Lockdown: మే 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ పోస్ట్.. అసలు నిజమిదే.!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉంటుందంటూ గత కొద్దిరోజులుగా..

Lockdown: మే 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ పోస్ట్.. అసలు నిజమిదే.!
Follow us
Ravi Kiran

|

Updated on: May 01, 2021 | 3:31 PM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉంటుందంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇక దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. ఆ వార్తలన్నీ కూడా అవాస్తవమేనని కొట్టిపారేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ వేదికగా స్పష్టతను ఇచ్చింది.

కరోనా నేపథ్యంలో మే 3వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు దేశవ్యాప్త లాక్ డౌన్ విధిస్తారని సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. పూర్తిగా అవాస్తవమని.. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రకటన ఏమి చేయలేదని పీఐబీ ట్విటర్ ద్వారా పేర్కొంది. కాగా, కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెల 20వ తేదీన ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లాక్ డౌన్ చివరి ఆప్షన్ అని చెప్పుకొచ్చారు. ఇక అప్పటి నుంచి లాక్ డౌన్ ఉంటుందంటూ ప్రచారం మొదలైంది. దీనిపై తాజాగా పీఐబీ స్పష్టత ఇస్తూ.. ఈ వార్తలన్నీ ఫేక్ అని.. ఇలాంటి ప్రకటనలు ప్రజలు నమ్మి మోసపోవద్దని పేర్కొంది. కాగా, కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించిన సంగతి తెలిసిందే.

Read also:

Viral: నల్ల త్రాచు, ముంగీస మధ్య యుద్ధం.. వైరల్ వీడియో.. చివరికి ఎవరు గెలిచారంటే.!

 కరోనాతో మరణిస్తే రూ. 2 లక్షలు వస్తాయా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..!