Amazing Facts: పుదుచ్చేరి గురించి ఆసక్తికరమైన విషయాలు.. ఇక్కడ ఆగస్టు 16న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటారు..ఎందుకో తెలుసా..?

Puducherry Amazing Facts: ఏప్రిల్‌ 6న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 33 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. అయితే గురువారం పశ్చిమబెంగాల్‌ 8వ దశ ఓటింగ్‌ తర్వాత బెంగాల్‌,..

Amazing Facts: పుదుచ్చేరి గురించి ఆసక్తికరమైన విషయాలు.. ఇక్కడ ఆగస్టు 16న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటారు..ఎందుకో తెలుసా..?
Puducherry
Follow us
Subhash Goud

| Edited By: TV9 Telugu

Updated on: May 07, 2024 | 11:28 AM

Puducherry Amazing Facts: ఏప్రిల్‌ 6న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 33 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. అయితే గురువారం పశ్చిమబెంగాల్‌ 8వ దశ ఓటింగ్‌ తర్వాత బెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం, కేరళ రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పుదుచ్చేరిలో ఈ సారి ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలో ఎన్డీఏ పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎగ్జిట్ పోల్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే అసలు ఫలితాలు తెలియాలంటే మే 2 తేదీ వరకు వేచి చూడాల్సిందే. అయితే పుదుచ్చేరికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇదో అందమైన ప్రదేశం. ఇక్కడి ఆసక్తికరమైన విషయాలున్నాయి.

► దక్షిణ భారతదేశంలో ఉన్న పుదుచ్చేరిని పాండిచ్చేరి అని కూడా పిలుస్తారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అందమైన ప్రదేశానికి ప్రసిద్ది. ఇక్కడ ఫ్రెంచ్‌ డిజైన్‌లో నిర్మించిన చాలా ఇళ్లను ఇక్కడ చూడవచ్చు. పుదుచ్చేరి ఒకప్పుడు ఫ్రెంచ్‌ వారికి, సంస్కృతి మరియు నాగరికతకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది.

► పుదుచ్చేరికి 1673 నుంచి ఫ్రెంచ్‌ ప్రజలు వలస రావడం జరిగింది. ఫ్రెంచ్‌ ప్రజలు పుదుచ్చేరిని తమ ఇల్లులా భావించారు. అందుకే ఫ్రెంచ్‌ వాస్తు శిల్పాలను అనుసరించి ఇక్కడ ఇళ్లు నిర్మించడం ప్రారంభించారు. ఇక్కడ ఫ్రెంచ్‌ డిజైన్‌ కలిగిన అనేక ఇళ్లు ఉంటాయి. దీనిని లిటిల్‌ ఫ్రాన్స్‌ అని కూడా పిలుస్తారు. పుదుచ్చేరిలో అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

► పుదుచ్చేరిలో నిర్మించిన చాలా భవనాలు తెలుపు రంగులో ఉంటాయి. కాబట్టి వైట్‌ టౌన్‌ అని కూడా పిలుస్తుంటారు.

► పుదుచ్చేరిలో వినాయకుడి ఆలయం ఉంది. ఆలయానికి సమీపంలో ఉన్న ఏనుగులు ప్రజల నుంచి నాణేలు తీసుకుని ఆశీర్వదిస్తుంటాయి.

► అప్పటి వివరాల ప్రకారం.. 1962కు ముందు పుదుచ్చేరిని ఫ్రాన్స్‌ పాలించింది. అయితే పుదుచ్చేరిలో ఫ్రాన్స్‌ పాలనను అంతం చేసేందుకు ఫ్రెంచ్‌ ప్రభుత్వం అప్పట్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. కానీ పుదుచ్చేరి భారతదేశంలో అధికారిక భాగం కావడానికి 9 సంవత్సరాలు పట్టింది. భారత్‌లో భాగమైన రోజు ఆగస్టు 16, 1962. అయితే ఇక్కడ ఆగస్టు 15కు బదులుగా 16న పుదుచ్చేరిలో స్వాంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇదే కారణం.

► పుదుచ్చేరి ఒక అందమైన ప్రదేశం. ఇక్కడ ఉండే సముద్రం పక్కన అనేక బీచ్‌లు ఉంటాయి. ఈ రాష్ట్రంలో నాలుగు జిల్లాలున్నాయి. వీటిలో రెండు జిల్లాలు తమిళనాడుకు అనుకుని ఉండగా, మిగవి ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలకు అనుకుని ఉంటాయి. పుదుచ్చేరి తమిళనాడు సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ తమిళం, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్‌ భాషలు మాట్లాడారు. ఇక్కడ తమిళంతో పాటు ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌ భాషలకు అధికారిక హోదా ఉంది.

ఇవీ కూడా చదవండి:

ఫ్రిజ్‌కి కుండకి ఉన్న తేడా ఏమిటీ..? కుండ నీరు ఎందుకు చల్లగా ఉంటుంది..! ఎప్పుడైనా ఆలోచించారా..!

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!