AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccine: కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ v వ్యాక్సిన్ల మధ్యగల తేడాలు, పోలికలు ఎంటో తెలుసా.. నిపుణుల సూచనలు..

Covishield, Covexin, Sputnik V: ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.దీంతో కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్ పంపిణిని మరింత వేగవంతం చేశాయి.

Corona Vaccine: కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ v వ్యాక్సిన్ల మధ్యగల తేడాలు, పోలికలు ఎంటో తెలుసా.. నిపుణుల సూచనలు..
Covid Vaccine
Rajitha Chanti
|

Updated on: May 01, 2021 | 2:34 PM

Share

Covishield, Covexin, Sputnik V: ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.దీంతో కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్ పంపిణిని మరింత వేగవంతం చేశాయి. ప్రస్తుతం దేశంలో రెండు టీకాలు ఆమోదించబడ్డాయి. అలాగే రష్యాను వచ్చే మరో వ్యాక్సిన్ కోసం దేశం ఎదురుచూస్తుంది. అయితే ఏప్రిల్ 28న కోవిన్ పోర్టల్లో 18-45 ఏళ్లలోపు వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే1న ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రభుత్వం మొదటి దశలో 45 ఏళ్లు పైబడినవారికి మాత్రమే ఈ టీకాను అందిస్తుంది. ఇక ప్రస్తుతం పరిస్థితులలో ప్రైవెట్ ఆసుపత్రులలో కూడా ఈ టీకాను అమ్మడానికి ప్రభుత్వం అనుమతించింది. దీంతో సీరం ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా బుధవారం తమ టీకా కోవిషీల్డ్ ను రూ.300కు రాష్ట్ర ప్రభుత్వాలను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది.గతంలో దీని ధర రూ.400 ఉండే. ఇక అలాగే మనదేశంలో కోవాక్సిన్ టీకా కరోనా వైరస్ ను నియంత్రించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్, అమెరికా అగ్రదేశ పాండమిక్ నిపుణుడు డాక్టర్ అంథోని ఫౌసీ చెప్పారు. అలాగే కరోనాను నియంత్రించడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ కోవాక్సిన్ పనిచేస్తుందని న్యూయార్క్ టైమ్స్ లో మంగళవారం ప్రచురితమైంది. అలాగే ప్రోటీన్లతో జతచేయబడి ఉంది. స్పైక్ ప్రోటిన్స్ అని పిలవబడేవి మరింత నిరోదక శక్తిని పెంచుతాయి. ఇక ఈ రెండు కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు… ప్రభుత్వ కేంద్రాలతోపాటు, ప్రైవెట్ ఆసుపత్రులలో రూ.250కే లభిస్తాయి. అలాగే స్పుత్నిక్ V టీకా దిగుమతి చేసుకున్న తర్వాత , విదేశీ వ్యాక్సిన్లు మే 1 శనివారం తర్వాత మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.

Corona Vaccine

Corona Vaccine

ఇక స్పూత్నిక్ టీకా రెండు వేర్వేరు వెక్టర్లను ఉపయోగిస్తుంది. అందుకే ఈ టీకా రెండు డోసులు భిన్నంగా ఉంటాయి. వీటిని రెండు తీసుకోవాల్సిందే. అలాగే ఆస్ట్రాజెనెకా యొక్క కోవిషీల్డ్, భారత్ బయోటెక్ వారి కోవాక్సిన్ టీకాలను రెండు వేర్వేరు వ్యాక్సిన్లను మిళితం చేస్తే రెండు మోతాదులకు సరిపోలడం లేదని అంటువ్యాధి నిపుణుడు, వైరాలజిస్ట్ చెప్పారు. అందుకే ఎక్కువ మోతాదుకు అవసరమయ్యే వ్యాక్సిన్ల కోసం సాధారణంగా మూడు వారాల తర్వాత రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ప్రతిరోదకాలు విచ్చిన్నం కావడానికి అలాగే పూర్తిగా పనిచేయడానికి ఎనిమిది వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా ప్రజలు కరోనా నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ చేతులను శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి కొనసాగించాల్సిందే.

Also Read: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఆ రోజు నుంచే అమలులోకి…

Remdesivir: యాంటీ వైర‌ల్ డ్రగ్ కొరత తీర్చేందుకు కేంద్రం ప్రయత్నాలు.. విదేశాల నుంచి రెమ్‌డెసివర్ దిగుమ‌తికి అనుమతి