Significance of Tulsi: మీ తులసి చెట్టు మారే స్థితిని బట్టి ఇంట్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోండి..

Tulasi: హిందూ ధర్మంలో తులసి చెట్టుకు అత్యంత పవిత్ర స్థానం ఉంది. తుల‌సి మొక్క ఔషధాల గని. తులసి వలన మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో...

Significance of Tulsi: మీ తులసి చెట్టు మారే స్థితిని బట్టి ఇంట్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోండి..
Tulsi
Follow us
Surya Kala

|

Updated on: May 03, 2021 | 3:01 PM

Tulasi: హిందూ ధర్మంలో తులసి చెట్టుకు అత్యంత పవిత్ర స్థానం ఉంది. తుల‌సి మొక్క ఔషధాల గని. తులసి వలన మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అనేక వ్యాధుల నివారణకు తులసి ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికంగానూ తుల‌సి చెట్టు ఇంట్లో ఉంటే మంచిద‌ని… అంతా మంచే జ‌రుగుతుంద‌ని పెద్దల నమ్మకం

తుల‌సి చెట్టును ఉంచిన కుండీలో దానంత‌ట అదే మ‌రో తుల‌సి మొక్క పుట్టుకు వ‌స్తే ఆ ఇంట్లో వారికి కెరీర్ ప‌రంగా మంచి జ‌రుగుతుంద‌ట‌. అనుకున్న లక్ష్యాలు సాధిస్తార‌ట‌.

అయితే ఇంట్లో ఉన్న తుల‌సి చెట్టు అప్పుడ‌ప్పుడు ప‌లు కార‌ణాల వ‌ల్ల త‌న స‌హ‌జ రంగును కోల్పోవ‌డ‌మో, లేదంటే ఉన్న‌ట్టుండి ఆకులు స‌డెన్‌గా ఎండిపోవ‌డ‌మో, రాల‌డ‌మో ఇలా భౌతికంగా అనేక ర‌కాలుగా ఆ చెట్టు మార్పులు చెందుతుంది. దీంతో ఆ ఇంట్లో ఉండే వారికి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో ఇట్టే తెలుసుకోవ‌చ్చ‌ట‌.

తుల‌సి చెట్టు ఆకులు స‌డెన్‌గా వేరే ఏదైనా రంగుకు మారితే దాన‌ర్థం ఏమిటంటే… ఆ ఇంట్లో ఉన్న‌వారిపై ఎవరో తాంత్రిక, క్షుద్ర శ‌క్తులు ప్ర‌యోగించ‌బోతున్నార‌ని అర్థం. అలా ప్ర‌యోగించి వారిని నాశ‌నం చేయాల‌ని చూస్తే అప్పుడు తుల‌సి ఆకులు రంగు మారుతాయ‌ట‌.

నిత్యం నీళ్లు పోస్తూ చ‌క్క‌గా పెంచుతున్న తుల‌సి చెట్టు ఆకులు స‌డెన్‌గా ఎండిపోతే దానర్థం ఏమిటంటే… ఆ ఇంటి య‌జ‌మానికి మ‌రి కొద్ది రోజుల్లో ఆరోగ్యం ప‌రంగా కీడు జ‌ర‌గ‌బోతుంద‌ని అర్థం. ఏదైనా పెద్ద అనారోగ్యం బారిన అత‌ను ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ట‌.

తుల‌సి చెట్టుకు ఒక వేళ నీళ్లు పోయ‌కున్నా బాగా ప‌చ్చ‌గా, ఏపుగా పెరుగుతుంటే అప్పుడు ఆ ఇంట్లో ఉన్న‌వారంద‌రికీ అదృష్టం క‌ల‌సి రాబోతుంద‌ని అర్థం. భ‌విష్య‌త్తులో అలాంటి వారికి సంప‌ద బాగా వ‌స్తుంద‌ట‌.

తుల‌సి చెట్టు ఏదైనా కార‌ణాల వ‌ల్ల ఎండిపోతే వెంట‌నే దానికి నీళ్లు పోసి మళ్లీ ప‌చ్చ‌గా ఎదిగే వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా పెంచాల‌ట‌. అలా చేయ‌క‌పోతే మంచి జరగదని మన పూర్వీకుల నమ్మకం.

Also Read: కవలలు అని ముగ్గురు తినే ఆహారం తింది… తీరా చూస్తే.. బాల భీముడికి జన్మనిచ్చింది.. ఎక్కడంటే..