AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggubati: మరో పాన్ ఇండియా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రానా.. ఆ నిర్మాణ సంస్థ బ్యానర్‏లోనే మూవీ..

Rana Daggubati New Movie: వైవిధ్యమైన కథలతో.. విలక్షణమైన నటుడిగా గుర్తింపుపొందారు.. రానా దగ్గుబాటి. హీరోయిజం అయినా.. విలనిజం అయినా తన

Rana Daggubati: మరో పాన్ ఇండియా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రానా.. ఆ నిర్మాణ సంస్థ బ్యానర్‏లోనే మూవీ..
Rana Daggupati
Rajitha Chanti
|

Updated on: May 01, 2021 | 3:56 PM

Share

Rana Daggubati New Movie: వైవిధ్యమైన కథలతో.. విలక్షణమైన నటుడిగా గుర్తింపుపొందారు.. రానా దగ్గుబాటి. హీరోయిజం అయినా.. విలనిజం అయినా తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఆడియన్స్ దగ్గరయ్యాడు. కెరీర్ ప్రారంభం నుంచి సరిగ్గా క్లిక్ అవ్వని రానా ఒక్కసారిగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో స్టార్ డమ్ సంపాధించుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస ఆఫర్లు రానా ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమా షూటింగ్స్ తో బీజీగా ఉన్న రానా తాజాగా మరోసారి పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

లీడర్ ద్వారా తెలుగుతెరకు పరిచయమైన దగ్గుబాటి వారసుడు రానా.. తనకంటూ ప్రత్యేక పంథాను క్రియేట్ చేసుకున్నాడు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని తేడా లేకుండా.. అన్ని పాత్రలను పోషించడమే ఆయన ప్రత్యేకత. కథల ఎంపికలతోనే క్యూరియాసిటీ పెంచి.. తన పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాడు. తన కెరీర్ లో అద్భుతమైన హిట్ సాదించిన మూవీ బాహుబలి. నెగటీవ్ రోల్ చేసినా.. మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తాజాగా రానా మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు ఈ భల్లాల దేవా. విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. సీహెచ్ రాంబాబుతో కలిసి ఆచంట గోపినాథ్ ఈ సినిమా నిర్మించనున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ మూవీ తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని నిర్మాత వెల్లడించారు. కథ ఓకే అయ్యిందని.. కథనం, హీరో పాత్ర కొత్తగా ఉంటుందని.. ఆచంట గోపీనాథ్ తెలిపారు. ఇందులో హీరో పాత్ర చిత్రీకరణ అద్భుతంగా ఉంటుందని.. వివరించారు. దర్శకుడు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని.. తెలిపారు. ఇక ప్రస్తుతం రానా.. డైరెక్టర్ వేణు ఉడగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తునట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్ వచ్చింది.

Also Read: KGF Movie: కేజీఎఫ్ 2లో మరో స్పెషల్ సాంగ్.. ఈసారి యశ్‏తో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీస్..

తెలంగాణ అబ్బాయి.. కానీ సౌత్ ఇండియా సూపర్ స్టార్.. అజిత్‏ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..