Lockdown: ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగింపు.. రోడ్డు మీద క‌నిపిస్తే క‌రోనా టెస్ట్.. 15 రోజుల క్వారంటైన్‌

Rajasthan Lockdown: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో

Lockdown: ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగింపు.. రోడ్డు మీద క‌నిపిస్తే క‌రోనా టెస్ట్.. 15 రోజుల క్వారంటైన్‌
Rajasthan Lockdown
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 01, 2021 | 7:50 AM

Rajasthan Lockdown: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కరోనా కట్టడి కోసం పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించి చర్యలు తీసుకుంటున్నారు. రాజ‌స్థాన్‌లో కూడా క‌రోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. దీంతో మహమ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఉన్న క‌ర్ఫ్యూను మ‌రికొన్ని రోజులపాటు పొడిగించింది. మే 17 వ‌ర‌కూ లాక్‌డౌన్ కొన‌సాగ‌ుతుందని ప్రకటించింది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. క‌రోనా నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎవ‌రైనా.. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల మ‌ధ్య అన‌వ‌స‌రంగా రోడ్ల మీద‌కు వ‌స్తే, వారికి అక్క‌డిక‌క్క‌డే క‌రోనా పరీక్షలు చేయ‌నున్నారు. పరీక్షల అనంతరం ఒక‌వేళ వారికి పాజిటివ్ అని తేలితే.. వారిని వెంట‌నే 15 రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి తరలించనున్నారు.

అయితే.. లాక్‌డౌన్ కొన‌సాగే స‌మ‌యంలో అన్ని మార్కెట్ల‌ను మూసివేయ‌నున్నారు. అలాగే విద్యాసంస్థ‌లు, కోచింగ్ సెంటర్లను, రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వివాహ కార్యక్రమాలను 31 మంది బంధువుల సమక్షంలో మూడు గంట‌ల వ్య‌వ‌ధిలో ముగించాల్సి ఉంటుందని.. బరాత్ లాంటివి ఉండకూడదంటూ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీంతోపాటు ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు కేవ‌లం మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ వాహ‌నాల‌ను మాత్ర‌మే అనుమ‌తించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టంచేసింది.

Also Read:

Fire Accident: కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 18 మంది దుర్మరణం.. మరి కొంతమంది పరిస్థితి..

Petrol, Diesel price Today: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?