DFCCIL Recruitment 2021: రైల్వే శాఖకు చెందిన డిడికేటెడ్‌ ప్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

DFCCIL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డిడికేటెడ్‌ ప్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి..

DFCCIL Recruitment 2021: రైల్వే శాఖకు చెందిన డిడికేటెడ్‌ ప్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు
Follow us

|

Updated on: May 01, 2021 | 8:25 PM

DFCCIL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డిడికేటెడ్‌ ప్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1074 ఖాళీలను భర్తీ చేయనున్నారు. జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటీవ్‌లు, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు సివిల్‌, ఆపరేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలి కమ్యూనికేషన్ తదితర విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది.

అర్హతల వివరాలు..

జూనియర్ మేనేజర్.. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, కంట్రోల్ మాన్యుఫాక్చర్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్‌లో తెలిపింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నోటిఫికేషన్లో చూడవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. ఇక అభ్యర్థుల వయసు విషయానికొస్తే 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

ఎగ్జిక్యూటీవ్:

సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, పవర్ సప్లై/అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాల్లో డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 30 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

అలాగే జూనియర్ ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాలకు టెన్త్, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. వేతనం రూ. 25 వేల నుంచి రూ. 68 వేల వరకు చెల్లించనున్నారు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ మే 23.

ఇవీ కూడా చదవండి:

TS PGECET 2021: తెలంగాణ పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు.. ఎప్పటివరకంటే..?

Railway Recruitment 2021: పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్‌ 30 చివరి తేదీ

ICAI CA Intermediate: ఐసీఏఐ కీలక నిర్ణయం.. సీఏ, ఇంటర్మీడియేట్‌ పరీక్షలు వాయిదా.. ఎందుకంటే..!