- Telugu News Photo Gallery Cinema photos Happy birthday tamil hero ajith intresting facts about thala ajith
తెలంగాణ అబ్బాయి.. కానీ సౌత్ ఇండియా సూపర్ స్టార్.. అజిత్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
Actor Thala Ajith: అజిత్.. తమిళ సూపర్ స్టార్.. 50 పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీ హీరోగా కొనసాగుతున్నాడు. స్టైలీష్ అజిత్ మే 1న 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
Updated on: May 01, 2021 | 12:12 PM

అజిత్.. 1971లో తెలంగాణలోని సికింద్రాబాద్‌లో మే1న జన్మించారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం కేరళకి చెందిన వ్యక్తి, తల్లి సింధిది కోల్‌కతా. పదవ తరగతిలో చదువు మానేసిన ఆయన.. ఆ తర్వాత కొంతకాలం రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో మెకానిక్‌గా పని చేశారు.

ఉద్యోగం చేస్తూనే మోడలింగ్ ప్రారంభించారు. ఇక ఆ క్రమంలోనే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీ.సీ. శ్రీరామ్ ఆయనను గుర్తించి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చేలా చేశారు.

మొదటిసారి ఎన్ వీడు ఎన్ కనవర్ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత తెలుగులో ప్రేమ పుస్తకం సినిమాలో హీరోగా నటించారు. కానీ ఆ మూవీ డైరెక్టర్ గొల్లపూడి శ్రీనివాస్ చనిపోవడంతో సినిమా ఆగిపోయింది.

ఆ తర్వాత 1993లో "అమరావతి" అనే సినిమాతో వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత అనుకున్నంత అవకాశాలు రాకపోవడంతో కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ వేసారు.


ఒకే సంవత్సరంలో అంటే 1999లో అజిత్ నటించిన ఆరు సినిమాలు విడుదల కాగా.. అన్ని సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆ తర్వాత బిల్లా సినిమా అజిత్ ను సూపర్ స్టార్ గా నిలిబెట్టింది. ఆ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన 50వ చిత్రం మన్ కథ సినిమాలో విభిన్నంగా కనిపించారు.

ఇలా అజిత్ ఇప్పటివరకు నాలుగు విజయ్ అవార్డులు, మూడు ఫిలిం ఫేర్ అవార్డులు, తమిళనాడు రాష్ట్ర సినీ పురస్కారాలు అందుకున్నారు. నటన మాత్రమే కాకుండా.. రేసింగ్ లో అజిత్ పలు అవార్డులు అందుకున్నారు.

2000 సంవత్సరంలో ‘అమర్కళం’ సినిమాలో ఆయన హీరోయిన్‌గా నటించిన షాలీని అజిత్ ప్రేమ వివాహం చేసుకున్నారు.

2008లో వీరికి పాప జన్మించింది. ఇక హిందీలో సూపర్ హిట్ సాధించిన ‘పింక్’ తమిళ రీమేక్ ‘నెర్కొండ పార్వాయ్’లో అజిత్ నటించారు. ప్రస్తుతం ఆయన హెచ్.వినోథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాలిమై’ అనే సినిమాలో నటిస్తున్నారు.




