Indian Navy: ఆక్సిజన్ సరఫరాకు మేము సైతం అంటున్న భారత నేవీ.. ఆపరేషన్ సముద్ర సేతు – 2 ప్రారంభం
దేశంలోని ఆక్సిజన్ కొరతపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. నిన్నటి వరకు ప్లైట్స్‌లో వచ్చిన ప్రాణవాయువు ఇప్పటు విదేశాల నుంచి షిప్‌ల్లో దిగుమతి జరుగుతోంది.
Indian Navy Operation Samudra Setu-II: దేశంలోని ఆక్సిజన్ కొరతపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. నిన్నటి వరకు ప్లైట్స్‌లో వచ్చిన ప్రాణవాయువు ఇప్పటు విదేశాల నుంచి షిప్‌ల్లో దిగుమతి జరుగుతోంది. దీని కోసం అక్సిజన్ సముద్ర సేతు-2 అని కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టారు.
దేశంలో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. ఆపరేషన్ సముద్ర సేతు-2 పేరుతో విదేశాల నుంచి ఆక్సిజన్ క్రయోజనిక్ కంటెయినర్లు సహా అనుబంధ వైద్య పరికరాలను యుద్దనౌకల ద్వారా భారత్కు రవాణా చేయనుంది. ఈ ఆపరేషన్ కింద.. లిక్విడ్ ఆక్సిజన్ నిండిన క్రయోజెనిక్ కంటైనర్లు, అనుబంధ వైద్య పరికరాలను యుద్ద నౌకల ద్వారా నౌకాదళం రవాణా చేయనుంది. ఇందు కోసం ప్రత్యేకంగా భారత యుద్ధ నౌకల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటి ద్వారా క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్ల రవాణా అయ్యే విధంగా కొన్ని చేర్పులు మార్పులు కూడా చేశారు.
Read Also… ఇండియా నుంచి ప్రయాణాలపై అమెరికా ఆంక్షలు, వచ్చేవారం నుంచి అమలు, వైట్ హౌస్ ప్రకటన