టీకా వేసుకున్నాక మద్యానికి దూరంగా ఉండాలా..? ఒకవేళ తాగితే కలిగే దుష్పరిణామాలు ఏంటి..! తెలుసుకోండి..

Covid-19 Vaccine : దేశంలో కరోనా విలాయతాండవం చేస్తోంది. దీంతో టీకా ప్రచారం వేగవంతం అవుతోంది. మే 1 నుంచి మూడో దశ టీకాలు

టీకా వేసుకున్నాక మద్యానికి దూరంగా ఉండాలా..? ఒకవేళ తాగితే కలిగే దుష్పరిణామాలు ఏంటి..! తెలుసుకోండి..
Wine
Follow us
uppula Raju

|

Updated on: May 01, 2021 | 5:18 PM

Covid-19 Vaccine : దేశంలో కరోనా విలాయతాండవం చేస్తోంది. దీంతో టీకా ప్రచారం వేగవంతం అవుతోంది. మే 1 నుంచి మూడో దశ టీకాలు వేయడం ప్రారంభమవుతుంది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి టీకాలు వేస్తారు. అయితే ప్రజలకు టీకా గురించి చాలా సందేహాలు ఉన్నాయి. అందులో ఒక సాధారణ ప్రశ్న ఏంటంటే టీకా వేసుకున్నాక మద్యానికి దూరంగా ఉండాలా అనేది ఇప్పుడు అందరిలో నెలకొన్న ప్రశ్న. టీకా, మద్యానికి సంబంధించిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ విధంగా స్పందించింది.

కరోనా వ్యాక్సిన్ ప్రభావాన్ని ఆల్కహాల్ తగ్గిస్తుందని ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవు. మెడిసిన్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఎ) ప్రకారం.. ఆల్కహాల్ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని ఎటువంటి ఆధారాలు లేవు. దీని గురించి ఆందోళన చెందుతున్న వారు వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మద్యం అధికంగా సేవించడం వల్ల శరీరంలో ప్రతికూల ప్రభావాలు మొదలవుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.

ఇర్విన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ వైరస్ రీసెర్చ్ డైరెక్టర్ ఇల్హామ్ మెసాడి ప్రకారం.. ఒక వ్యక్తి పరిమితంగా మద్యం తాగితే శరీరంలో వ్యాక్సిన్ ప్రభావాలను తగ్గించే ప్రమాదం లేదు. ఏది ఏమైనప్పటికీ మద్యం సేవించకపోతే మీ ఆరోగ్యానికి మంచిదని రుజువు చేస్తుంది. మద్యం, ధూమపానం మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలిగిస్తాయి. కరోనా సమయంలో అవి మానుకుంటే శరీరానికి చాలా వరకు మంచి చేసినట్లే.

రోడ్డు పక్కన ట్రక్కులో 2 లక్షలకు పైగా డోసుల వ్యాక్సిన్, పత్తా లేని, డ్రైవర్, క్లీనర్, ఎక్కడంటే ?

మీరు జీన్స్‌ ప్యాంట్స్‌ని ఉతుకుతున్నారా..! అయితే తప్పు చేస్తున్నారు..? ఎందుకో తెలుసుకోండి..

Cheap Thief: వీడి కక్కుర్తి పాడుకానూ..ఈ మహానుభావుడు ఏటీఎంలో ఏమి దొంగిలించాడో తెలిస్తే మీరు కచ్చితంగా అబ్బా..ఛీ అంటారు!