కోవిడ్ పై పోరులో మీకు సహకరిస్తాం, మీ ఆర్దర్లను అడ్డుకోకుండా చూస్తాం, సోను సూద్ కు చైనా రాయబారి హామీ

ఈ కోవిడ్ సమయంలో చైనా నుంచి ఇండియాకు పలు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లకు సంబంధించి తాను పంపిన ఆర్దర్లను చైనా అడ్డుకుంటోందని నటుడు సోను సూద్ ఆరోపించారు.

కోవిడ్ పై పోరులో మీకు సహకరిస్తాం, మీ ఆర్దర్లను అడ్డుకోకుండా చూస్తాం, సోను సూద్ కు చైనా రాయబారి హామీ
Sonu Sood
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 01, 2021 | 8:41 PM

ఈ కోవిడ్ సమయంలో చైనా నుంచి ఇండియాకు పలు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లకు సంబంధించి తాను పంపిన ఆర్దర్లను చైనా అడ్డుకుంటోందని నటుడు సోను సూద్ ఆరోపించారు. ఇండియాకు  వందలాది  కాన్సెంట్రే టర్ల ను తెప్పించడానికి తాము యత్నిస్తుంటే చైనా అడ్డగిస్తోందని, (ఇక్కడ ఇండియాలో) ప్రతి నిముషానికి  ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయంలో ఇండియాలోని చైనా రాయబారి గానీ లేదా ఆ దేశ విదేశాంగ మంత్రి గానీ జోక్యం చేసుకుని తమ కాన్సెంట్రేటర్లు ఇక్కడికి చేరేలా చూడాలని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ లోని చైనా రాయబారి  సన్ వీ డాంగ్…కోవిద్ పై పోరులో మీకు పూర్తిగా సహకరిస్తామని, మీ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ఇండియాకు చేరేలా చూస్తామని హామీ ఇచ్చారు. తనకు తెలిసినంతవరకు చైనా నుంచి ఇండియాకు నార్మల్ గా విమాన సర్వీసులు  నడుస్తున్నాయన్నారు.   గత 2 వారాలుగా 61 రవాణా విమానాలు తమ దేశం నుంచి ఈ దేశానికి వచ్చాయని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా.. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రధాని మోదీకి లేఖ రాస్తూ .. ఇండియాలో  కోవిడ్ పరిస్థితిపై  తాము ఎంతో ఆందోళన   చెందుతున్నామని , తమ ప్రభుత్వం, తమ ప్రజల తరఫున సానుభూతి తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఈ విపత్కర సమయంలో మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన  అన్నారు.  చైనా విదేశాంగ మంత్రి కూడా  మన విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ,ఎస్. జైశంకర్ తో ఫోన్ లో మాట్లాడారు. తమ దేశం నుంచి ఆక్సిజన్ సిలిండర్లను, ఇతర వైద్య పరికరాలను ఇండియాకు పంపుతామని హామీ ఇచ్చారు. ఉభయ దేశాల మంత్రులూ ఇరు దేశాల వాణిజ్య సహకారం పైన కూడా చర్చించుకున్నారు. ఇంచుమించు పలు దేశాలు ఇండియా నుంచి ప్రయాణాలపై తమ దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించినప్పటికీ చైనా మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.

మరిన్ని ఇక్కడ చూడండి: SAIL Recruitment 2021: `సెయిల్‌`లో డాక్ట‌ర్‌, న‌ర్సు పోస్టుల ఖాళీలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

DFCCIL Recruitment 2021: రైల్వే శాఖకు చెందిన డిడికేటెడ్‌ ప్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు