ఎండాకాలంలో మీ ముఖాన్ని కాపాడుకోవడానికి మామిడి పండ్లు చాలా ఉపయోగపడతాయి… కానీ ఎలా వాడాలి అంటే..
Mango Face Pack: వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. ఇవి ఎక్కువగా ఎండాకాలంలోనే దొరుకుతుంటాయి. ఇక ఇందులో పోషక విలువలతోపాటు చర్మాన్ని కూడా కాపాడతాయి.
Mango Face Pack: వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. ఇవి ఎక్కువగా ఎండాకాలంలోనే దొరుకుతుంటాయి. ఇక ఇందులో పోషక విలువలతోపాటు చర్మాన్ని కూడా కాపాడతాయి. ఇక సమ్మర్లో వచ్చే వేడి గాలుల నుంచి చర్మాన్ని కాపాడటానికి ఇవి ఎంతో సహయపడతాయి. చర్మానికి మృదుత్వాన్ని ఇవ్వడమే కాకుండా.. ప్రకాశవంతంగా కూడా చేస్తుందట. అయితే ఈ మామిడి పండ్లను ఎలా వాడాలి అని చూస్తున్నారా ? అయితే కోన్ని రకాల మామిడి ఫేస్ ప్యాక్స్ గురించి తెలుసుకోవాల్సిందే.
1. చర్మం పై ఉన్న డెడ్ స్కీన్ తొలగించడానికి మామిడి ప్యాక్ చాలా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ మామిడి గుజ్జు, ఒక టీస్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ పాలు తీసుకోని అన్నింటిని ఒకచోట బాగా కలపాలి. ఆ తర్వాత మీ ఫేస్ పై ఈ మిశ్రమాన్ని అద్ది అలా 10 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే. మీ చర్మం మృదువుగా ఉంటుంది.
2. మామిడి పండ్లతో సన్ టాన్ కూడా తొలగించవచ్చు. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ మామిడి గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ల వేరుశెనగ పిండి, రెండు టీస్పూన్ల బాదం పొడి, ఒక టీస్పూన్ తేనె తీసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖం, చేతులపై రాసి 15 నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేస్తే టాన్ తొలగిపోతుంది.
3. చర్మం పై ఉన్న జిడ్డును తోలగించడానికి ఒకటి బాగా పండిన మామిడి పండును చితకొట్టాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, 3 టేబుల్ స్పూన్ల మూల్తానీ మట్టి కలపాలి. ఇది అప్లై చేయడానికి కంటే ముందు మీ ముఖన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని రాసి 20 నిమిషాలు ఆరబెట్టాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖంపై జిడ్డును తగ్గిస్తుంది.
4. ఇక ముఖంపై ఉండే మొటిమలను కూడా తగ్గించడానికి మామిడి ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది. పెరుగు, తేనెతోపాటు మామిడి గుజ్జు ప్యాక్ ట్రైచేస్తే బెటర్. మామిడి గుజ్జును వేరు చేసి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, రెండు టీస్పూన్ల తేనె కలపాలి. దీనిని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ప్రయోజనాలు..
1. మామిడి గుజ్జును చర్మంపై రాయడం వలన రంద్రాలు క్లియర్ అవుతాయి. అలాగే బ్లాక్ హెడ్స్, మొటిమలను నివారిస్తాయి. 2. మామిడి చర్మం మంటను తగ్గిస్తుంది. 3. మామిడి కొల్లజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అలాగే చర్మం ఉండే ముడతలను తగ్గిస్తుంది. 4. నల్ల మచ్చలను తగ్గిస్తుంది. అలాగే స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది.