AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudarshan Chakra: భద్రాచలం రామాయలంపై ఉన్న సుదర్శన చక్రం మహిమ గురించి మీకు తెలుసా..!

 Sudarshan Chakra: భద్రాచలం పవిత్ర గోదావరినది తీరాన వెలసిన పుణ్య క్షేత్రం. ఈ క్షేత్రంలోని దేవాలయమందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా..

Sudarshan Chakra:  భద్రాచలం రామాయలంపై ఉన్న సుదర్శన చక్రం మహిమ గురించి మీకు తెలుసా..!
Bhadrachalam
Surya Kala
|

Updated on: May 02, 2021 | 5:53 PM

Share

Sudarshan Chakra: భద్రాచలం పవిత్ర గోదావరినది తీరాన వెలసిన పుణ్య క్షేత్రం. ఈ క్షేత్రంలోని దేవాలయమందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. ఇక భద్రాచలం కోవెల శిఖరం, దానిపై ఉన్న సుదర్శన పెరుమాళ్. పైన ఉన్న సుదర్శన చక్రం ఎవరో మానవులు తయారు చేసినది కానీ కాదు. అది దేవతా నిర్మితమైనది. శ్రీ రామదాసు దేవాలయం నిర్మించే సమయంలో తురుష్కులు రామదాసుని కారాగారంలో ఉంచారు. దీంతో ఆలయంలో చివరి భాగం ఈ సుదర్శన_చక్రం స్థానం ఖాళీగా ఉండి పోయింది.

శ్రీ రామదాసు కారాగారం లో ఉన్న సమయంలో అక్కడ ఉన్న అప్పటి ఆలయ పాలకులు వేరే కలశం అక్కడ ఉంచగా అది ప్రతి చిన్నపాటి గాలికి, వర్షానికి క్రింద పడిపోతు అస్తమాను అపచారం జరిగేది. ఈ సంఘటతో స్థానికులు కలత చెందారు. ఈ విషయం కారాగారం లో ఉన్న రామదాసుకు కూడా చెప్పారు. దీంతో రామదాసు కాగరంలో అన్న పానాదులు ముట్టుకునే వారు కాదు. తదుపరి ఆయన కారాగారం నుండి బయటకు వచ్చాక ఆయన నిద్రలేని రాత్రుళ్ళు ఎన్నో గడిపారు. తర్వాత ఒక రోజు ఆయనకు స్వప్నము లో శ్రీ రాముల వారు ప్రత్యక్షమై ఆ ఆలయ శిఖరం పై పెట్టవలసిన సుదర్శన చక్రం.. ఎక్కడ ఉందొ చెప్పారు. పవిత్ర గోదావరి నదిలో లభిస్తుందని చెప్పి అంతర్ధానం అయ్యారు

రామదాసు తెల్లవారుజామున అందరికి తన కలలో కనిపించిన విషయం చెప్పి తాను గోదావరిలో స్నానాకి వెళ్లి నీటిలో మునిగి పైకి లేవగానే ఆయన చేతిలో ఇప్పుడు మీరు చూస్తున్న సుదర్శన చక్ర సహిత పెరుమాళ్లు రెండు చేతులపై తెలియాడుతూ లభించింది. ఇంక.ఆనందంతో వేద మంత్రాలతో ఆదే రోజు శ్రీవారి ఆలయ శిఖరం పై దానిని ప్రతిష్ట చెయ్యటం జరిగింది. అది ఈనాటికి అలాగే వుంది.

మళ్ళీ శిఖరానికి అపశృతి అన్న మాట లేదు. సదరు.విషయం తురుష్కుల హుకుమత్ కి కూడా తెలిసి ఆయన కూడా సీతారాములవారిని దర్శించుకుని కానుకలు మొక్కులు చెల్లించుకొని. శ్రీ.రామదాసుని బంధించి వుంచినందుకు క్షమాపణ చెప్పి వెళ్లారట. అప్పటి నుంచి భద్రాచల దేవాలయం గోపురం పై ఉన్న సుదర్శన చక్రం మహత్తు గురించి అనేక కథలు వినిపిస్తూనే ఉంన్నాయి. భద్రాచల క్షేత్రంలోని సుదర్శన చక్ర దర్శనం శ్రీ సీతారాముల వారి కృపా కటాక్షములను కలుగజేస్తుంది పెద్దల నమ్మకం.

Also Read: అల్లు అర్జున్ పుష్ప మూవీ స్టోరీ లీక్ … మణిరత్నం మూవీ కాపీ అంటూ సోషల్ మీడియాలో వైరల్