Corona Food: కరోనా నుంచి కోలుకున్నాక నీరసంగా ఫీలవుతున్నారా.? అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే..
Corona Food: కరోనా మహమ్మారి యావత్ దేశాన్ని భయాందోళనకు గురి చేస్తోంది. వైరస్ కారణంగా లక్షలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఇక ఓ వైపు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే...
Corona Food: కరోనా మహమ్మారి యావత్ దేశాన్ని భయాందోళనకు గురి చేస్తోంది. వైరస్ కారణంగా లక్షలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఇక ఓ వైపు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఓ వైపు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోన్నా.. మరోవైపు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఆశించిన స్థాయిలో పెరుగుతుండడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. దాదాపు 80 శాతం కంటే ఎక్కువ మంది హోమ్ ఐసోలేషన్ ద్వారానే కోలుకుంటున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో నీరసం ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. మరి కరోనా చికిత్స సమయంలో మంచి ఆహారం తీసుకొని… కోలుకున్న వెంటనే నిర్లక్ష్యం చేస్తే ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కరోనాను జయించిన వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* కరోనా నుంచి కోలుకున్న వారు వీలైనంత వరకు ఎక్కువగా నీటిని తాగే ప్రయత్నం చేయాలి. డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్త వహించాలి. కేవలం నీరే కాకుండా కొబ్బరి నీటిని కూడా తీసుకుంటూ ఉండాలి.
* రోజులో ఎక్కువ సమయంలో ఏదో ఒక పండును తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా దానిమ్మ, బత్తాయి, యాపిల్, బొప్పాయి వంటి పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. కేవలం పండ్లే కాకుండా జ్యూస్ రూపంలో కూడా తీసుకున్నా పర్లేదు.
* రోజు రాత్రి నిద్రించే ముందు వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగాలి. దీనివల్ల ఎముకలు ధృడంగా మారడంతో పాటు శరీరంలోని నీరసం పారిపోతుంది.
* తీసుకునే ఆహారంలో పాలకూర, టమాట, బీట్ రూట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటిని జ్యూస్ రూపంలో తీసుకున్నా మంచి ఫలితం లభిస్తుంది.
* కరోనా నుంచి కోలుకున్న వారు త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. మాంసాహారాన్ని బాగా ఉడికిన తర్వాత తీసుకోవాలి.
* కోవిడ్ నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా ఏమైనా జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటే.. మాములు వేడీ నీటితో రోజుకు రెండు నుంచి మూడు సార్లు ఆవిరి పట్టుకోవాలి.
* ఓవైపు ఇలాంటి ఆహారం తీసుకుంటూనే విటమిన్ సీ, జింక్ వంటి ట్యాబ్లెట్లను తీసుకోవాలి (డాక్టర్ల సూచన మేరకు). నెగిటివ్ వచ్చిన వెంటనే విటమిన్ ట్యాబ్లెట్లను మానకూడదు.
* కరోనా నుంచి కోలుకున్నామని అశ్రద్ధతో ఉండొద్దు. నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా కనీసం పది రోజుల పాటు మాస్కును కచ్చితంగా ధరించాలి. మీ కుటుంబ సభ్యులకు కూడా కొన్నిరోజులపాటు దూరంగా ఉంటే మంచిది.
* వైరస్ కారణంగా కొందరిలో ఊపిరితిత్తులు బలహీనపడే అవకాశాలుంటాయి. కాబట్టి ఊపిరితిత్తులకు మేలు చేసే ప్రాణాయామం వంటి ఎక్సర్‌సైజ్‌లు చేస్తుండాలి. ఇలాంటి కొన్ని చిట్కాలు పాటిస్తూ కోల్పోయిన మీ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
Also Read: Covid Rules: మార్కెట్లలో కనిపించని కరోనా నిబంధనలు.. భారీ మూల్యం తప్పదని అధికారుల హెచ్చరికలు..!
Akka Mahadevi: మల్లన్న మహాభక్తురాలు అక్కమహాదేవి విశిష్టత .. ఆమె తపస్సు చేసిన గుహ గురించి తెలుసా..!
కుర్చీలోనే కుప్పకూలిన ప్రభుత్వ ఉద్యోగి..టెస్టుల్లో బయటపడిన షాకింగ్ నిజం!