మీరు జీన్స్‌ ప్యాంట్స్‌ని ఉతుకుతున్నారా..! అయితే తప్పు చేస్తున్నారు..? ఎందుకో తెలుసుకోండి..

Wash Jeans Process : మీరు ధరించే దుస్తులలో చాలా వరకు జీన్స్‌కి సంబంధించే ఉంటాయి. అమ్మాయిలు, అబ్బాయిలు అనే

మీరు జీన్స్‌ ప్యాంట్స్‌ని ఉతుకుతున్నారా..! అయితే తప్పు చేస్తున్నారు..? ఎందుకో తెలుసుకోండి..
Jeans
Follow us

|

Updated on: May 01, 2021 | 4:29 PM

Wash Jeans Process : మీరు ధరించే దుస్తులలో చాలా వరకు జీన్స్‌కి సంబంధించే ఉంటాయి. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడాలేకుండా అందరూ వీటిని ఇష్టపడుతారు. అయితే వీటి గురించి మీరు ఎక్కువగా పట్టించుకోరు. సమయం దొరికినప్పుడల్లా ఉతుకుతుంటారు. అయితే ఇదే మీరు చేస్తున్న పెద్ద తప్పు. చాలా మంది నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ కిష్టమైన జీన్స్‌ని పదే పదే ఉతకడం మంచి పద్దతి కాదంటున్నారు. ఇలా చేస్తే మీరు పెద్ద తప్పు చేస్తున్నారని అంటున్నారు. ప్రపంచంలోని మొట్టమొదటి జీన్స్ సృష్టికర్త, ప్రపంచవ్యాప్త ప్రసిద్ధ జీన్స్ కంపెనీ లెవిస్ CEO చిప్ బెర్గ్ జీన్స్ ని ఎప్పుడూ ఉతకకూడదని చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం, లేవిస్ వెబ్‌సైట్‌లో జీన్స్‌ను ఎప్పుడూ ఉతకకూడదని బ్లాగులో కూడా రాసుకొచ్చారు. అతడి ప్రకారం వాషింగ్ మెషీన్లో జీన్స్ ఉతరకడం అవసరం లేదు. అవసరమైతేనే అది చేయాలి.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే జీన్స్ ఉతకకూడదు.. మరి ఎలా శుభ్రం చేయాలంటే దానికొక మార్గం చెప్పాడు. జీన్స్ పై పడిన ఏదేని మరకలను టూత్ బ్రష్ తో శుభ్రం చేయాలన్నాడు. జీన్స్ ని ఉతకడం వల్ల దాని పదార్థం దెబ్బతింటుందని, నీరు కూడా వృథా అవుతుందని చిప్ బెర్గ్ సూచించాడు. కొత్త జీన్స్‌ను కనీసం 6 నెలల తర్వాత మాత్రమే ఉతకాలన్నాడు. అప్పుడే అది మంచిగా కనబడుతుందని చెప్పాడు. జీన్స్ నుంచి బ్యాక్టీరియాను నివారించడానికి మాత్రం రాత్రిపూట ఫ్రిజ్‌లో పెట్టాలన్నాడు.

ఉదయం అందులో నుంచి తీసి ఎండలో ఆరేయాలని సూచించాడు. ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజుల వరకు దానిని ఉతకవలసిన పనిలేదన్నాడు. జీన్స్ శుభ్రంగా లేదని మీకు అనిపిస్తే.. చల్లటి నీటితో ఉతకాలన్నాడు. జీన్స్ ను ఇతర బట్టల నుంచి విడిగా ఉతకాలన్నాడు. అంతేకాదు వాషింగ్ మెషీన్లో కాకుండా చేతితో శుభ్రం చేయాలన్నాడు. అంతేకాకుండా వాషింగ్ గురించిన సమాచారం జీన్స్ ట్యాగ్ మీద ఉంటుందని అందరు గమనించాలని సూచించాడు.

Cheap Thief: వీడి కక్కుర్తి పాడుకానూ..ఈ మహానుభావుడు ఏటీఎంలో ఏమి దొంగిలించాడో తెలిస్తే మీరు కచ్చితంగా అబ్బా..ఛీ అంటారు!

Vaccine Second Dose: క‌రోనా సెకండ్ డోస్ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని టెన్ష‌న్ అవుతున్నారా.? ఏం ప‌ర్లేదు అంటోన్న నిపుణులు..