Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు.. ఈరోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Gold Price On May 1st 2021: బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా ? అయితే మీకు శుభవార్త. బంగారం ధరలు పడిపోయాయి. మరోసారి పసిడి ధరలు నేల వైపు చూస్తున్నాయి.
Gold Price On May 1st 2021: బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా ? అయితే మీకు శుభవార్త. బంగారం ధరలు పడిపోయాయి. మరోసారి పసిడి ధరలు నేల వైపు చూస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి ఇది ఊరట కలిగించే వార్త అని చెప్పుకోవాలి. శనివారం ఉదయం పసిడి ధరలు మారోసారి తగ్గాయి. మే నెల ప్రారంభంలోనే బంగారం ధరలు తగ్గడం పసిడి ప్రియులకు శుభవార్త అనే చెప్పుకోవాలి. శనివారం ఉదయం (మే 1న) 10 గ్రాముల 22 క్యారెట్లో ధర రూ. 44,170 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,170గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని పసిడి ధరలలో కూడా భారీగానే మార్పులు జరిగాయి.
శనివారం ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,780గా ఉంది. ఇక ముంబై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,170 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,170గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,370గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,570గా ఉంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కె్ట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,780గా ఉంది. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,100ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,110గా ఉంది. దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ బంగారం ధరలు మాత్రం కొంత హెచ్చుతగ్గులను నమోదుచేసుకుంటున్నాయి. గతేడాది కరోనా ప్రభావంతో ఆల్ టైం రికార్డ్ కు చేరిన పసిడి ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. దీంతో బంగారం ప్రియులు మరోసారి పసిడి కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.
Also Read: కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఆ బ్యాంక్.. మే 1 నుంచి అమలులోకి కొత్త రూల్స్.. అవెంటంటే..
పాత కాయిన్స్కు డిమాండ్.. ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారి అయినట్లే… ఎలాగో తెలుసా..