Viral Puri Trick: ఇదెక్కడి మాస్ ఐడియా బ్రో.. పూరీలు ఇలా కూడా చేయొచ్చా? ఇతడి తెలివికి నెటిజన్లు ఫిదా!..
సాధారణంగా వంటగది చిట్కాలు అనగానే మనకు గృహిణులే గుర్తొస్తారు. కానీ, ఒక వ్యక్తి పూరీల తయారీలో ప్రదర్శించిన తెలివి చూసి ఇప్పుడు మహిళలే అవాక్కవుతున్నారు. పూరీ కర్ర అందుబాటులో లేకపోయినా, అస్సలు కంగారు పడకుండా తన వద్ద ఉన్న సామాగ్రితోనే పని కానిచ్చేసిన ఇతడి ఐడియా ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. వంటను శ్రమతో కాకుండా తెలివిగా ఎలా పూర్తి చేయాలో నేర్పిస్తున్న ఈ వీడియో కేవలం కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. ఆ అద్భుతమైన కిచెన్ హ్యాక్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వంట చేయడం ఒక ఎత్తు అయితే, అందులో సృజనాత్మకతను చూపించడం మరో ఎత్తు. ముఖ్యంగా పూరీలు చేయాలంటే పిండి ఉండలను కర్రతో ఎంతో ఓపిగ్గా, సమానంగా రుద్దాల్సి ఉంటుంది. చాలామందికి ఈ ప్రక్రియ ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలోని వ్యక్తి మాత్రం ఆ కష్టాన్ని చిటికెలో మాయం చేసేశాడు.
ఏమిటా ఐడియా?
వైరల్ వీడియో ప్రకారం.. సదరు వ్యక్తి పూరీలు వండాలని ఫిక్స్ అయ్యాడు. కానీ వంటగదిలో పూరీల కర్ర కనిపించలేదు. సాధారణంగా అయితే ఎవరైనా పని వాయిదా వేసుకుంటారు లేదా పక్కవారిని అడుగుతారు. కానీ ఈ వ్యక్తి మాత్రం తన దగ్గర ఉన్న ఒక స్టీల్ గిన్నెను ఆయుధంగా మార్చుకున్నాడు. ముందుగా గోధుమ పిండి ఉండలను సిద్ధం చేసుకున్నాడు. ఆపై ఒక్కో ఉండపై గిన్నె అడుగు భాగాన్ని ఉంచి, అటూ ఇటూ తిప్పుతూ గట్టిగా నొక్కాడు. గిన్నె తీసి చూడగా.. పిండి ఉండ కాస్తా పర్ఫెక్ట్ రౌండ్ షేప్‌లో ఉండే పూరీలా మారిపోయింది!
View this post on Instagram
సోషల్ మీడియాలో వైరల్ :
ఈ వినూత్న ప్రయోగం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. “తెలివిలో మహిళలకే షాకిచ్చావుగా బ్రో!” అంటూ కొందరు, “ఐడియా అదిరిపోయింది.. రేపటి నుంచి మేం కూడా ఇదే ఫాలో అవుతాం” అంటూ మరికొందరు కామెంట్లు కురిపిస్తున్నారు. ఈ వీడియోకు ఏకంగా 73 మిలియన్ల వ్యూస్, 2.5 మిలియన్ల లైక్స్ రావడం విశేషం. వంటగదిలో సౌకర్యాలు లేవని బాధపడేవారికి, ముఖ్యంగా బ్యాచిలర్లకు ఇతడి ‘అతి తెలివి’ ఒక బంపర్ ఆఫర్ లా మారిందనడంలో సందేహం లేదు.
