AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: షాకింగ్.. జబర్దస్త్ కు గుడ్ బై చెప్పబోతున్న మరో స్టార్ కమెడియన్! కారణమిదే

గతంలో జబర్దస్త్ లో కమెడియన్లుగా ఓ వెలుగు వెలిగిన వారందరూ ఇప్పుడు సినిమాల్లోనూ మెరుస్తున్నారు. హీరోలు, డైరెక్టర్లుగా, కమెడియన్లుగా, సహాయక నటులుగా రాణిస్తున్నారు. ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ మెగా ఫోన్ పట్టనున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడని టాక్.

Jabardasth: షాకింగ్.. జబర్దస్త్ కు గుడ్ బై చెప్పబోతున్న మరో స్టార్ కమెడియన్! కారణమిదే
Jabardasth Comedian
Basha Shek
|

Updated on: Feb 24, 2026 | 5:53 PM

Share

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో అవకాశాలు తెచ్చుకోని ఆర్థికంగా స్థిరపడ్డారు.. గతంలో జబర్దస్త్ లో స్కిట్స్ చేసిన సుడిగాలి సుధీర్, బలగం వేణు, రామ్ ప్రసాద్, గెటప్ శీను, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ తదితరులు ఇప్పుడు సినిమాల్లో మెరుస్తున్నారు. హీరోలు, సహాయక నటులుగా, కమెడియన్లుగా, నిర్మాతలుగా, డైరెక్టర్లుగా.. ఇలా తమకు అచ్చొచ్చిన రంగాల్లో సత్తా చాటుతున్నారు. ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్ గా మారనున్నాడు. మెగా ఫోన్ పట్టి సినిమాలు తీసేందుకు రెడీ అయ్యాడు. అతను మరెవరో కాదు తన ఆటో పంచులతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించే ఆటో రామ్ ప్రసాద్. గతంలో జబర్దస్త్ లో చేసిన వేణు, ధనరాజ్, అదిరే అభి డైరెక్టర్లుగా మారారు. తమ టేకింగ్ తో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు రామ్ ప్రసాద్ కూడా ఈ జాబితాలో చేరేందుకు సిద్ధమయ్యాడని సమాచారం.

రచయితగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ ప్రసాద్. ఆ తర్వాత సుధీర్, గెటప్ శ్రీనుతో కలిసి స్కిట్స్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. మరోవైపు కమెడియన్ గా సినిమాల్లోనూ మెరుస్తున్నారు. ఈ నేపథ్యంలో గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదే ఇంటర్వ్యూలో గెటప్ శ్రీను మాట్లాడుతూ.. ‘రామ్ ప్రసాద్ డైరెక్టర్ అవ్వాలి. త్వరలో కాబోతున్నాడు కూడా. ఆ పనులు కూడా జరుగుతున్నాయి’ అని అన్నాడు. కాగా సినిమాల్లో బిజీ కావడంతో ఇప్పటికే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ కు దూరమయ్యారు. మరి త్వరలోనే డైరెక్టర్ అయితే రామ్ ప్రసాద్ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనున్నాడా? అనేది త్వరలో క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

ఆటో రామ్ ప్రసాద్ లేటెస్ట్ ఫొటోస్..

హైపర్ ఆదితో కలిసి విహార యాత్రలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us