వెంటిలేటర్‌పై ఉన్న మహిళకు గోమూత్రం.. బీజేపీ నేత నిర్వాకం.. మూఢనమ్మకాలతో ప్రయోగాలు

కరోనావైరస్‌తో పోరాడటానికి కొందరు మూఢనమ్మకాలకు దగ్గరవుతున్నారు. ఎవరో ఏదో చెప్పింది విని సొంత వైద్యం చేసుకుంటూ......

వెంటిలేటర్‌పై ఉన్న మహిళకు గోమూత్రం.. బీజేపీ నేత నిర్వాకం.. మూఢనమ్మకాలతో ప్రయోగాలు
Gau Mutra To Corona Patient
Follow us
Ram Naramaneni

|

Updated on: May 01, 2021 | 5:17 PM

వెంటిలేటర్‌పై ఉన్న మహిళకు గోమూత్రం.. బీజేపీ నేత నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్‌ అయిన పోస్ట్‌ కరోనావైరస్‌పై మూఢనమ్మకాలతో ప్రయోగాలు

కరోనావైరస్‌తో పోరాడటానికి కొందరు మూఢనమ్మకాలకు దగ్గరవుతున్నారు. ఎవరో ఏదో చెప్పింది విని సొంత వైద్యం చేసుకుంటూ ప్రాణాలమీదకుతెచ్చుకుంటున్నారు. సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే ఓ బీజేపీ నేత మరో అడుగేసి దారుణంగా వ్యవహరించారు. వృధ్దురాలికి గోమూత్రం తాగించాడు. వారం రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

ముందుగా ఈ వీడియోను ట్విటర్‌లో సూరత్ జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ కిషోర్ బిందాల్ పోస్టు చేశారు. ఈ వీడియోకు 80వేల వ్యూస్ రాగానే వెంటనే డిలీట్ చేసారు. ఆ తర్వాత మరో సోషల్ మీడియా సైట్లో పోస్ట్‌ చేసారు. కోవిడ్ బారిన పడి వెంటిలేటర్‌పై ఉంటూ శ్వాస తీసుకునేందుకు పోరాడుతోన్న ఓ వృద్ధురాలి నోట్లో ఓ బీజేపీ నేత గోమూత్రం పోశాడు. అంతేకాదు ఆమెతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నించాడు. అయితే హాస్పిటల్ ఎక్విప్‌మెంట్ నుంచి ఇతర శబ్దాలు రావడంతో ఆ వృద్ధురాలితో ఆ వ్యక్తి ఏం మాట్లాడాడో స్పష్టంగా వినిపించలేదు. ఇక కొన్ని హిందుత్వ సంస్థలు అసలు ఇంగ్లీష్ మందులతో పనే లేదంటున్నాయి. కరోనాను జయించేందుకు గోమూత్రమే పరమఔషధమని చెబుతున్నాయి. అయితే గోమూత్రం కరోనాకు లేదా క్యాన్సర్‌కు విరుగుడుగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.

Also Read: మే 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ పోస్ట్.. అసలు నిజమిదే.!

 బొమ్మ గన్ తో దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చాడు.. క‌ట్ చేస్తే ఊహించ‌ని ట్విస్ట్

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు