Acharya Movie: మెగాస్టార్ సినిమాకు తప్పని కరోనా కష్టాలు.. వాయిదా పడిన ‘ఆచార్య’.. అఫిషియల్‏గా ప్రకటించిన మేకర్స్..

Acharya Movie Update: గతేడాది కరోనా మహ్మమ్మరి సినీ ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బతీసింది. లాక్ డౌన్ కారణంగా ఎన్నో చిత్రాలు

Acharya Movie: మెగాస్టార్ సినిమాకు తప్పని కరోనా కష్టాలు.. వాయిదా పడిన 'ఆచార్య'.. అఫిషియల్‏గా ప్రకటించిన మేకర్స్..
Acharya Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 27, 2021 | 1:33 PM

Acharya Movie Update: గతేడాది కరోనా మహ్మమ్మరి సినీ ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బతీసింది. లాక్ డౌన్ కారణంగా ఎన్నో చిత్రాలు ఆగిపోవడమే కాకుండా.. థియేటర్లు కూడా తెరుచుకోలేదు. ఇక లాక్ డౌన్ అనంతరం సినిమా షూటింగ్స్ ప్రారంభమైన.. థియేటర్లు మాత్రం కొన్ని నెలల వరకు ఓపెన్ కాలేదు. ఇటీవలే థియేటర్లు తెరుచుకోవడంతో.. పలు సినిమాలు విడుదలైన సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. దీంతో బారీ బడ్జెట్ సినిమాలన్ని వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి విడుదల తేదీలను కూడా ప్రకటించేసాయి. ఇక అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో మరోసారి సినీ పరిశ్రమను దెబ్బకొట్టింది. పలువురు నటీనటులకు, చిత్రయూనిట్ సభ్యులకు కరోనా సోకడంతో.. షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న మారణ హోమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ప్రభుత్వ ఆదేశాలకు ముందే థియేటర్స్ యాజమానులు స్వచ్చంధంగా థియేటర్లను మూసివేశారు. దీంతో పలు సినిమాలు వాయిదా బాట పట్టాయి.

ఇప్పటికే నాగచైతన్య, సాయి పల్లవి జంటగా.. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ, రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన విరాటపర్వం చిత్రాలు వాయిదా పడ్డాయి. అలాగే నేచురల్ స్టార్ నాని చిత్రం టక్ జగదీష్, విశ్వక్ సేన్ పాగల్ చిత్రాల విడుదలలు వాయిదా వేసుకోగా.. తాజాగా ఇదే బాటలోకి మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చి చేరాడు. చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాను మే 13న విడుదల చేయాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమాను వాయిదా వెస్తున్నట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ ట్విట్టర్ ఖాతాలో ప్రకటించిది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత తిరిగి చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఇందులో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ట్వీట్..

Also Read: నా కుటుంబానికి ఇది అత్యంత కష్టసమయం.. కరోనా పాజిటివ్ వచ్చింది.. డాక్టర్ల సలహాలను పాటిస్తున్నా.. నటి హీనా ఖాన్..

సినీపరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో హీరోయిన్ మాలా శ్రీ భర్త మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!