Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol, Diesel price Today: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

Petrol, Diesel Rates Today: దేశంలో ఇటీవల కాలంలో భారీగా పెరిగిన చమురు ధరలకు బ్రేక్ పడింది. నిత్యం అడ్డు అదుపు లేకుండా పెరిగిన

Petrol, Diesel price Today: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Petrol Diesel price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 01, 2021 | 6:43 AM

Petrol, Diesel Rates Today: దేశంలో ఇటీవల కాలంలో భారీగా పెరిగిన చమురు ధరలకు బ్రేక్ పడింది. నిత్యం అడ్డు అదుపు లేకుండా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరగడంతో అందరూ ఆందోళన చెందారు. కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ కూడా దాటింది. అయితే.. గత కొన్ని రోజులుగా సామాన్యులకు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభిస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. అన్నిచోట్ల ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాలు మరికొన్ని చోట్లనే ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.30 గా ఉంది. డీజిల్‌ ధర రూ.89.85 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర 95.36 ఉండగా.. డీజిల్‌ ధర రూ.88.92 గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.69 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.22 గా ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిన్న పెట్రోల్‌ ధర రూ.93.99 కి ఉండగా.. డీజిల్‌ ధర రూ.88.05 కి చేరింది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.93.76 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.82 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు.. ఇలా.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.61 గా ఉంది.

Also Read:

Tihar Jail: కరోనా సెకండ్ వేవ్.. తీహార్ జైల్లో నలుగురు ఖైదీల మృతి.. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారుల లేఖ

Illicit Liquor: కాటేసిన కల్తీ మద్యం.. ఐదుగురు మృతి.. మరో ఆరుగురి పరిస్థితి విషమం..

కాలేజీ ఫేర్వెల్‌ పార్టీలో ప్రసంగిస్తూ విద్యార్ధిని మృతి.. వీడియో
కాలేజీ ఫేర్వెల్‌ పార్టీలో ప్రసంగిస్తూ విద్యార్ధిని మృతి.. వీడియో
ఆష్లీ గార్డనర్ పెళ్లి ఫొటోలు వైరల్.. ప్రేమకు పరాకాష్ఠ!
ఆష్లీ గార్డనర్ పెళ్లి ఫొటోలు వైరల్.. ప్రేమకు పరాకాష్ఠ!
వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్‌!
వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్‌!
శ్రీవారి సాక్షిగా.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే గుడ్ న్యూస్
శ్రీవారి సాక్షిగా.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే గుడ్ న్యూస్
ఒక్క క్షణం ఆలస్యమైతే అంతే.. వీడియో
ఒక్క క్షణం ఆలస్యమైతే అంతే.. వీడియో
కైలాసలో నిత్యానంద భూ దందా.. 20 మంది శిష్యులపై బహిష్కరణ వీడియో
కైలాసలో నిత్యానంద భూ దందా.. 20 మంది శిష్యులపై బహిష్కరణ వీడియో
ఆ పథకాల్లో పెట్టుబడితో రాబడి వరద.. పెట్టుబడికి బోలెడంత భరోసా..!
ఆ పథకాల్లో పెట్టుబడితో రాబడి వరద.. పెట్టుబడికి బోలెడంత భరోసా..!
కాస్ట్‌లీ కారు కొన్న సాహో బ్యూటీ.. ధర ఎన్ని కోట్లో తెలిస్తే ..
కాస్ట్‌లీ కారు కొన్న సాహో బ్యూటీ.. ధర ఎన్ని కోట్లో తెలిస్తే ..
అప్పటికే తీవ్ర అనారోగ్యం..విమానం గాల్లో ఉండగా ..వీడియో
అప్పటికే తీవ్ర అనారోగ్యం..విమానం గాల్లో ఉండగా ..వీడియో
ఈ అద్భుతమైన 5G స్మార్ట్‌ఫోన్‌లు 10 వేల కన్నా తక్కువ ధరకే..
ఈ అద్భుతమైన 5G స్మార్ట్‌ఫోన్‌లు 10 వేల కన్నా తక్కువ ధరకే..