AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheap Thief: వీడి కక్కుర్తి పాడుకానూ..ఈ మహానుభావుడు ఏటీఎంలో ఏమి దొంగిలించాడో తెలిస్తే మీరు కచ్చితంగా అబ్బా..ఛీ అంటారు!

అదేదో సినిమాలో వీడేంట్రా ఇంత జాగ్రత్తగా కొడుతున్నాడు అంటాడొకడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న ఓ వీడియో చూస్తున్న మొదట్లో వీడేంట్రా ఇంత శ్రద్ధగా వెతుకుతున్నాడు అనిపిస్తుంది. తరువాత మనోడు చేసిన పనికి వీడి కక్కుర్తి పాడుకానూ.. అనిపిస్తుంది.

Cheap Thief: వీడి కక్కుర్తి పాడుకానూ..ఈ మహానుభావుడు ఏటీఎంలో ఏమి దొంగిలించాడో తెలిస్తే మీరు కచ్చితంగా అబ్బా..ఛీ అంటారు!
Sanitizer Stealing From Atm
KVD Varma
|

Updated on: May 01, 2021 | 4:22 PM

Share

Cheap Thief: అదేదో సినిమాలో వీడేంట్రా ఇంత జాగ్రత్తగా కొడుతున్నాడు అంటాడొకడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న ఓ వీడియో చూస్తున్న మొదట్లో వీడేంట్రా ఇంత శ్రద్ధగా వెతుకుతున్నాడు అనిపిస్తుంది. తరువాత మనోడు చేసిన పనికి వీడి కక్కుర్తి పాడుకానూ.. అనిపిస్తుంది. కొందరు చొరశిఖామణులు మాత్రం డబ్బూ..బంగారం..గ్లాసూ.. చెంబే కాదు శానిటైజరూ దొంగతనం చేయాల్సిందే అంటున్నారు. అవును.. ఒక మహానుభావుడు హ్యాండ్ శానిటైజర్ దొంగిలిస్తూ సీసీ కెమెరాలకు దొరికిపోయాడు. పోనీ మనోడు భారీ స్థాయిలో శానిటైజర్ దుకాణం ఏదైనా లూటీ చేశాడా అంటే అదీలేదు. ఒక ఏటీఎం లో ఉంచిన శానిటైజర్ బాటిల్ లేపేశాడు. అంత కక్కుర్తి దొంగతనామ్ వీడియో చూసిన నెటిజనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఆ దొంగతనం ఏమిటో చూడండి..

కరోనావైరస్ మహమ్మారితో పోరాడటానికి ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్లు ఆయుధాలుగా మారాయి. ఇళ్ళు, కార్యాలయాలు, రెస్టారెంట్లు మొదలైన ప్రవేశ ద్వారాల వద్ద ఉంచిన హ్యాండ్ శానిటైజర్ బాటిల్స్ గత సంవత్సరం నుంచి సాధారణ దృశ్యంగా మారాయి. ఇప్పుడు, ఒక వ్యక్తి ఏటీఎం కియోస్క్ నుండి చేతి శానిటైజర్ బాటిల్‌ను దొంగిలించే వీడియో ఆన్‌లైన్‌లో హంగామా చేస్తోంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఫేస్ మాస్క్ ధరించి, ఏటీఎం ఉపయోగించిన తర్వాత తన కార్డును తిరిగి తన వాలెట్‌లో ఉంచిన వ్యక్తిని 33 సెకన్ల సీసీటివి ఫుటేజ్ లో చూడొచ్చు. అతను చుట్టూ తిరిగి చూసుకుని, హ్యాండ్ శానిటైజర్ బాటిల్‌ను తీసుకొని, ఏటీఎం కియోస్క్ నుండి బయలుదేరే ముందు తన బ్యాక్‌ప్యాక్‌లో ఉంచుకున్నాడు. ఈ సంఘటన ఏప్రిల్ 24 న జరిగింది.

“ఇవి క్లెప్టోమానియాక్. దేశంలో లక్షలాది ఏటీఎంలు ఉన్నాయి. ఈ మూర్ఖుల నుండి శానిటైజర్‌ను కాపాడటానికి, ప్రతి ఏటీఎంలో శానిటైజర్ కోసం ఒక కేజ్ ఏర్పాటు చేస్తే దానికి 200-300 రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుంది. ఇలా అన్ని ఏటీఎంలలో చేయాలంటే అది వందల కోట్ల రూపాయలు పడుతుంది. ఏటీఎంలు ఉపయోగించే వారు మీ మంచి ప్రవర్తన ద్వారా ఆ సొమ్మును ఆదా చేయండి. ఇటువంటి పనులు చేయకండి.” అంటూ దీపాన్షు కబ్రా ఈ వీడియో షేర్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చారు.

ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పటికే 30 వేలకు పైగా ఈ వీడియోను చూశారు. చాలా మంది దీనిని షేర్ చేశారు. వీడియో చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ గ్రేట్ దొంగతనం మీరూ చూడండి..

Also Read: Vaccine Second Dose: క‌రోనా సెకండ్ డోస్ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని టెన్ష‌న్ అవుతున్నారా.? ఏం ప‌ర్లేదు అంటోన్న నిపుణులు..

వెంటిలేటర్‌పై ఉన్న మహిళకు గోమూత్రం.. బీజేపీ నేత నిర్వాకం.. మూఢనమ్మకాలతో ప్రయోగాలు