Groom Dies: యూపీలో విషాదం… నవ వరుడి ప్రాణాలను మింగేసిన కరోనా మహమ్మారి.. పెళ్లైన 72 గంటలకే మృతి

Groom Died With Corona: కంటికి కనిపించని శత్రువు.. కాటు వేసి కళ్లు తెరిచేలోపే కాటికి పంపుతోంది. చాప కింద నీరు పాకుతున్న కరోనా మహమ్మారి తేరుకునే సరికే పని కానిచ్చేస్తోంది. తాజా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నవవరుడిని మింగేసింది. బిజ్నౌర్‌లో ఈ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. పెళ్లైన 72 గంట‌ల వ్యవ‌ధిలోనే వ‌రుని ఆనందాన్ని క‌రోనా లాగేసుకుంది. క‌రోనా కార‌ణంగా వ‌రుడు వివాహం జరిగిన రెండు రోజుల‌కే క‌న్నుమూశాడు. పెళ్లి తంతు పూర్తి అయ్యిన మరునాడే పెళ్లి […]

Groom Dies: యూపీలో విషాదం... నవ వరుడి ప్రాణాలను మింగేసిన కరోనా మహమ్మారి.. పెళ్లైన 72 గంటలకే మృతి
Follow us

|

Updated on: May 01, 2021 | 7:24 AM

Groom Died With Corona: కంటికి కనిపించని శత్రువు.. కాటు వేసి కళ్లు తెరిచేలోపే కాటికి పంపుతోంది. చాప కింద నీరు పాకుతున్న కరోనా మహమ్మారి తేరుకునే సరికే పని కానిచ్చేస్తోంది. తాజా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నవవరుడిని మింగేసింది. బిజ్నౌర్‌లో ఈ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. పెళ్లైన 72 గంట‌ల వ్యవ‌ధిలోనే వ‌రుని ఆనందాన్ని క‌రోనా లాగేసుకుంది. క‌రోనా కార‌ణంగా వ‌రుడు వివాహం జరిగిన రెండు రోజుల‌కే క‌న్నుమూశాడు. పెళ్లి తంతు పూర్తి అయ్యిన మరునాడే పెళ్లి కొడుకు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించారు. దీంతో అతనికి కరోనా పాజిటివ్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వ‌రుడిని ఆసుప‌త్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ క‌న్నుమూశాడు.

యూపీలోని బిజ్నౌర్‌కు చెందిన అర్జున్‌కు ఏప్రిల్ 25న చాంద్‌పూర్‌కు చెందిన యువతితో వివాహం జ‌రిగింది. పెళ్లి తంతు అంతా పూర్తయ్యాక రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో అప్పగింత‌ల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఊరేగింపుగా వ‌ధూవ‌రులు వ‌రుని ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంత‌లోనే వ‌రుడు అర్జున్‌కు అనారోగ్యానికి గురయ్యాడు. వెంట‌నే అత‌నిని ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్కడ వైద్య పరీక్షల్లో అత‌నికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో అర్జున్‌కు కోవిడ్ `19 వార్డుకు త‌ర‌లించారు. అయితే అక్కడ అతని ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత విష‌మంగా మారింది. ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ అందుబాటులో లేనికార‌ణంగా వ‌రుడు క‌న్నుమూశాడు. ఈ విష‌యం తెలియ‌గానే బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంత‌లో వ‌ధువు కూడా అనారోగ్యం పాల‌య్యింది. వెంట‌నే ఆమెకు క‌రోనా టెస్టులు చేయించారు. అయితే ఆమెకు క‌రోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కాగా, ఈ పెళ్లికి హాజరైన అతిథులు సైతం వరుసగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారి రిపోర్టు రావాల్సి ఉందని సమాచారం.

Read Also…. Fire Accident: కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి.. మరి కొంతమంది పరిస్థితి..