AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొనాల్సిందే ! కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ హితవు

దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతుండడంతో ..ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చలు జరిపి ఓ జాతీయ వ్యూహాన్ని రూపొందించాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సూచించారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొనాల్సిందే ! కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ హితవు
Congress Chief Sonia Gandhi
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 01, 2021 | 5:27 PM

Share

దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతుండడంతో ..ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చలు జరిపి ఓ జాతీయ వ్యూహాన్ని రూపొందించాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సూచించారు. కేంద్రంతో బాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేల్కొనాలని, తమ బాధ్యతలను నెరవేర్చాలని ఆమె అన్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేస్తూ… ఇప్పటికే సమయం మించిపోయిందని, ఇక జాప్యం చేయరాదని అన్నారు. వలస కూలీల వలసలను ఆపాలని, సంక్షోభం ముగిసేవరకు వారికి కనీసం 6 వేలరూపాయలను వారి ఖాతాలలో జమ చేయాలని సోనియా అన్నారు.  5 నిముషాల ఈ వీడియోను తమ పార్టీ ట్విటర్ లో షేర్ చేశారు. దేశ ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని, దేశ వ్యాప్తంగా టెస్టింగ్ చేపట్టాలని, యుధ్ధ ప్రాతిపదికన ఆక్సిజన్, ఇతర వనరులను ఏర్పాటు చేయాలన్నారు.  వ్యాక్సిన్ కవరేజీని పెంచడానికి వ్యాక్సిన్ లైసెన్స్ ను తప్పనిసరి చేయాలి….ప్రాణాధార మందుల బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టాలి.. అని సోనియా కోరారు. ప్రతి రోజు లక్షల మంది కోవిడ్ కి గురవుతున్నారని, వేలమంది మరణిస్తున్నారని పేర్కొన్న ఆమె.. ఇది మనకు పరీక్షాకాలమని అన్నారు. ఈ తరుణంలో అందరం కలిసి ఈ మహమ్మారి అదుపునకు కృషి చేద్దాం అని అన్నారు.

గంటల తరబడి కోవిడ్ రోగులకు సేవలు చేస్తున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లందరికీ తలవంచుతున్నానని సోనియా అన్నారు. గతంలో మన దేశం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని అధిగమించిందని, ఇప్పుడు కోవిద్ పై పోరులో  తమ పార్టీ కేంద్రానికి సహకరిస్తుందని సోనియా గాంధీ వెల్లడించారు. ఢిల్లీలోని వివిధ ఆసుపత్రులకు ఇంకా ఆక్సిజన్ అందలేదని తెలుస్తోందని,  ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని దీన్ని తీర్చాలన్నారు.  యుధ్ధ ప్రాతిపదికన  ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆమె సూచించారు. లోగడ కూడా సోనియా ఇలాగే వీడియో ద్వారా ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన విషయం గమనార్హం.

మరిన్ని ఇక్కడ చూడండి: Air Lift: బోయింగ్ 737 విమానం.. ఒక్కడే ప్రయాణీకుడు..4 వేల కిలోమీటర్లు..ఎందుకంటే

టీకా వేసుకున్నాక మద్యానికి దూరంగా ఉండాలా..? ఒకవేళ తాగితే కలిగే దుష్పరిణామాలు ఏంటి..! తెలుసుకోండి..