ఫ్రిజ్‌కి కుండకి ఉన్న తేడా ఏమిటీ..? కుండ నీరు ఎందుకు చల్లగా ఉంటుంది..! ఎప్పుడైనా ఆలోచించారా..!

Pot Water : వేసవి కాలం వచ్చింది. తాగునీటి అవసరం కూడా పెరిగింది. ఇప్పుడు ప్రజలు ఫ్రిజ్ ద్వారా నీటిని చల్లబరిచి తాగుతున్నారు..

ఫ్రిజ్‌కి కుండకి ఉన్న తేడా ఏమిటీ..? కుండ నీరు ఎందుకు చల్లగా ఉంటుంది..! ఎప్పుడైనా ఆలోచించారా..!
Matka
Follow us

|

Updated on: May 01, 2021 | 6:24 PM

Pot Water : వేసవి కాలం వచ్చింది. తాగునీటి అవసరం కూడా పెరిగింది. ఇప్పుడు ప్రజలు ఫ్రిజ్ ద్వారా నీటిని చల్లబరిచి తాగుతున్నారు.. కానీ చాలామంది మట్టి కుండలోని నీటిని మాత్రమే తాగుతారు. ఈ నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. కుండలో నీరు ఎందుకు చల్లగా ఉంటుంది.. ఇతర పాత్రలలోని నీరు ఎందుకు చల్లగా ఉండదు.. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఇప్పుడు కుండలోని రహస్యం ఏంటో తెలుసుకుందాం.

కుండలోని నీరు బాష్పీభవనం వల్ల చల్లబడుతుంది. వాస్తవానికి మట్టి పాత్రకు లోహ పాత్రకన్నా ఎక్కువ బాష్పీభవనం ఉంటుంది ఎందుకంటే దానికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల నుంచి నీరు బయటకు వచ్చి వేడి ద్వారా ఆవిరవుతుంది. ఈ కారణంగా కుండ లోపల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఈ పద్దతినే బాష్పీభవనం అంటారు అందుకే కుండలోని నీరు చల్లగా ఉంటుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఎక్కువ వేడి ఉన్నప్పుడు ఈ బాష్పీభవన ప్రక్రియ వేగంగా జరుగుతుంది. కుండలోని నీరు ఆరోగ్యానికి హాని కలిగించదు, దాహాన్ని తీర్చగలదు.

పాట్ వాటర్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఎన్నో పరిశోధనలలో తేలింది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఏదైనా వ్యాధితో పోరాడటానికి మీ శరీరానికి కావలసిన బలం చేకూరుస్తుంది. అదనంగా బాడీలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. ఆమ్లత్వం వంటి సమస్యలు అధిగమించబడతాయి. మీ గొంతుకు కూడా ఉపశమనం లభిస్తుంది. వాస్తవానికి రిఫ్రిజిరేటర్ లోని చల్లటి నీరు తాగడం వల్ల అకస్మాత్తుగా గొంతు కణాల ఉష్ణోగ్రత పడిపోతుంది, గొంతు నొప్పి వస్తుంది. కానీ కుండ నీరు గొంతుకు హాయినిస్తుంది.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొనాల్సిందే ! కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ హితవు

Air Lift: బోయింగ్ 737 విమానం.. ఒక్కడే ప్రయాణీకుడు..4 వేల కిలోమీటర్లు..ఎందుకంటే..

టీకా వేసుకున్నాక మద్యానికి దూరంగా ఉండాలా..? ఒకవేళ తాగితే కలిగే దుష్పరిణామాలు ఏంటి..! తెలుసుకోండి..