప్రకటించిన మేకర్స్..

సినీపరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో హీరోయిన్ మాలా శ్రీ భర్త మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు..

నా కుటుంబానికి ఇది అత్యంత కష్టసమయం.. కరోనా పాజిటివ్ వచ్చింది.. డాక్టర్ల సలహాలను పాటిస్తున్నా.. నటి హీనా ఖాన్..