KGF Movie: కేజీఎఫ్ 2లో మరో స్పెషల్ సాంగ్.. ఈసారి యశ్‏తో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీస్..

KGF 2 Movie Update: దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిజాన్ని హై లెవెల్లో ఎలివేట్ చేసిన మూవీ.. 'కేజీఎఫ్'. ఓ సాధారణ రౌడీ పెద్ద డాన్‏ను ఎదుర్కొవడం..

KGF Movie: కేజీఎఫ్ 2లో మరో స్పెషల్ సాంగ్.. ఈసారి యశ్‏తో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీస్..
Kgf 2
Follow us
Rajitha Chanti

|

Updated on: May 01, 2021 | 3:33 PM

KGF 2 Movie Update: దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిజాన్ని హై లెవెల్లో ఎలివేట్ చేసిన మూవీ.. ‘కేజీఎఫ్’. ఓ సాధారణ రౌడీ పెద్ద డాన్‏ను ఎదుర్కొవడం.. భారీ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో చూపించిన తీరు.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో కన్నడ హీరో యశ్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాకు సిక్వెల్ గా తీస్తున్న కేజీఎఫ్ 2 షూటింగ్ ఇప్పటికే చివరిదశకు చేరుకున్న క్రమంలో.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఫస్ట్ చాప్టర్ భారీ హిట్ సాధించడంతో.. ఈ సీక్వెల్ పై పెద్ద ఎత్తున అంచనాలున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ పోస్టర్స్, టీజర్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. ఇక ఈ సినిమాలో శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా చేస్తుండగా.. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేజీఎఫ్‌ ఫస్ట్ చాప్టర్ లో మిల్కీ బ్యూటీ తమన్నాతో ఓ ఐటెమ్ సాంగ్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ ట్యూన్ అండ్ లిరిక్ కూడా అప్పటి కాలానికి అనుగుణంగా ఉండేలా చూసుకున్నారు మేకర్స్. ఇక సిచువేషన్ కు కూడా సింక్ కావడంతో.. ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. తాజాగా సెకండ్ చాప్టర్ లో కూడా ఐటెమ్ సాంగ్ ఉండేలా కథను డిజైన్ చేశారట డైరెక్టర్. సౌత్ అండ్ నార్త్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ పాటను కంపోజ్ చేస్తున్నారట. ఈ సాంగ్ కోసం ఇప్పటికే బాలీవుడ్ హాట్ బ్యూటీస్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహి సంప్రదించారని సమాచారం. అయితే ఆ ఇద్దరిలో ఒకరిని ఫైనలైజ్ చేస్తారని చేస్తారని.. ఇందుకు సంబంధించిన పనులు ప్రాసెస్ లో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరీ ఈ సెకండ్ చాప్టర్ లో యశ్ తో కలిసి స్టెప్పులెయనున్న బ్యూటీ ఎవరనేది చూడాలి.

Also Read: తెలంగాణ అబ్బాయి.. కానీ సౌత్ ఇండియా సూపర్ స్టార్.. అజిత్‏ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..