Corona: కరోనాతో మరణిస్తే రూ. 2 లక్షలు వస్తాయా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. వివరాలివే.!

ఈ కరోనా కాలంలో వాస్తవాల కంటే నకిలీ వార్తలే సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లలో..

Corona: కరోనాతో మరణిస్తే రూ. 2 లక్షలు వస్తాయా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. వివరాలివే.!
Covid Deaths
Follow us

|

Updated on: May 01, 2021 | 9:15 AM

ఈ కరోనా కాలంలో వాస్తవాల కంటే నకిలీ వార్తలే సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లలో తరచూ ఏదొక రూమర్ హల్చల్ చేస్తూనే ఉంది. వాటిల్లో ఇది కూడా ఒకటి. తాజాగా ఓ మెసేజ్ వాట్సాప్, నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

కరోనాతో మీ కుటుంబసభ్యులు ఎవరైనా మరణించినట్లయితే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన((పీఎంజెజెబీవై), ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్ బీవై) పధకాల కింద రూ. 2 లక్షల వరకు పరిహారాన్ని కేంద్రం ఇస్తున్నట్లు ఓ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. ఈ మధ్యకాలంలో మీ బ్యాంక్ ఖాతా నుంచి రూ.12 లేదా రూ. 330 కట్ అయితే మీరు ఈ పధకంలో చేరినట్లేనని.. రూ. 2 లక్షల కోసం బీమా క్లెయిమ్ చేసుకోవచ్చునని” ఆ మెసేజ్ సారాంశం.

ఇక దీనిపై పీఐబీ క్లారిటీ ఇచ్చింది. ఈ రెండు పధకాలు కోవిడ్ మరణాలకు వర్తించవని.. యాక్సిడెంట్ లేదా శాశ్వత అంగవైకల్యం చెందిన సందర్భంలోనే క్లెయిమ్ చేసుకోవచ్చునని PIB స్పష్టం చేసింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ మరణాలను ప్రమాదవశాత్తు మరణం కింద పరిగణించరని.. పీఎంజెజెబీవై పధకం కింద ఉన్నవారు ఎవరైనా మరణిస్తే కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే లభిస్తుందని, పీఎంఎస్ బీవై  కింద లభించదని పీఐబి ఫాక్ట్ చెక్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

Read also:

Viral: నల్ల త్రాచు, ముంగీస మధ్య యుద్ధం.. వైరల్ వీడియో.. చివరికి ఎవరు గెలిచారంటే.!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు ధరలు ఫిక్స్..