సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. కరోనాతో ‘సాహో’ నటుడు మృతి.. ఎమోషనల్ ట్వీట్ చేసిన డైరెక్టర్..
Bikramjeet kanwarpal: కరోనా వైరస్.. సినీ పరిశ్రమలో అడుగడుగున అంతులేని విషాదాన్ని నింపుతుంది. ఇప్పటికే ఈ మహామ్మారి బారిన పడి పలువురు
Bikramjeet kanwarpal: కరోనా వైరస్.. సినీ పరిశ్రమలో అడుగడుగున అంతులేని విషాదాన్ని నింపుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి పలువురు నటీనటులు మరణించగా.. మరికొందరు ఈ వైరస్‌తో పోరాడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మరణించిన వార్త మరచిపోకముందే తాజాగా మరో నటుడు ఈ మహమ్మారికి బలయ్యాడు. ఇటీవల కరోనా బారిన పడిన ప్రముఖ హిందీ నటుడు బిక్రమ్ జీత్ కన్వర్ పాల్ మే 1న కన్నుముశారు. ఈయన మృతితో బాలీవుడ్ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. బిక్రమ్ జీత్ కన్వర్ పాల్ మృతి చెందిన విషయాన్ని ప్రముఖ డైరెక్టర్ అశోక్ పండిత్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
“అతి చిన్న వయసులోనే బిక్రమ్ జీత్ మనందరిని విడిచి వెళ్ళిపోవడం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది” అంటూ ఆయన ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇక బిక్రమ్ జీత్ మరణ వార్త విన్న పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, టాలీవుడ్ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఆర్జీ మేజర్ బిక్రమ్ 2003లో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. హిందీలో అనేక సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించారు. బీటౌన్ లో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక తెలుగులో రామ్ చరణ్ నటించిన జంజీర్, రానా ఘాజీ అటాక్, ప్రభాస్ సాహో వంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు బిక్రమ్ జీత్.
ట్వీట్..
Sad to hear about the demise of actor Major Bikramjeet Kanwarpal this morning due to #Covid. A retired army officer, Kanwarpal had played supporting roles in many films and television serials. Heartfelt condolences to his family & near ones.
ॐ शान्ति ! ?
— Ashoke Pandit (@ashokepandit) May 1, 2021
Also Read: PM Kisan: కరోనా కాలంలో రైతులకు గుడ్‌న్యూస్.. వారి ఖాతాల్లోకి ఒకేసారి రూ.7,500… ఎప్పుడంటే..
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఆ రోజు నుంచే అమలులోకి…