Vaccine Second Dose: క‌రోనా సెకండ్ డోస్ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని టెన్ష‌న్ అవుతున్నారా.? ఏం ప‌ర్లేదు అంటోన్న నిపుణులు..

Vaccine Second Dose: యావ‌త్ దేశాన్ని అత‌లాకుతలం చేస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుకోవ‌డంలో ప్ర‌స్తుతం మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేష‌న్‌. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది....

Vaccine Second Dose: క‌రోనా సెకండ్ డోస్ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని టెన్ష‌న్ అవుతున్నారా.? ఏం ప‌ర్లేదు అంటోన్న నిపుణులు..
Corona Vaccine
Follow us
Narender Vaitla

|

Updated on: May 01, 2021 | 4:16 PM

Vaccine Second Dose: యావ‌త్ దేశాన్ని అత‌లాకుతలం చేస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుకోవ‌డంలో ప్ర‌స్తుతం మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేష‌న్‌. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో క‌రోనా ప్ర‌భావం చాలా త‌క్కువ‌గా ఉంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలుతోన్న అంశాలు కాస్త సానుకూలంగా మారాయి. అయితే కొన్ని రోజుల క్రితం వ‌ర‌కు చాలా మందిలో వ్యాక్సినేష‌న్‌పై అనుమానాలు ఉన్నా.. ఇప్పుడిప్పుడే ఈ ప్ర‌క్రియ‌పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం పెరుగుతోంది. తాజాగా 18 ఏళ్లు నిండిన వారు బారి ఎత్తున వ్యాక్సినేష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డ‌మే దీనికి ఉదాహ‌ర‌ణ‌.

ఇదిలా ఉంటే క‌రోనా మొద‌టి డోసు తీసుకున్న కొంద‌రికి సెకండ్ డోస్ అంద‌డంలో కాస్త ఆల‌స్య‌మ‌వుతోంది. దీంతో చాలా మంది భ‌యాందోళ‌న‌ల‌కు గురవుతున్నారు. మొద‌టి డోస్ తీసుకొని ఆల‌స్యంగా సెకండ్ డోస్ తీసుకుంటే అది ప‌నిచేయ‌దేమో అన్న అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌ణ్‌దీప్ గులేరియా. ఈ విష‌య‌మై ఆయ‌న మాట్లాడుతూ.. సెకండ్ డోస్ తీసుకోవ‌డం ఆల‌స్య‌మైనా గాబ‌రా ప‌డొద్ద‌ని, ఆల‌స్య‌మైనా అది ప‌నిచేస్తుంద‌ని, ఎవ‌రూ వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండ‌కూడ‌ద‌ని చెప్పుకొచ్చారు. ఇక కోవిడ్ నుంచి కోలుకున్న వారు కూడా త‌ప్ప‌కుండా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ఆయ‌న తెలిపారు. కోవిడ్ నుంచి కోలుకున్న‌రెండు వారాల తర్వాతే వ్యాక్సిన్‌ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే మెజార్టీ వైద్యులు మాత్రం లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిన తర్వాత 4-6 వారాల్లో తీసుకోవచ్చని చెబుతున్నారని వివ‌రించారు.

Also Read: Assembly Election Result 2021: నిలిచేదెవరు.. గెలిచేదెవరు.. రేపే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. టీ9లో ఇలా వీక్షించండి..

Organic Laddu Prasadam: తిరుమలలో కొత్త ఆచారానికి అధికారుల శ్రీకారం.. శ్రీవారికి ప్రకృతి సిద్ధ వంటకాలతో నైవేద్యం..!

Rana Daggubati: మరో పాన్ ఇండియా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రానా.. ఆ నిర్మాణ సంస్థ బ్యానర్‏లోనే మూవీ..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు